Guppedantha Manasu: ప్రేమ విషయం బయటపెట్టడానికి సిద్దమైన వసు..కొండబద్దలు కొట్టడానికి సర్వం సిద్దం!

గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. గత ఎపిసోడ్లో సాక్షి, రిషి, వసుధార కలిసి ఇంటికి బయలుదేరిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక తాజాగా సాక్షి ముందు సీట్లో కూర్చోవడంతో రిషి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. వెనుక సీట్లో వసుధార ఎక్కుతుంది. అయితే కారు బయలుదేరిన తర్వాత కావాలనే సాక్షి తమ ఎంగేజ్మెంట్ విషయాలను గుర్తు తెచ్చుకొని మరీ మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఈవిడ ఈ విషయాలు గుర్తు చేస్తుంది అని రిషి అనుకుంటూ ఉండగానే సాక్షి అంతా బాగుండే ఉంటే ఇప్పటికే మన ఇద్దరికీ పెళ్లయి ఉండేది కదా అని అనడంతోనే వసుధార కారు ఆపమని అంటుంది. దానికి సాక్షి దిగిపోతావా అంటే నేను దిగిపోవడం కాదు మనందరం దిగి వెళ్లాల్సిన టైం వచ్చేసింది ఇల్లు వచ్చేసింది కానీ మనం ముందుకు వచ్చేసాం అని అనడంతో అసలు నాకేమైంది అనుకుంటూ రిషి కారు వెనక్కి తిప్పుతాడు.

సాయం చేయడం కోసం

సాయం చేయడం కోసం

రిషితో పాటు సాక్షి ఇంట్లోకి రావడం చూసి దేవయాని ఆనంద పడుతూ ఉంటే జగతి, మహేంద్ర సహా గౌతం మాత్రం షాక్ అవుతారు. వెంటనే గౌతమ్ ఏంటంకుల్ సాక్షితో కలిసి వచ్చాడు వీడు అంటే అదే నాకు కూడా అర్థం కావడం లేదని మహేంద్ర అంటాడు. అదే సమయంలో రిషి వెనుక పక్క నుంచి వచ్చిన వసుధార రిషి పక్కనే నిలబడడంతో సాక్షిని దేవయాని వసుధారను జగతి, మహేంద్ర ఆహ్వానిస్తారు. సాక్షి ఎందుకు వచ్చిందని జగతి, మహేంద్ర అడిగితే కాలేజీ పనిలో సాయం చేయడం కోసం వచ్చిందని అంటాడు. దేవయాని వసుధార ఎందుకు వచ్చిందని అడిగితే ఆమె కూడా పనిచేయడం కోసమే వచ్చింది అని అంటాడు. మీరు కూడా ఈ పనిలో సహాయం చేయాలని మహేంద్రకి చెప్పడంతో తాను కూడా చేస్తానని గౌతం అంటాడు నువ్వు అక్కర్లేదు నాన్న చేస్తే చాలు అని అంటాడు రిషి.

భాష తెలియని పుస్తకం

భాష తెలియని పుస్తకం

జగతితో వసుధార సాక్షి రిషి సార్ కి దగ్గర అయ్యేందుకు చాలా ప్రయత్నిస్తోంది నేను ప్రింట్ తీయించి పెట్టుకున్న ఫైల్ కొట్టేసి సార్ దగ్గర తానే అది రెడీ చేసినట్టు మార్కులు కొట్టేసింది. కానీ నేను రిషి సార్ కి ఈ విషయం చెప్పాలి అంటే అదోరకంగా ఉంది. నేను చెబితే చాడీలు చెప్పినట్టు ఉంటుందని చెప్పలేదు అంటుంది. ఆమెకు రిషి సార్ పై ఉన్న ఆసక్తి తప్ప ప్రాజెక్టు పై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని వసు అంటుంది. మరోపక్క సాక్షిని లోపలికి తీసుకు వెళ్లిన దేవయాని నువ్వు వచ్చావు బాగానే ఉంది రిషితో వసూని ఎందుకు రానిచ్చావు అని అడిగితే నేను ఆమెను వేరేగా పంపించడానికి ప్రయత్నించాను కానీ అది కుదరలేదు. ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని తీసుకువచ్చానని అంటుంది.. మరోపక్క గౌతమ్ రిషి తో మాట్లాడుతూ నువ్వు భాష తెలియని పుస్తకం లాంటోడివి కొనుక్కోగలంగానీ చదువుకోలేం అంటూ అనడంతో అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు.

అవసరం ఉండదని

అవసరం ఉండదని


ఇంటికి సాక్షి వసుధార ఇద్దరు ఎందుకు వచ్చారు అంటే ప్రాజెక్టు గురించి వచ్చారని అంటాడు. వసుకి ప్రాజెక్టుపై అవగాహన ఉంది కాబట్టి వచ్చింది అనుకుందాం సాక్షి ఎందుకు వచ్చింది అని అడిగితే సాక్షికి కూడా ఈ ప్రాజెక్టులో పనిచేసి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే వచ్చిందని అంటాడు. దానికి గౌతమ్ అసలు నాకు సాక్షి నచ్చలేదు ఒక చిక్కుముడి విప్పాక మరో చిక్కుముడి విప్పుకుంటాం కానీ నువ్వు చిక్కుముడులు విప్పడానికి బదులు కొత్త కొత్త చిక్కు ముడులు వేసుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు ఎటు వెళుతున్నావు క్లారిటీ ఉందా అని అంటాడు. అయితే ఇదే విషయం వసుధార అన్నప్పటి విషయాన్ని గుర్తు చేసుకుని రిషి బాధపడతాడు. దీంతో నాకు అన్ని విషయాలపై క్లారిటీ ఉంది కానీ కొన్ని విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది, తెచ్చుకుంటానని అంటాడు. అదేంటో గాని కొందరు వడ్డిస్తే అసలు తినబుద్ది కాదని దేవయాని అంటే వసుధార ఒక సంస్కృతంలో అంటే ఆకలేసిన వారికి రుచిగా ఉందా లేదా అనేది అవసరం ఉండదని అర్థం అంటే నిజంగా ఆకలేసేస్తే మిగతా విషయాలు పట్టించుకోరు అన్నది దాని భావం అని మహేంద్ర విశదీకరించి చెబుతాడు.

సీరియస్ గా ఉన్నారని

సీరియస్ గా ఉన్నారని

దానికి దేవయాని సాక్షి నువ్వు కూడా ఏమైనా చెప్పొచ్చు కదా మంచిగా అంటే ఉప్పు కప్పురంబు అనే పద్యం చెప్పడంతో అక్కడ ఉన్న వారందరూ నవుతారు. దానికి జగతి కౌంటర్ ఇస్తూ అంతే కదా అక్కయ్య ఎవరికీ ఏం తెలుసో అదే మాట్లాడుతారు అని అంటుంది. రిషికి వడ్డించేందుకు వసుధార వెళ్లడం చూసి సాక్షిని పంపిస్తుంది దేవయాని. ఆమె వెళ్లి రిషి మీద చూసుకోకుండా మంచినీళ్లు పారబోస్తుంది. దీంతో రిషి అక్కడి నుంచి లేచి మరో చైర్ లో కూర్చుంటాడు. అందరూ భోజనం చేస్తున్న సమయంలో సీరియస్ గా ఉన్నారని ఎందుకలా సీరియస్ గా ఉన్నారని అడగడంతో మహేంద్ర గౌతమ్ ని ఒక పాట పాడమంటాడు..

మనసులో మాట చెప్పేయాలని

మనసులో మాట చెప్పేయాలని

ఇక అలా సరదా సరదాగా భోజనాలు పూర్తయ్యాక అందరూ కలిసి ప్రాజెక్టు పని మొదలుపెడతాడు. ఈ చదువుల పండుగ ప్రాజెక్ట్ ని పెద్దపెద్ద బ్యానర్స్ పెట్టి అందరికీ తెలిసేలా చేయాలని సాక్షి అంటే మనం చేసే పనిలో బాధ్యత కనిపించాలి కాని హంగు ఆర్భాటాలు కనిపించకూడదని వసుధార అంటుంది. అక్కడితో తాజా ఎపిసోడ్ ముగించారు. ఇక రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం నిద్ర వస్తుంది సరిగ్గా ఇదే సమయంలో కాఫీ ఉంటే బాగుండు అని వసుధార అనుకుంటూ ఉండగానే రిషి కాఫీ తెచ్చి ఇస్తాడు. ముందు జగతి మేడం ఇచ్చింది అనుకుని థాంక్స్ మేడం అని చెప్పి తర్వాత రిషి ని చూసి మీరు తీసుకొచ్చి ఇచ్చారు ఏమిటి అంటే ఏమి ఇవ్వకూడదా అని ప్రశ్నిస్తాడు అదే సమయంలో ఇక నా మనసులో మాట చెప్పేయాలని వసుధార ప్రయత్నం చేస్తున్నట్లు చూపించారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X