India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: ఫలించిన సాక్షి ప్లాన్.. మంత్రి ముందే పరువు పాయే!

  |

  గుప్పెడంతమనసు సీరియల్ లో వసుధార-రిషి ఇద్దరూ ఒకటయ్యే సూచనలు కనిపించే విధంగా కదా సాగుతోంది. దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక గత ఎపిసోడ్లో వసు సభకు టైం అవుతూ ఉండగా రిషి కాలేజీ నుంచి వెళ్లిపోవడం చూసి వసు టెన్షన్ పడుతుంటుంది..రిషి సార్ రారని నా మనసు చెబుతోంది అంటూ ఉండగా ముగించారు. ఇక తాజా ఎపిసోడ్లో ఏమి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  గిల్టీగా ఉందని

  గిల్టీగా ఉందని


  అలా టెన్షన్ పడుతున్న వసుతో అసలు ఈ అభినందన సభ ఆలోచనే రిషిది...అలాంటప్పుడు రాకుండా ఎలా ఉంటాడని ప్రశ్నిస్తుంది. నీ మనసేంటో నీ ఆలోచనేంటో నీకు స్పష్టత ఉంటే చాలన్న జగతితో ఈ మధ్యే ఓ స్పష్టత వచ్చింది మేడం అని పరోక్షంగా తాను మారాను అని చెబుతుంది. మరోపక్క అక్కడి నుంచి బయట పడిన రిషి రోడ్డు పక్కన కారు ఆపి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు వసుధారకి అభినందన సభ అంటే నేను ఉండాలి కదా..ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నానని అనుకుంటాడు. మళ్ళీ తనకు తానే సమాధానపడుతూ నన్ను కాదన్న వసుధార నా కళ్లముందు తిరుగుతోంది నాకు గిల్టీగా ఉందని అనుకుంటాడు. ఇదిలా ఉండగా అభినందన సమయం దగ్గర పడుతూ ఉండడంతో వసుధార టెన్షన్ గా రిషి కోసం చూస్తుంటుంది. దీంతో జగతి వచ్చి ఇంకా ఇలా ఉంటే ఎలా వెళ్లి రెడీ అవమని అంటుంది.

  బాస్కెట్ బాల్ ఆడుకుంటూ

  బాస్కెట్ బాల్ ఆడుకుంటూ

  దీంతో ఇలా ఉండడం ఏంటి ఇలాగే ఉంటాను కదా మేడం అని అంటుంది. బస్తీ నుంచి కొందరు వచ్చి వసుధారని అభినందించడంతో వాళ్లని తీసుకుని వెళ్లి కూర్చోబెట్టిన వసుధార, రిషి ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉంటుంది. రిషి వెనక్కు వచ్చేసి కాలేజీ గ్రౌండ్ లో బాస్కెట్ బాల్ ఆడుకుంటూ ఉండగా వసుధార నుంచి మెసేజ్ వస్తుంది. 'సర్ నేను సాధించిన విజయాన్ని అందరూ పొగుడుతూ ఉంటారు ఆ విజయానికి కారణం అయిన మీరు మాత్రం దూరంగా ఉంటారు ఎందుకు సార్ ఇలా రావచ్చు కదా' అని అంటే మళ్ళీ ఆలోచనలో పడతాడు. ఇంట్లో రిషికి కాల్ చేసిన గౌతమ్...ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతోంది ఇంకా రాలేదేంటని అడిగి పెద్దమ్మ, సాక్షి, ధరణి వదిన వచ్చారు నువ్వు రమ్మన్నావా అని అడుగుతాడు. నేను రమ్మనలేదు..అయినా వచ్చారు కదా పెద్దమ్మని బాగా చూసుకోమని అంటాడు. అయితే అక్కడ దేవయానిని చూసి మహేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. దేవయాని జగతి దగ్గరకు వెళ్లి ఏం దగ్గరుండి మరీ సన్మానం చేస్తున్నావా..నీ శిష్యురాలికి అని అడగడంతో ఇందులో నాదేముంది... మీరు వచ్చారు, కదా పెద్దమనసుతో దీవించి వెళ్ళమంటుంది.

  టెన్షన్ పడుతున్నావా

  టెన్షన్ పడుతున్నావా

  ఇక జగతి సాక్షి వెళ్లి రిపోర్టర్స్ తో మాట్లాడుతుంటే ఏదో అనుమానపడుతుంటే దానికి దేవయాని: నేను వచ్చానని భయపడుతున్నావా? సాక్షి వాళ్లతో మాట్లాడుతుందని టెన్షన్ పడుతున్నావా? నీ భయాన్ని నిజం చేస్తా, నిన్ను అస్సలు డిస్సప్పాయింట్ చేయనులే అంటుంటే వీళ్లు ఏదో చేయడానికే వచ్చారని భయపడుతుంది. మరోపక్క కార్యక్రమానికి వచ్చిన మినిస్టర్ వసుధారని అభినందించి రిషి కనిపించడం లేదేంటి అని అడిగితే వస్తున్నారు సార్ అని చెబుతాడు గౌతమ్. మరోపక్క అప్పుడే వసుధార-సాక్షి మధ్య చిన్న వాదన జరుగుతుంది. ఆ తర్వాత ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో దేవయాని జగతి దగ్గరకు వెళ్లి మేం ఏం చేస్తామో అని టెన్షన్ పడుతున్నావా...సాక్షి అదేంటో చూపించెయమని అంటే దానికి సాక్షి వసుధార గురించి ఈ ప్రోగ్రాంలో ఓ ఏవీ చూపించబోతున్నామని అంటుంది. దాని వల్ల వసుధారకి అవమానం జరగబోతోంది,

  పరువు పోవడం ఖాయం

  పరువు పోవడం ఖాయం

  వసుతో ఎందుకు తిరిగానా అని రిషి ఫీలవుతాడని అంటుంది. అంతేకాదు, ఆ వీడియోలో ఒక పల్లెటూరి అమ్మాయి వసుధార డబ్బు కోసం సిటీకి వచ్చి, రిషికి వలవేసిందని, . రిషిని ఏం చేసిందో ఏం మందు పెట్టిందో తెలియదు కానీ తను ఏం చెబితే అది వింటాడని వాయిస్ ఓవర్ ఉంటుంది. దానికి పడిపోయిన రిషి..వసుకి ప్రపోజ్ చేయడం, అప్పుడే వసుధార తన అసలు సిసలు అస్త్రాన్ని ప్రయోగించి ఆస్తి మొత్తం తనపేరుమీద ట్రాన్ఫర్ చేస్తేనే ఎస్ అంటామని నో చెప్పినట్టు వీడియోలో చూపిస్తుంది. సాక్షి ఏంటిదంతా ఆపమని జగతి అంటే వసుధార పరువు పోవడం ఖాయం...ఈ వసుధార వెనుకున్న అదృశ్య హస్తం మీరే అని వీడియో ముగిస్తానని అంటుంది.

  పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
  ఫేక్ వీడియో

  ఫేక్ వీడియో

  ఇదంతా పెన్ డ్రైవ్ లో వేసిచ్చానని కాసేపట్లో .స్క్రీన్ పై ప్లే అవుతుంది చూడండని అంటుంది. ఇలా సాగుతూ ఉండగానే ఎపిసోడ్ ముగించారు. తదుపరి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం వసుధార గొప్పతనం తెలిపే వీడియో ఒకటి నా దగ్గర ఉంది ముందుగా దాన్ని ప్లే చేద్దామని అంటూ సాక్షి ముందే రెడీ చేసిన ఏవీ ప్లే చేస్తుంది. సరిగ్గా అప్పుడే ఎంట్రీ ఇచ్చిన రిషి ఆసక్తికరంగా ఆ వీడియో చూస్తూ ఉండగా సాక్షి చెప్పిన వర్షన్ చూసి అందరూ షాక్ అవుతారు... ఇదంతా వసుధారే చేసింది అనుకున్న రిషి ఆమె మీద అరుస్తాడు.


  English summary
  Guppedantha Manasu Episode 491: Sakshi and Devayani execute their plan to trouble Vasudhara. Elsewhere, Rishi and Vasudhara feel uncomfortable at the felicitation programme.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X