For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu July 21st Episode: రిషి వల్ల వసుకు షాకిచ్చిన జగతి.. దొంగ దొరికాడని ఫోన్ రావడంతో!

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ ధారావాహికలకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్ బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రోడ్డుపై కారును ఆపిన రాజీవ్‌తో రిషి గొడవకు దిగుతాడు. అతడిని కాలర్ కూడా పట్టుకుంటాడు. గొడవ పెద్దది అవుతోన్న సమయంలోనే వసుధార అడ్డుగా వస్తుంది. ఆ తర్వాత రిషికి బంధాల గురించి విలువైన మాటలు చెబుతుంది. ఇక, జగతి పంపిన స్వీట్‌ రిషితో తినిపించాలని ధరణికి ఇస్తాడు మహేంద్ర. దాన్ని రిషి తినడంతో జగతి సంతోషిస్తుంది.

  Intinti Gruhalakshmi July 21st Episode: తులసి కోసం మామయ్య సాహసం.. రోడ్డున పడే ప్రమాదంలో కుటుంబం

  ధరణిని ఊహించని ప్రశ్న అడిగిన రిషి

  ధరణిని ఊహించని ప్రశ్న అడిగిన రిషి

  రిషి స్వీట్ తింటూ బాగుందని ధరణిని ఎంతగానో మెచ్చుకుంటాడు. ఆ సమయంలో రిషి వదినకు థ్యాంక్స్ చెప్పడంతో పాటు ‘నీ ఉద్దేశంలోనే నేను మంచోడినా.. చెడ్డోనినా చెప్పు వదిన' అని ఊహించని ప్రశ్నను అడుగుతాడు. అప్పుడు ధరణి ‘అలాంటి ప్రశ్న ఎందుకు అడిగావ్. అయినా.. వసుధార అలాంటి ప్రశ్నను అడిగుండదే' అంటుంది. ఇది వసు అడగలేదని అంటాడు రిషి.

  నన్ను ఎవరూ మార్చలేరు... మారను

  నన్ను ఎవరూ మార్చలేరు... మారను

  ఆ తర్వాత వసుధార వల్ల మారుతున్నావు అని రిషితో ధరణి అంటుంది. ఆమె అన్న మాటలకు రియాక్ట్ అవుతూ.. ‘నేను మారడం ఏంటి వదినా. ఎప్పటి లాగే ఉన్నాను. అయినా నన్ను ఎవరూ మార్చలేరు... మారను' అంటూ బదులిస్తాడతను. అతడి మాటలకు ధరణి మనసులో ‘వసు వల్ల నువ్వు మారుతున్నావు. కానీ ఆ విషయాన్ని నువ్వు ఒప్పుకోవట్లేదు' అని అనుకుంటుంది.

  వసుధారకు ట్యూషన్ ఫీజు.. రిషి ఎంట్రీ

  వసుధారకు ట్యూషన్ ఫీజు.. రిషి ఎంట్రీ

  ఇంట్లో మహేంద్ర కూర్చుని ఉన్న సమయంలో దేవయాని ఏవో లెక్కలు వేసుకుంటుంది. అప్పుడామెను ఏం రాస్తున్నారని అడుగుతాడు. దీనికి ‘ఇంటి ఖర్చులు రాస్తున్నా. వసుకు ట్యూషన్ ఫీజు ఎంత ఇద్దాం' అని అడుగుతుంది. దీనికి మహేంద్ర అయోమయం అవుతాడు. అంతలో రిషి వచ్చి ‘ట్యూషన్ ఫీజు లెక్కలు మీకెందుకు పెద్దమా. ఆమెను నేను ఇస్తాలే' అని సమాధానం ఇస్తాడు.

  ధరణి, మహేంద్రకు భారీ షాకిచ్చిన రిషి

  ధరణి, మహేంద్రకు భారీ షాకిచ్చిన రిషి

  వాళ్లు మాట్లాడుకుంటుండగా ధరణి కాఫీని తీసుకొచ్చి రిషికి ఇస్తుంది. అది తాగుతూనే ‘రాత్రి ఇచ్చిన స్వీట్ చాలా బాగుంది వదిన' అంటాడు. దీంతో దేవయాని ‘మనం స్వీట్ చేసిన మూడు రోజులు అవుతుంది కదా. అదే రిషికి ఇచ్చావా' అని అడుగుతుంది. దీంతో ధరణికి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు మహేంద్ర సలహాలతో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా అని బదులిస్తుంది ధరణి.

  వర్షతో లవ్ ట్రాకుపై నోరుజారిన ఇమాన్యూయేల్: అందుకే ప్రేమిస్తోందని క్లారిటీ.. పాపం ఆమె కూడా బుక్

  రిషి లేనప్పుడే అవన్నీ కోల్పోయానని

  రిషి లేనప్పుడే అవన్నీ కోల్పోయానని

  ధరణి పడిన టెన్షన్‌ గురించి జగతికి వివరిస్తూ నవ్వుకుంటుంటాడు మహేంద్ర. మాటల సందర్భంలో జగతి పుట్టినరోజు గురించి మాట్లాడుతుండగా.. వసు వచ్చి దాన్ని గ్రాండ్‌గా చేద్దామంటుంది. కానీ, దీనికి జగతి ఒప్పుకోదు. ‘నా కొడుకు దూరమైనప్పుడే సంతోషాలన్నీ పోయాయి' అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. కానీ, వసు మాత్రం ఎలాగైనా సెలెబ్రేట్ చేస్తానని మనసులో అనుకుంటుంది.

  దొరికిన దొంగ... అందరూ కలిసి ఏకమై

  దొరికిన దొంగ... అందరూ కలిసి ఏకమై

  వసుధారకు శిరీష్ ఫోన్ చేసి దొంగ దొరికాడని, వెంటనే తాను చెప్పిన ప్లేస్‌కు రమ్మని అంటాడు. ఈ విషయాన్ని మహేంద్ర, జగతికి చెప్పగా వాళ్లే వసును అక్కడకు తీసుకుని వెళ్తారు. అది చూసిన రిషి.. వసుకు ఫోన్ చేయడంతో విషయం చెబుతుంది. ఇక, ఆ ఇంటికి చేరుకున్న వీళ్లంతా శిరీష్‌ను దొంగ ఎవరని అడుగుతారు. అది చెప్పడానికి టైమ్ ఉందని అనడంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Guppedantha manasu Serial Episode 195: Rishi Eated Jagathi Sweet. Then He say Thanks to Dharani. After That Vasudhara Wants to do Jagathi Birthday Celebrations. But She Denied This.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X