Guppedantha Manasu: దెయ్యం దెబ్బతో సాక్షికి వణుకు తెప్పించిన వసు.. రిషితో అర్దరాత్రి కబుర్లు!
గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. గత ఎపిసోడ్లో సాక్షి, వసుధార, రిషి కలిసి రిషి ఇంటికి వచ్చి ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చూపించారు. ఇక ఈ ఎపిసోడ్ లో కూడా దాదాపు అదే వ్యవహారం కొనసాగింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కలిసి ప్రాజెక్టు వర్క్ మొదలుపెట్టిన తర్వాత ఈ చదువుల పండుగ పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి ఒక ఈవెంట్ లాగా అందరికీ తెలిసేలా చేద్దామని సాక్షి అంటుంది. రిషి కూడా అవును అలా చేస్తే అందరికీ రీచ్ అవుతుందని అంటాడు కానీ వసుధార మాత్రం మనం చేసే పనిలో బాధ్యత కనిపించాలి కాని హంగు ఆర్భాటాలు కనిపించకూడదు అని అంటుంది.

వసుధార చెప్పింది కరెక్ట్
జగతీ మహేంద్ర ఒకరి ముఖం ఒకరు చూసుకుని సరిగ్గా సమాధానం చెప్పింది కదా అనుకుంటారు. ఈ క్రమంలో వసుధార మాట్లాడుతూ ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లతో ప్రచారం చేయడానికి మనం ఏమి వ్యాపారం చేయడం లేదు. ఇది ఒక మంచి ఆలోచన ఈ ఆలోచన అందరి సమక్షంలో ముందుకు తీసుకువెళ్లాలి కానీ అటెన్షన్ కోరుకోవడం కరెక్ట్ కాదని అంటుంది. మహేంద్ర కూడా డబ్బు ఖర్చు లేకుండా పని చేయవచ్చు అంటూనే మనం అసలు కార్పొరేట్ స్టైల్ లో చేయాలి అనుకోవడం లేదు కదా అంటాడు. జగతి కూడా అవును వసుధార చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అంటే సాక్షి నువ్వు చెప్పు రిషి ఏమంటావు అంటే అవును వసుధార చెప్పిందే నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది అంటుంది.

ఏదైనా కొత్తగా
ఇలా ఇవన్నీ పూర్తయిన తర్వాత వసుధార సాక్షి ఇద్దరూ ఒకే గదిలో ఉంటారు. వసు తన పని తాను చేసుకుంటూ ఉంటే సాక్షి మాత్రం ఆమెను ఏం చేయాలా అనే కసితో చూస్తున్నట్లు చూస్తూ ఉంటుంది. నా కర్మ కాకపోతే నీతో కలిసి ఒకే రూమ్ షేర్ చేసుకోవడం ఏమిటి అని అడిగితే వర్క్ చేయడానికి వచ్చినప్పుడు అవేవీ చూసుకోకూడదు కదా అని వసుధార అంటుంది. నాకు ఇలాంటి వసతులన్నీ అలవాటే కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు . కానీ నువ్వు మాత్రం ఏదైనా కొత్తగా ఫీల్ అవుతున్నావా అన్నట్టు మాట్లాడుతుంది. ఆ తర్వాత నాకు నిద్ర రావడం లేదు ఏదైనా కథ చెప్పమని అడుగుతుంది సాక్షి.

టెన్షన్
వసుధార వెంటనే కాస్త తటపటాయించి తర్వాత మోహిని అనే దెయ్యం కథ చెబుతుంది. తన స్నేహితురాలు అయిన మోహిని తాను మూడు సార్లు పిలిస్తే వస్తానని చెప్పిందని ఆమె చనిపోయి దెయ్యం అయిందని ఒక కట్టు కథ చెబుతుంది. తామిద్దరం మంచి స్నేహితులమని ఒకసారి కొన్నాళ్ల పాటు ఆమె కనిపించకుండా పోయిందని వసుధార చెబుతుంది. ఆ తరువాత కొన్నేళ్ళకు మళ్ళీ కనిపించి వసుధార కాఫీ తాగుతూ రమ్మని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లిందని ఆమె ఇచ్చిన కాఫీ ఎర్రగా ఉండడంతో తాను భయపడి పారేశానని చెబుతుంది. అలా ఫైనల్ గా ఆమె ఒక దెయ్యం అయింది అనే విషయాన్ని చెప్పడంతో సాక్షికి ఎక్కడైనా టెన్షన్ పుట్టుకొస్తుంది.

కాఫీ కలిపి తీసుకువచ్చి
ఇక ఆ కట్టు కథ విన్న తర్వాత సాక్షి వణికి పోతూ ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో లేచి వసుధారను చూసి నిజంగానే మోహిని దెయ్యం వచ్చిందేమో అని భయపడి వస్తుధారని పిలిస్తే ఇప్పటివరకు రాలేదు ఒకవేళ వస్తే పిలవమని చెప్పి బయటికి వెళుతుంది. భయంతో సాక్షి ముసుగు తన్ని పడుకుంటుంది. వసుధార బయటకు వెళ్లి సోఫాలో కూర్చుని పని చేసుకుంటూ ఉంటుంది. అలాగే రిషి కూడా తనను వసుధార ఎందుకు రిజెక్ట్ చేసిందనే ఆలోచనలోనే ఇంకా ఉంటూ వసుధారతో తెలిసిన ఫోటోలు దిగిన ఫోటోలు చూసుకుంటూ గతంలో గడిపిన ఆనంద క్షణాలు గుర్తు తెచ్చుకొని మరీ బాధపడుతూ ఉంటాడు. ఇక వసుధార బయటకు వచ్చి కూర్చొని పని చేసుకుంటున్న విషయాన్ని చూసి రిషి ఆలోచిస్తూ ఉండగా వసుధార ఇప్పుడు కనుక ఒక మంచి కాఫీ ఉంటే బాగుండు అనుకుండగానే రిషి లోపలికి వెళ్లి కాఫీ కలిపి తీసుకువచ్చి ఇస్తాడు.

ఆసక్తికరంగా
అయితే ఎవరిచ్చారు అనే విషయం కూడా చూడకుండా జగతి మేడం ఇచ్చారు అనుకుని మీ చేతితో ఏం చేసినా అద్భుతంగా కుదురుతుందని పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటుంది. కానీ అది పెట్టింది రిషి అనే విషయం తెలిసి షాక్ లో ఉంటుంది వసుధార అయితే వాళ్ళిద్దరూ ఇలా అర్ధరాత్రి సమయంలో కలిసి మాట్లాడుకోవడం చూసి దేవయాని వాళ్ల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా జగతి దేవయాని చేయి పట్టుకుని ఆపేసి వారి దగ్గరకు కనుక ఇప్పుడు నువ్వు వెళితే సాక్షి లైబ్రరీలో చేసిన ఘనకార్యం వెనుక అసలు కారణం నువ్వే అనే విషయం రిషికి చెప్పేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతో దేవయాని ఇక ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళింది. మరి చూడాలి రాబోతున్న ఎపిసోడ్స్ లో ఎలాంటి ఆసక్తికర మలుపులు చోటు చేసుకోబోతున్నాయి అనేది. రిషికి తన ప్రేమ వ్యక్తం చేయడానికి వసుధార సిద్ధమవుతున్న నిభక్షంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











