Guppedantha Manasu: వసుధారను దారుణంగా అవమానించిన సాక్షి.. దెబ్బకు దిగొచ్చిన రిషి. కానీ షాకిచ్చిన వసు!

గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని ఎపిసోడ్లుగా తాను రిషి మీద ఏర్పరచుకున్న ఇష్టాన్ని వ్యక్తం చేయడానికి సాక్షి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ రిషి అనేక సందర్భాల్లో ఈ వ్యవహారాన్ని వాయిదా పడేలా ప్లాన్ చేస్తూ వస్తున్నాడు. స్వయంగా ఆయన ఏమీ అనుకోకపోయినా విషయం మాట్లాడుతున్న మాటలతో వసుధార ఈ విషయాన్ని బయట పెట్టేందుకు వెనకడుగు వేస్తూ ఉంటుంది.

గత ఎపిసోడ్లో సాక్షి గురించి చెబుతున్న విషయాన్ని తన గురించే అని భ్రమపడిన వసుధార అప్పటిదాకా రిషి ప్రేమ ఉందనే విషయాన్ని చెప్పడానికి కూడా వాయిదా వేసుకుంటుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కోపంతో రగిలిపోతూ

కోపంతో రగిలిపోతూ

తాజా ఎపిసోడ్లో సాక్షి ప్లాన్ చేసి దేవయాని పెట్టించిన రెండు కాఫీ కప్పులు తీసుకుని రిషితో తాగడం కోసం లోపలికి వెళ్తుంది. అయితే అప్పటివరకు రిషితో మాట్లాడుతున్న గౌతం హమ్మయ్య థాంక్స్ సాక్షి ఇలా సా కాఫీ తాగాలి అనుకున్నానో లేదో నువ్వు తీసుకువచ్చావు అంటూ ఒక కాఫీ తాను తీసుకుని మరో కాఫీ రిషికి ఇస్తాడు. అయితే తానూ రిషి కలిసి తాగాలనుకున్న కాఫీ ప్లాన్ ఇలా ఫైల్ కావడంతో సాక్షి ఏమీ అనలేక సైలెంట్ గా ఉండలేక రగిలిపోతూ ఉంటుంది.

అయితే రిషి మాత్రం మొహమాటానికి నువ్వు ఎందుకు ఇలా కాఫీ తీసుకొచ్చావు అని అంటే నాకు ఇలాంటి పట్టింపులు ఏమీ లేవు రిషి అంటుంది సాక్షి. ఇంతలోనే సరిగ్గా అదే సమయానికి వసుధార ఆ గదిలోకి వస్తుంది. అప్పుడే గౌతమ్ వసు కాఫీ తాగావా అని అడిగితే అప్పుడు సాక్షి చేతిలో ప్లేట్ చూసి కావాలని లేదు సార్ కాఫీ తాగాలని ఉంది ఎందుకంటే తల బద్దలై అయిపోతుంది అని అనగానే రిషి సరే ఈ కాఫీ షేర్ చేసుకుందాం అని అనడంతో సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

నాలుగు డ్రస్సులు

నాలుగు డ్రస్సులు

మరి నాకు అంటే నీకు ఇలా షేరింగ్ కాఫీ ఎందుకు ఇస్తాను నువ్వు మా ఇంటి అతిధివి సాక్షి నువ్వు ఫుల్ కాఫీ తాగాలి అని చెప్పి తాను సాసర్లో తాగుతూ వసుధారకు కప్పులో ఇస్తాడు. వారిద్దరూ కలిసి పక్క పక్కనే నిలబడి కాఫీ షేర్ చేసుకుని తాగడం చూసి సాక్షి రగిలిపోతూ ఉంటుంది. వెంటనే వసూ మాటలతో రగిలిపోతున్న సాక్షి ఎలా అయినా వసూ పరువు తీయాలనే ఉద్దేశంతో వసుధార డ్రస్సుల గురించి ప్రస్తావిస్తుంది.

అసలు సందర్భమే లేకుండా ఎందుకు నువ్వు ఎప్పుడూ ఒకలాంటి డ్రెస్సులు వేసుకుంటావు అంటే నాకు అలాంటి డ్రెస్లే ఉన్నాయని వసు అంటుంది. అవునా నేను ఇంకా ఉన్న నాలుగు డ్రస్సులు అటు తిప్పి ఇటు తిప్పి వేసుకుంటున్నావేమో అనుకున్నానే అని పరువు తీస్తుంది.

గట్టిగానే వార్నింగ్

గట్టిగానే వార్నింగ్

అలా జరిగిన వెంటనే జగతి, దేవయాని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, దేవయాని మీద జగతి ఫైర్ అవుతున్న సమయంలో అక్కడికి వచ్చిన సాక్షి వినబోతుండగా ఎందుకు సాక్షిని పొల్యూట్ చేస్తున్నావ్ అనడంతో సాక్షి ఆవిడ నన్ను పొల్యూట్ చేయడం ఏమిటి అని వింతగా అడుగుతుంది. మీరు కనుక రిషి విషయంలో ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తే మర్యాదగా ఉండదు. మీరు రిషి మీద ప్లాన్ చేసిన అన్ని ప్లాన్లు బట్టబయలు చేస్తానంటూ సాక్షి, దేవయాని ఇద్దరికీ జగతి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు జగతి సాక్షికి వార్నింగ్ ఇస్తూ చెప్పుడు మాటలు వినకు అని కూడా చెబుతుంది. అంతేగాక ఇప్పటికిప్పుడు జరిగినవన్నీ రిషికి చెబితే పరిస్థితి ఎలా మారిపోతుందో ఆలోచించమని అంటూ ఇద్దరికీ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది.

గట్టిగా వార్నింగ్

గట్టిగా వార్నింగ్

రిషి విషయంలో మరో ప్లాన్ వేసినట్టు నాకు తెలిసినా సరే రిషికి ఇవన్నీ చెప్పేస్తానని భయపెడుతుంది. జగతి చెప్పిన మాటలకు సాక్షి, దేవయాని ఇద్దరు వణికిపోతూ సైలెంట్ అయిపోతారు. దేవయానికీ జగతి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత జగతి మహీంద్రా కాలేజీకి కారులో ప్రయాణిస్తూ ఉంటారు. దేవయాని గురించి ఇదంతా మహేంద్ర కి కూడా చెబుతుంది జగతి. మరోపక్క జగతి దగ్గరికి వెళ్లి వలు ప్రాజెక్టు గురించి డిస్కషన్ చేస్తూ ఉండగానే జగతి చాంబర్ కు సాక్షి కూడా వస్తుంది. అప్పుడు సాక్షికి తన మాటలతోనే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది జగతి. నాకు నీ మీద ఎలాంటి కోపం, పగ లేవు కానీ ఇక మీదట ఎలాంటి తప్పుడు వేషాలు వేసినా ఊరుకునే అవకాశం లేదంటూ వార్నింగ్ ఇస్తుంది.

వసుధార యాక్సెప్ట్ చేసిందా

వసుధార యాక్సెప్ట్ చేసిందా

అప్పుడు సాక్షి కూడా ఎంత చెప్పినా వినకుండా మీ అబ్బాయిని నాకు ఇవ్వండి అనడంతో సాక్షి మాటలకు కోపం వస్తుంది. అయినా సరే ఆమె ఏమీ మాట్లాడదు గాని జగతి మాత్రం సాక్షికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేలా చేస్తుంది. ఇక అక్కడితో తాజా ఎపిసోడ్ ముగించారు ఇక రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం వసుధార కోసం రిషి కొత్త బట్టలు కొనుక్కుని తీసుకువస్తాడు. అయితే వసుధార ముందు ఆ బట్టలు తీసుకోవడానికి తటపటాఇస్తూ ఉండగానే సాక్షి అక్కడికి వస్తుంది. ఏమిటి ఈ బట్టలు అంటే తాను వసుధార కోసం బట్టలు తీసుకొచ్చాను అని రిషి అంటాడు. అయితే ఈ బట్టలు వసుధార యాక్సెప్ట్ చేసిందా అని అడుగుతుంది సాక్షి చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X