twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: నారి నారి నడుమ రిషి.. సాక్షి సాన్నిహిత్యంతో వసుని టీజింగ్!

    |

    గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. వసుధార రిషి మీద ప్రేమ పెరిగిన విషయాన్ని అర్థం చేసుకొని ఎలా అయినా అది ఆయన దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే గత కొన్ని ఎపిసోడ్లుగా రకరకాల ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.. ఇక మంగళవారం నాడు ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా ప్రారంభమైంది.. మంగళవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఎలాంటి ఆసక్తికర విశేషాలు చోటు చేసుకున్నాయి అనే విషయం మీద ఒక లుక్కు వేద్దాం.

    ఫైల్ మిస్ అయిందని

    ఫైల్ మిస్ అయిందని


    మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు మనల్ని ముందుకు నడిపిస్తుందని దీనికి మినిస్టర్ గారి సహకారం కూడా మరువలేనిది అంటూ రిషి మాట్లాడుతుంటాడు. డిబీఎస్టి కాలేజీ ఒక విద్యాసంస్థలా కాకుండా సేవా సంస్థగా మారిందంటే అది అందరి సహకారం వల్లే సాధ్యమైంది అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెబుతున్నానని అంటూనే ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరుతో అందరినీ పిలిచి ట్రైనింగ్ ఇవ్వబోతున్నామని దీనికి చదువుల పండుగ అని పేరు పెట్టుకుందామని ప్రపోజ్ చేయగా అందరూ దాన్ని అంగీకరిస్తూ చప్పట్లు కొడతారు.. అలా మాట్లాడుతూ ఉండగానే మేడం ఆ ఫైల్ ఇవ్వండి అని జగతిని రిషి అడిగితే జగతి వసుధారను ఇవ్వమని అడుగుతుంది . యితే వసుధార వెతుక్కుని ఆ ఫైల్ మిస్ అయిందని అంటుంటే సరిగ్గా అదే సమయానికి అదే ఫైల్ తీసుకుని సాక్షి లోపలికి ఎంట్రీ ఇస్తుంది.

    మిస్సయిన ఫైల్ తీసుకుని

    మిస్సయిన ఫైల్ తీసుకుని

    విత్ యువర్ పర్మిషన్ నేను ఈ మీటింగ్ లో కూర్చోవచ్చా అని అడిగితే వసుధార కచ్చితంగా రిషి సర్ వద్దంటారు అనుకుంటుంది కానీ రిషి రా సాక్షి వచ్చి కూర్చోమని అనడంతో వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది. సాక్షి కూడా వచ్చి అందరికీ నమస్కారం చెప్పి తనకు కాలేజీకి సంబంధం లేకపోయినా ఈ ప్రాజెక్టులో వాలంటరీగా పని చేయాలని అనుకుంటున్నాను అని అంటుంది. దానికి రిషి మీరంతా ఓకే అనుకుంటే నేను ఈమెను ప్రాజెక్టులోకి తీసుకుంటానని అంటాడు. డాడ్ మీరు ఏమంటారు అని అడిగితే మహేంద్ర నాకు ఓకే అనడంతో మిగతా వాళ్ళు కూడా సరే అంటారు. అందరూ సరే అన్నాక వసుధార కూడా సరే అనక తప్పదు. సాక్షి నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటూ ఆవిడ చెప్పాలనుకున్న ఐడియా చెబుతోంది. అయితే సాక్షి అంటే పడదు అనుకుంటూనే ఎందుకు ఆమెకు అవకాశం ఇస్తున్నాడు అని జగతి, మహేంద్ర ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అయితే మిస్సయిన ఫైల్ తీసుకుని అవే ఐడియాస్ ను సాక్షి ప్రజెంట్ చేస్తుంది. అయితే ఈ విషయం తెలియక రిషి వెరీ గుడ్ అండ్ సాక్షిని మెచ్చుకుంటాడు. నువ్వు చెప్పినట్లు కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్లాన్ చేద్దాం అని అంటుంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తూ ఉంటారు.

    రిషికే కదా నష్టం

    రిషికే కదా నష్టం

    ఈ ఫైల్ పోగొట్టడం వల్లే సాక్షికి అవకాశం ఇచ్చాడని భావించిన జగతి వసుధార, నువ్వు ఈమధ్య ఇంతకు ముందులాగా యాక్టివ్ గా ఉండడం లేదు. నేను అడిగిన ఫైల్ నువ్వు మీటింగ్ లో ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే నేను ప్రింట్ తీసి పెట్టాను మేడం కానీ అది కనిపించకుండా పోయిందని అంటుంది. జగతి కూడా జీవితంలో చాలా ప్లానింగ్ ముఖ్యమని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే మర్చిపోయాను, మిస్సయింది అనే లాంటి మాటలు మాట్లాడొద్దని అంటుంది. నేను కరెక్ట్ గానే ఉన్నానని వసుధార అనడంతో నేను గమనిస్తున్నాను కానీ నువ్వు ఈమధ్య సరిగా లేవు నీ తప్పు వల్ల ఇద్దరికీ నష్టం కలిగితే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. ఈ మీటింగ్ ఫైల్, ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ కదా నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా అది రిషికే కదా నష్టం అంటే ఆ ఫైల్ ఎలా మిస్ అయిందో నాకు అర్థం కావడం లేదని ఆమె అంటుంది.

    ఇంటికి పంపించాలని

    ఇంటికి పంపించాలని

    ఇదంతా చూసి సాక్షి తనను తనే అభినందించుకుంటూ చూసావా నీ ఫైల్ కొట్టేసి నీ మార్కులు నేను కొట్టేసాను అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. కాలేజీ నుంచి బయటకు వచ్చిన రిషి ఏంటి నువ్వు ఇంకా వెళ్లలేదా అని సాక్షిని అడిగితే వెళ్లడానికి సిద్ధమయ్యానని అంటుంది. అందరూ వెళ్లిపోయారు కదా లాక్ చెయ్యి అని చెబితే లోపల వసుధారం ఉందని అంటాడు అటెండర్. అయితే రిషితో నేను వెళ్లాలనుకున్నాను కదా వసు ఉంటే ఎలా అనుకున్న సాక్షి వెంటనే క్యాబ్ బుక్ చేసి వసును పంపించే ప్లాన్ చేస్తుంది. సాక్షి రావడంతోటే నేను క్యాబ్ బుక్ చేశానని ఆమె అనడంతో ఓకే నిన్ను ఎలా దింపాలి అని ఆలోచిస్తున్నాను క్యాబ్లో వెళ్ళిపోతావు అన్నమాట సరే అంటే లేదు నేను బుక్ చేసింది వసుధారకు అంటుంది. అదేంటి వసుధారని రూమ్ కి పంపించడం ఎలా కుదురుతుంది మా ఇంటికి వెళ్లి చదువుల పండగ గురించి ప్రిపేర్ చేయాలి కదా అంటాడు. అయితే నేను వచ్చి మీ ఇంటికి వర్క్ చేద్దాం అనుకున్నాను, అందుకే ఆమె ఇంటికి పంపించాలని భావించానని అంటుంది.

     పెళ్లి అయి ఉండేదని

    పెళ్లి అయి ఉండేదని

    నువ్వొచ్చి ఏం చేస్తావ్ జగతి మేడం, వసుధార కలిసి ఆ పని చేయాలని అంటే ఇక ఎలాగో ఆమె ఆ క్యాబ్ క్యాన్సిల్ చేయక తప్పలేదు. వసుధర కార్లో కూర్చునేందుకు వెళుతూ ఉండగా ఆమెను నెట్టేసి మరి ఫ్రంట్ సీట్లో కూర్చోడానికి సాక్షి ప్రయత్నిస్తుంది. అలా సాక్షి కూర్చున్న తర్వాత వసుధార వెనక సీట్ లో ఎక్కి కూర్చుంటుంది. అలా ఎక్కిన తర్వాత ఎవరికి వారు ఆలోచిస్తూ ఉండగా సాక్షి ఎంగేజ్మెంట్ వ్యవహారాన్ని మళ్లీ తెరమీదకు తీసుకొచ్చి మాట్లాడడం మొదలుపెట్టడంతో ఇప్పుడు ఈ టాపిక్ వద్దని రిషి అంటాడు. అయితే మనుషులు అన్నాక తప్పులు చేస్తారు కానీ ఆ తర్వాత వాటి గురించి తెలుసుకుని ఇంత తప్పు చేశానా అనుకుంటూ ఉంటారని తాను ఈ తప్పు చేసి దాన్ని తెలుసుకోవడానికి టైం పట్టిందని అంటుంది. అంతా బాగుండి ఉంటే ఈ పాటికి మనిద్దరికీ పెళ్లి అయి ఉండేదని గుర్తు చేస్తూ ఉంటుంది. దానికి వసుధార వినలేక ప్లీజ్ ఆపుతారా అని అరవడంతో తాజా ఎపిసోడ్ ముగుస్తుంది.

    English summary
    Guppedantha Manasu Episode 500: Rishi conducts a meeting regarding a project. Later, he makes an announcement about Sakhi's role in the project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X