For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu July 20th Episode: తల్లి విషయంలో రిషికి భారీ షాక్.. ఆ వీడియో చూసి ఏడ్చిన జగతి

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ ధారావాహికలకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్ మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. వసుధారను ఎంక్వైరీ చేయడానికి శిరీష్ రెస్టారెంట్‌లో ఉంటాడు. అప్పుడు రిషి ఆమెను అక్కడకు తీసుకెళ్తాడు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం దొంగతనం చేసింది రాజీవ్ అని అనుమానిస్తాడు శిరీష్. వెంటనే అతడికి ఫోన్ స్టేషన్‌కు రమ్మంటాడు. ఇక, రిషి తనను అభినందించడంపై జగతి ఎంతో సంతోషంతో మహేంద్రకు స్వీట్ తినిపిస్తుంది.

  అడ్డొచ్చిన రాజీవ్... గొడవకు సిద్ధంగా

  అడ్డొచ్చిన రాజీవ్... గొడవకు సిద్ధంగా

  రాజీవ్ ఏదైనా చేస్తాడన్న భయంతో వసుధారను స్వయంగా కారులో తీసుకెళ్తుంటాడు రిషి. అనుకున్నట్లుగానే రాజీవ్ దారి మధ్యలో అడ్డుగా వచ్చి నిలబడతాడు. ఆ సమయంలో రిషిని వసు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ, ‘వాడే గొడవకు సిద్ధమై రోడ్డుకు అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. అంటే ఎవడు గొడవ పెట్టుకోవాలనుకుంటున్నాడు' అంటూ చెప్పి కారు దిగి కిందకు వస్తాడు.

  ఇద్దరి మధ్య వాగ్వాదం... కాలర్ పట్టి

  ఇద్దరి మధ్య వాగ్వాదం... కాలర్ పట్టి


  రాజీవ్ దగ్గరకు వచ్చిన రిషి ఎందుకు అడ్డుగా నిలబడ్డావ్ అని అడుగుతాడు. అప్పుడతను ‘మీరేంటి సార్? వసుకు బాడీగార్డ్‌లా తయారయ్యారు. ఎక్కడికి వెళ్లినా ఆమె వెనకాలే ఉంటున్నారు' అని అడుగుతాడు. దీంతో ‘వెదవ నుంచి ఆమెను కాపాడేందుకు ఇలా చేయాల్సి వస్తుంది' అని బదులిస్తాడు రిషి. అలా ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరుగుతుంది. దీంతో వసు వచ్చి ఆపుతుంది.

  నువ్వని తెలిస్తే అప్పుడు చెబుతానని

  నువ్వని తెలిస్తే అప్పుడు చెబుతానని

  కోపంగా ఉన్న రిషితో ‘ఒక్క పది నిమిషాలు వసుతో మాట్లాడతాను' అని అడగ్గా అతడు పక్కకు వెళ్లిపోతాడు. అప్పుడు తన గురించి పోలీసులకు ఎందుకు చెప్పావ్ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రిషి ‘తను చెప్పలేదు. నాకే నీ మీద డౌట్ ఉంది' అని అంటాడు. అంతేకాదు.. ‘ఆ డబ్బులు తీసింది నువ్వని తెలిస్తే.. అప్పుడు చెబుతా నీ సంగతి' అంటూ మరోసారి కాలర్ పట్టుకుని వార్నింగ్ ఇస్తాడు.

  బంధాల కోసం భరించాల్సి వస్తుందని

  బంధాల కోసం భరించాల్సి వస్తుందని

  గొడవ తర్వాత కారును కొంత దూరం తీసుకెళ్లి ఆపుతాడు రిషి. అక్కడ ఆమెను ఎందుకు ఆపావని ప్రశ్నిస్తాడు. దీంతో ‘నాకు ఇలా గొడవలు పడడం.. పంతాలకు పోయి ఏళ్ల తరబడి మాట్లాడకుండా ఉండడం వంటివి నచ్చవు సార్. ప్రతి ఒక్కరికీ క్షమాపణ గుణం ఉండాలి. విలువలు, బంధాల కోసం ఇలాంటి వన్నీ భరించాల్సి వస్తుంది సార్' అంటూ రిషికి తల్లిని గుర్తు చేస్తుంది.

  ఆ మాటలతో రిషి ఆలోచన.. స్వీట్‌తో

  ఆ మాటలతో రిషి ఆలోచన.. స్వీట్‌తో

  బంధాల విషయంలో వసుధార చెప్పిన మాటలను గుర్తు చేసుకుని మనసులో మాట్లాడుకుంటాడు రిషి. ఆ సమయంలో జగతి పంపిన స్వీట్‌తో ఇంట్లోకి మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు. రావడం రావడమే ధరణి దగ్గరకు వెళ్లి ఈ స్వీట్‌ను రిషి తినేలా చేయమని అడుగుతాడు. అప్పుడు జగతి పరిస్థితిని తలుచుకుని ఆమె ఎంతగానో బాధ పడుతుంది. ఆ తర్వాత దాన్ని తానూ తింటానని అంటుంది.

  జగతి పంపిన స్వీట్‌ను తినేసిన రిషి

  జగతి పంపిన స్వీట్‌ను తినేసిన రిషి

  జగతి పంపిన స్వీట్‌ను పట్టుకుని వచ్చిన ధరణితో.. ‘ఈ స్వీట్ ఎవరు చేశారో తెలుసు వదినా' అంటూ షాకిస్తాడు రిషి. ఆ తర్వాత ‘నాకోసం నువ్వే చేశావ్' అనడంతో ఆమె ఊపిరి పీల్చుకుంటుంది. ఇక, దాన్ని ఎంతగానో ఆస్వాదిస్తూ తింటుంటాడు రిషి. అప్పుడు మహేంద్ర చాటుగా నిలబడి వీడియో తీసి జగతికి పంపిస్తాడు. తన స్వీట్‌ను కొడుకు తినడం చూసి ఆమె ఎంతో సంతోషిస్తుంది.

  English summary
  Guppedantha manasu Serial Episode 194: Rajiv Stopped Rishi Car on the Road. Then Rishi Ready to Fight with Rajiv. After That Vasudhara told Valuable Words about Relation to Rishi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X