Guppedantha Manasu: వసుకు మళ్ళీ ప్రపోజ్ చేసిన రిషి.. ఈసారి సరికొత్తగా!

గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసింది. ఎలా అయినా రిషితో మరింత దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్న సాక్షి ఆయన ఇంటికి కూడా వస్తానని అనడంతో ఆమె ఆనందంలో ఉండగానే రిషి తనతో పాటు గౌతం, జగతి, మహీంద్ర, వసుధారలను కూడా తీసుకురావడంతో ఆమె డిసప్పాయింట్ అవుతుంది. అయితే రిషి ఒక్కడే కదా మేనేజ్ చేయొచ్చు అనుకుని బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టి అడ్డంగా దొరికిపోవడంతో అవమానం పాలవుతుంది. అయితే జగతి వసు నువ్వే ఏదో ఒకటి చేయాలని చెప్పడంతో వంట గదిలోకి వెళ్లిన వసుధార వంట ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆమె వెనకే వెళ్లిన గౌతం కూడా కాసేపటి తర్వాత బయటకు వచ్చి ఇక్కడ వంట చేయడం అస్సలు సాధ్యం కాని పని అంటాడు. దీంతో నాకు అవకాశం దొరికింది కదా అని సాక్షి చెలరేగిపోయి గౌతం ఇలా మనం టైం వేస్ట్ చేయడం ఏమీ బాలేదు త్వరగా ఏదో ఒకటి చెప్తే ఆర్డర్ పెడతాను అని అంటే అప్పుడు వసుధార కూడా బయటకు వస్తుంది. ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకుని గట్టిగా నవ్వుతారు.

దీని పెత్తనం ఏంటి

దీని పెత్తనం ఏంటి

ఇదేంటి వీళ్ళు నవ్వుకుంటున్నారు అని సాక్షి ఆలోచించే లోపే అరే నువ్వు చెబితే నమ్మలేదు కానీ వసుధర సూపర్ ఆమె ముందు అన్నం వండింది తర్వాత ముద్దపప్పు చేసింది ఆ తర్వాత ఉన్న పెరుగుతో మజ్జిగ చారు చేసింది. అలాగే కొన్ని బంగాళాదుంపలు కనపడటంతో ఆలూ ఫ్రై కూడా చేసింది అని మెనూ మొత్తం చెప్పుకుంటూ వస్తాడు గౌతం. ఇంత తక్కువ టైంలో ఎవరూ ఇంత మంచి మెనూ చేయలేరు తెలుసా అని రిషి అంటాడు. అవి తిన్న తరువాత వంటలు బాగున్నాయని కూడా పొగుడుతూ ఉంటే సాక్షి మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే సమయంలో మహేంద్ర నువ్వు కూడా కూర్చో అమ్మ వసుధార వడ్డిస్తుంది అనడంతో మా ఇంట్లో దీని పెత్తనం ఏంటి అని సాక్షి బాధపడుతూ ఉంటుంది.

లేట్ అయిపోయింది

లేట్ అయిపోయింది

ఈ సమయంలోనే రిషి మాట్లాడుతూ కొంతమంది సమస్య రాగానే భయపడుతూ ఉంటారు కానీ వసుధార లాంటి వాళ్ళు మాత్రం సమస్యను పరిష్కరిస్తారని అంటాడు. అంతేకాక వసుధారను సాక్షి ముందే పొగడడంతో సాక్షి బాధపడుతూ ఉంటుంది. సాక్షి ఎలా అయినా రిషి దగ్గర మార్కులు కొట్టేయాలని ఇవి నేను చేయలేక కాదు కానీ ఇవి తింటావో లేదో నాకు తెలియక చేయలేదు అని అంటే అసలు నాకు ఇష్టమైనవి ఇవే అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మీటింగ్ గురించి మాట్లాడదామంటే చాలా లేట్ అయిపోయింది వెళదామని అంటాడు రిషి. వసుధారని ఎవరు డ్రాప్ చేయాలి అని అడగడంతో నేనే డ్రాప్ చేస్తానని ముందుకు వస్తాడు.

ఎందుకలా చూస్తున్నారు

ఎందుకలా చూస్తున్నారు

అలా వాళ్ళిద్దరూ కలిసి కారులో బయలుదేరిన తర్వాత సార్ సాక్షి మీద మీ అభిప్రాయం ఏమిటి అని వసుధార అడుగుతుంది. ఇదేంట్రా బాబు ఇలా అడిగింది అంటూ షాక్ అయిన రిషి కారు ఆపేసి ఏమన్నావ్ మళ్లీ చెప్పు అంటే సాక్షి మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాను అంటుంది. ఆమె ఏం చెప్పినా సరే అంటున్నారు మీరు మారిపోతున్నారు సార్ నాకు అర్థం అవుతోంది. అంటే అసలు తన మీద నాకు అభిప్రాయం ఏముంటుంది డిన్నర్ కి రమ్మంటే అందర్నీ తీసుకు వెళ్లాను కదా అంటే ఎందుకు మీరు తనకు లేనిపోని ప్రాధాన్యత తీస్తున్నారని నాకు అనిపిస్తోంది, లైబ్రరీలో అంతలా మాట్లాడి బ్లాక్ మెయిల్ చేయాలని చూసినా ఏమీ జరగనట్టు ఎందుకలా చూస్తున్నారు అంటుంది.

ఎగ్జయిట్ అయి

ఎగ్జయిట్ అయి

రిషి ఆమె చావు అంచుల దాకా వెళ్లి వచ్చినదని దేవయాని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు, సరే ఆ సంగతి వదిలేయ్ ఆ విషయంలో నాకు క్లారిటీ ఉంది కానీ నువ్వు నేను ల్యాబ్ లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఏంటి? నా మెడలో ఎందుకు దండ వేసావు? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? తెలుస్తుందా బోర్డు మీద నెమలీక బొమ్మలు ఎందుకు వేశావు? అని సమాధానం చెప్పమంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేలోగా గౌరవిస్తున్నాను అంటావా నీ ఆలోచనలేంటో నాకు తెలుసు చెప్పాలా కాలేజీలో ఏమవుతుందో అని టెన్షన్ పడ్డావు, అభినందన సభలో ఎగ్జయిట్ అయి దండ వేసావు, బోర్డుపై చెరిగిపోని జ్ఞాపకం లాగా బొమ్మ వేశావు అని అంటుంటాడు.

పుష్ప షాక్

పుష్ప షాక్


నేను చెప్పబోయేది అది కాదు నా మనసులో మాట వినే అవకాశం ఇవ్వమని ఆమె అనుకుంటూ ఉండేలోపే నువ్వేం చెప్పకు నేను చెప్పేది నిజం కాదు అని అనకు నేను నమ్మను అని అంటాడు. చివరిగా నువ్వు చేసిన వంటలు చాలా బాగున్నాయి అని చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత కాలేజీలో చదువులు పండుగ హడావిడి మొదలవుతుంది. రిషి సార్ కి అసిస్టెంట్ గా ఉండవచ్చు కదా అని పుష్ప అనడంతో ఈ విషయం మీద పుష్పతో చర్చిస్తూ ఉంటుంది వసు. అదే సమయంలో రిషి సార్ రావడంతో పుష్ప షాక్ అవుతుంది. ఈ విషయం తెలియకు వసుధారి ఏదేదో మాట్లాడుతూ ఉండగా రిషి వచ్చి చదువుల పండగ మొత్తం కరెక్ట్ గా ప్లాన్ చేయాలి, టీం లీడర్స్, అసిస్టెంట్ ఎవరు ఉండాలి అనే గొడవలు పక్కన పెట్టి నువ్వు బాగా వర్క్ చేయి వసుధార అని చెబుతాడు. ఇంతలో పుష్ప ఫోన్ రింగ్ అవడంతో ఆమెను బయటకు వెళ్ళమంటాడు రిషి. ఆ తర్వాత ఒక గులాబీ పువ్వు తీసి వసుధారకు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి తరువాత ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X