Guppedantha Manasu July 19th Episode: ఎంక్వైరీలో షాకింగ్ విషయాలు.. అతడిని స్టేషన్‌కు రమ్మన్న శిరీష్
తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ ధారావాహికలకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్ సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. వసుధార కలవడానికి పోలీస్ ఆఫీసర్ శిరీష్ కాలేజ్‌కు వస్తాడు. అప్పుడు వాళ్లిద్దరి రిలేషన్ చూసి రిషీ లోలోపల కుళ్లు కుంటుంటాడు. ఆ తర్వాత జగతి ఓ డౌట్ ఉందని రిషి దగ్గరకు వెళ్తుంది. అప్పుడు మెషీన్ ఎడ్యూకేషన్ గురించి తన ఐడియా చెప్పగా.. అది అతడికి బాగా నచ్చుతుంది. ఆ విషయం చెప్పగానే జగతి ఎమోషనలై కన్నీరు పెట్టుకుంటుంది.
వసుధార ముందు ఇరుక్కున్న రిషి
ఎంక్వైరీ కోసం రెస్టారెంట్‌లో శిరీష్‌ను కలిసేందుకు వెళ్తోన్న వసుధారను తన కారుతో తీసుకెళ్తాడు రిషి. ఆ సమయంలో శిరీష్‌కు పెళ్లైందా అని ఆమెను అడుగుతాడు. అప్పుడు వసు 'అది అతని పర్సనల్ మేటర్ సార్. అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు ఊరుకుంటారా? నీ హద్దులో నువ్వు ఉండు అంటూ ఫైర్ అయ్యేవారు' అంటుంది. దీంతో రిషి అనవసరంగా ఇరుక్కున్నా అనుకుంటాడు.
అడిగి మరీ వసుధారతో వెళ్లిన రిషి
వాళ్లు మాట్లాడుతుండగానే రెస్టారెంట్ వచ్చేస్తుంది. అప్పుడు రిషి తప్పించుకుంటూ రెస్టారెంట్ వచ్చేసింది అంటాడు. ఆ సమయంలో థ్యాంక్స్ చెప్పి దిగబోతుంది వసు. దీంతో 'ఏంటి ఇక్కడి వరకూ వస్తే థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోమంటున్నావా? ఎంక్వైరీకి నన్ను రమ్మనవా' అని అడుగుతాడు. అప్పుడు ఆమె లోపలికి రమ్మంటుంది. దీంతో అడుక్కుని వెళ్తున్నానా అని రిషి ఫీల్ అవుతుంటాడు.

రెస్టారెంట్‌లో వసును శిరీష్ ఎంక్వైరీ
రెస్టారెంట్ లోపల శిరీష్ వసుధారను ఎంక్వైరీ చేస్తాడు. ఆ సమయంలో డబ్బు పోయినప్పుడు ఏం జరిగిందో తెలుసుకుని రాజీవ్ మీద అనుమానం వ్యక్తం చేస్తాడు. దానికితోడు రిషి కూడా అతడు పెద్ద కన్నింగ్ పర్సన్ అని అనుమానాలు పెంచుతాడు. దీంతో శిరీష్.. రాజీవ్‌కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రమ్మని చెబుతాడు. ఆ తర్వాత వసు ఇచ్చిన కాఫీని తాగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

జగతి ఎమోషనల్.. కొడుకుకు స్వీట్
ఇంట్లో ఏదో ఆలోచిస్తోన్న మహేంద్ర దగ్గరకు జగతి వస్తుంది. అతడిని కళ్లు మూసుకుని నోరు తెరవమంటుంది. అప్పుడాయన నోట్లో స్వీట్ పెట్టి రిషి తనను అభినందించిన విషయం చెబుతుంది. అంతేకాదు, ఆ స్వీట్‌ను రిషి తినేలా చేయమని కూడా చెబుతుంది. దీనికి భయపడుతూనే ఒప్పుకుంటాడు మహేంద్ర. ఆ తర్వాత రిషి తనను దూరం పెడుతున్నందుకు జగతి బాధ పడుతుంది.

వసు కోసం రిషి వెయిటింగ్... కలిసే
రెస్టారెంట్ పని ముగించుకుని వస్తున్న వసుధారకు రిషి అక్కడే కనిపిస్తాడు. దీంతో 'ఏంటి సార్ మీరు ఇంకా వెళ్లలేదా? ఇక్కడే వెయిట్ చేస్తున్నారెందుకు' అని అడుగుతుంది. అప్పుడు రిషి 'శిరీష్ మీ బావకు ఫోన్ చేశాడు. సో.. దారిలో అతడు వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. అందుకే నిన్ను తీసుకెళ్లేందుకు ఇక్కడే ఉన్నా' అని చెబుతాడు. దీంతో ఇద్దరూ కలిసే కారులో వెళ్తారు.

వసుకు రిషి చెప్పినట్లే చేసిన రాజీవ్
తనపై చూపిస్తున్న కేరింగ్‌కు వసు.. రిషికి థ్యాంక్స్ చెబుతుంది. అప్పుడతను 'థ్యాంక్స్‌లు, సారీలు చెప్పడం కాదు.. వాటి మీద నిలబడాలి. అయినా.. ఎప్పుడూ శిరీష్ ఉంటాడని ధైర్యంగా ఉండకు. మీ బావ మామూలోడు కాదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతడి మీద కంప్లైంట్ చేశావని నిన్ను ఏదైనా చేయొచ్చు' అంటాడు. అంతలోనే రాజీవ్ వీళ్ల కారుకు అడ్డంగా వచ్చి నిలబడతాడు.


Click it and Unblock the Notifications











