Guppedantha Manasu July 16 Episode: సాక్షితో వసును పోల్చుకున్న రిషి.. ప్రవర్తన చూసి వాళ్తంతా షాక్

తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ ధారావాహికలకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్ శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. జగతి తల్లి గురించి చెప్పిన డైలాగుతో రిషి ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత వసుధార అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తాను ఏ దేశం వెళ్లనని చెబుతుంది. అంతేకాదు, లెక్చలర్‌ను అయి పాఠాలు, విలువలు నేర్పిస్తానని అంటుంది. దీంతో రిషికి ఆమెకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. జగతి, మహేంద్ర వసుధారను సపోర్ట్ చేస్తారు.

రిషిలో మార్పుకు వసుధారే కారణం

రిషిలో మార్పుకు వసుధారే కారణం

వసుధార తీసుకున్న నిర్ణయం గురించి జగతి, మహేంద్ర మధ్య జరుగుతున్న చర్చతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. మహేంద్ర మాట్లాడుతూ.. 'ఏది ఏమైనా వసు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది. తను రిషిలో వచ్చే మార్పుకు కారణం అవుతుంది. భవిష్యత్‌లోనూ నువ్వు కోరుకున్నట్లు వాడిని మార్చేస్తుంది. రిషికి మరిన్ని పాఠాలు చెబుతుందని అనిపిస్తుంది' అని అంటాడు.

సమాధానం కావాలి.. నిద్ర పట్టట్లేదు

సమాధానం కావాలి.. నిద్ర పట్టట్లేదు

వసుధార తీసుకున్న నిర్ణయం.. అన్న మాటలను గుర్తు చేసుకుంటూ నిద్ర పోకుండా ఉంటాడు రిషి. ఆ సమయంలో డైనింగ్ హాల్ దగ్గరకు వచ్చి వాటర్ తాగుతుండగా.. ధరణి కూడా అక్కడకు వస్తుంది. అప్పుడు ఏమైంది రిషి ఎందుకు ఇక్కడ ఉన్నావు? నీకు ఏం కావాలి అని అడుగుతుంది. దానికి రిషి 'నాకు సమాధానం కావాలి వదిన. నిద్ర పట్టడం లేదు' అని ఆమెకు బదులిస్తాడు.

వసుధారాను ఆకాశానికెత్తిన ధరణి

వసుధారాను ఆకాశానికెత్తిన ధరణి

రిషి మాట్లాడేది వసుధార గురించే అని తెలుసుకున్న ధరణి.. 'వసు తీసుకున్న నిర్ణయం నాకైతే నచ్చింది. తను ఇక్కడుంటే హగ్ చేసుకునేదాన్ని. మధ్య తరగతి అమ్మాయిలు తమ గురించే ఆలోచిస్తారు. కానీ, వసు మాత్రం తన కోసం కాకుండా అందరి కోసం ఆలోచించింది. నువ్వే ఆలోచించు.. తను సాక్షిలా చేయలేదు' అంటూ గతంలో రిషిని వదిలేసి వెళ్లిన అమ్మాయిని గుర్తు చేసింది.

వసుధారకు ధైర్యం చెప్పిన జగతి

వసుధారకు ధైర్యం చెప్పిన జగతి

తను తీసుకున్న నిర్ణయంపై రిషి ఏమనుకుంటాడో అని ఆలోచిస్తుంటుంది వసు. అప్పుడు జగతి ఆమె దగ్గరకు రాగా.. మాట్లాడలేను అని అంటుంది. కానీ, జగతి కలుగజేసుకుని 'నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు. ధైర్యంగా ముందడుగు వేశావు.. ధైన్యంగా కాదు. ఎవరో ఏదో అనుకుంటారని ఎందుకు ఆలోచిస్తావు' అంటూ ఆమెకు ధైర్యం చెబుతుంది.

వసుకు దేవయాని ప్రశ్న.. రిషి అలా

వసుకు దేవయాని ప్రశ్న.. రిషి అలా

ఉదయాన్నే రిషికి దేవయాని టిఫిన్ పెడుతుంది. అతడు అది తింటుండగా వసుధార ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు దేవయాని వెళ్లి వసును 'మంచి ఆఫర్‌ను ఎందుకు వదిలేశావ్? అందలమెక్కే అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా కాదనుకుంటారా' అని ప్రశ్నిస్తుంది. అంతలో అక్కడకు వచ్చిన రిషి 'ఎవరి నిర్ణయాలు వాళ్లవి పెద్దమ్మ. అయినా ఇందులో నీ ఇంట్రెస్ట్' ఏంటి అని అడుగుతాడు.

రిషిలో మార్పుపై తల్లి తండ్రి ఆశ్యర్యం

రిషిలో మార్పుపై తల్లి తండ్రి ఆశ్యర్యం

దేవయానితో రిషి మాట్లాడిన మాటలను మహేంద్ర పక్కనుండి వింటాడు. అప్పుడు కొడుకులో వచ్చిన మార్పులను చూసి సంతోష పడతాడు. ఇక, కాలేజ్‌కు వచ్చిన వెంటనే ఈ విషయాలన్నింటినీ జగతికి వివరిస్తాడు. అంతేకాదు, 'రిషిలో వచ్చిన మార్పులకు వసుధారే కారణం. అసలు ఇలా ఛేంజ్ అవుతాడని అస్సలు అనుకోలేదు' అని చెబుతాడు. అంతలో రిషి తండ్రికి ఫోన్ చేస్తాడు.

Recommended Video

FCUK Movie Song 4 Manasu Katha
ఫోన్ చేసి చెప్పిన మహేంద్ర.. క్లారిటీ

ఫోన్ చేసి చెప్పిన మహేంద్ర.. క్లారిటీ

రామలింగప్ప ఆఫర్‌ను వసుధార రిజెక్ట్ చేసిన విషయాన్ని ఎలా చెప్పాలని రిషి, పెదన్నాన్న తర్జనభర్జన పడుతుంటారు. అంతలో మహేంద్ర అక్కడకు రాగా ఆయనకు విషయం చెబుతారు. దీంతో ఆయనే స్వయంగా ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వాళ్లకు వివరిస్తాడు. అంతేకాదు, క్షమించమని కూడా కోరుతాడు. ఆ తర్వాత అంతా హ్యాపీగా ఉంటారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X