For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu July 23rd Episode: బుద్ధి లేదా అంటూ వసుపై జగతి ఆగ్రహం.. ఆమెను మెచ్చుకున్న రిషి

  |

  దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందంటే!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దొంగతనం జరిగిన సీసీ పుటేజ్‌ను వసుధారతో పాటు అందరికీ చూపిస్తాడు శిరీష్. అందులో రాజీవ్.. ఆమె దగ్గర నుంచి బ్యాగ్‌ను లాక్కుని వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అప్పుడు రాజీవ్ ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసినా, కాళ్లు పట్టుకున్నా వసు స్పందించదు. దీంతో అతడిని శిరీష్ అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత వసు కంప్లైంట్ విత్‌డ్రా చేసుకుంటుంది.

  ఆయన దుర్మార్గుడే... నాన్న కోసమే

  ఆయన దుర్మార్గుడే... నాన్న కోసమే

  కంప్లైంట్ వాపసు తీసుకుంటానని వసుధార చేసిన రిక్వెస్ట్‌తో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభమైంది. 'మా బావ దుర్మార్గుడే కానీ మనం కాదు కదా. అయినా నేను కంప్లైంట్ వద్దని చెప్పేది తన గురించి కాదు. మా నాన్న గురించి. రాజీవ్ బావ మంచోడని మా నాన్న అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన గురించి నిజం తెలిస్తే తట్టుకోలేరు' అంటుంది. దీంతో శిరీష్ ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాడు.

  ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన అనుష్క శర్మ: విరాట్ కోహ్లీ భార్యను ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు!

  కోపంతో వెళ్లిపోయిన రిషి.. రాంగ్ అని

  కోపంతో వెళ్లిపోయిన రిషి.. రాంగ్ అని

  వసుధార చెప్పిన మాటలకు కోపంతో రిషి అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. దీంతో శిరీష్ ఏమైందని అడగ్గా.. 'రిషి సార్ కోపాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతారు. అది ఎలా పోతుందో నాకు తెలుసు' అంటుంది. అప్పుడు వసు డబ్బు జగతి ఇంట్లో ఉందని శిరీష్ చెబుతాడు. మరోవైపు, రిషి మాత్రం కారును వేగంగా నడుపుతూ తనలో తానే వసుధారను తిడుతూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు.

  వసు నిర్ణయంపై మహేంద్ర, జగతి చర్చ

  వసు నిర్ణయంపై మహేంద్ర, జగతి చర్చ

  వసుధార తీసుకున్న నిర్ణయంపై మహేంద్ర, జగతి మధ్య చర్చ జరుగుతుంది. ఆమె తప్పు చేసిందని మహేంద్ర అనగా.. వసుధార తన తండ్రి గురించి ఆలోచించానని చెబుతుంది. దీనికి జగతి కూడా సపోర్ట్ చేస్తుంది. అయినప్పటికీ మహేంద్ర మాత్రం 'నువ్వు కేసు వాపసు తీసుకుంటే రాజీవ్ మారుతాడా' అని అడుగుతాడు. దీనికి వసు 'మారినా మారకపోయినా ఒక ఛాన్స్ ఇచ్చా' అంటుంది.

  శిరీష్‌తో వసు రైడింగ్.. రిషికి భయపడి

  శిరీష్‌తో వసు రైడింగ్.. రిషికి భయపడి

  వసుధారకు ట్యూషన్ ఫీజు ఇచ్చేందుకు కాలేజ్‌లో వేచి చూస్తుంటాడు రిషి. కానీ, ఆమె మాత్రం శిరీష్ కారులో వస్తుంటుంది. అప్పుడు 'నేను కాలేజ్ లోపలికి రాను. వస్తే రిషి సార్‌కు కోపం వస్తుంది. డ్రెస్ వేసుకు రావద్దు, పోలీసు వాహనాన్ని తీసుకు రావద్దు అని చెప్పగా అంటాడు' అని శిరీష్ అనగా.. వసుధార మాత్రం రిషిని వెనకేసుకుని వస్తుంది. కారు దిగాక సాయంత్రం కలుద్దామంటుంది.

  వసుపై రిషి ప్రశంస.. కవర్ ఇవ్వడంతో

  వసుపై రిషి ప్రశంస.. కవర్ ఇవ్వడంతో

  కాలేజ్‌లో రిషి వేచి చూస్తోన్న సమయంలో వసు.. శిరీష్ కారు దిగి వస్తుంది. అప్పుడు ఆమెను పిలుస్తాడతను. అంతేకాదు, ఆమె వ్యవహరిస్తున్న తీరుకు అర్థం కాకుండా అభినందిస్తాడు. ఆ తర్వాత క్లాస్‌కు టైమ్ అవుతుందని ఆమె అనగా.. ట్యూషన్ ఫీజు తీసుకో అంటాడు. అప్పుడు వసుధార 'నేను మా బావకు ఇవ్వాలని డబ్బు గురించి ఆలోచించాను. ఇప్పుడు కాదు' అంటుంది.

  Intinti Gruhalakshmi July 23rd Episode: లాస్య సూచనతో అంకిత ప్లాన్ అమలు.. తులసి ఇంట్లో పెద్ద గొడవ

  జగతి బర్త్‌డే ఏర్పాట్లు.. కాలేజ్‌లో ప్లాన్

  జగతి బర్త్‌డే ఏర్పాట్లు.. కాలేజ్‌లో ప్లాన్

  జగతి పుట్టినరోజుకు సమయం దగ్గరపడడంతో శిరీష్‌ను కేక్ ఆర్డర్ ఇవ్వడానికి రమ్మని పిలుస్తుంది వసుధార. ఆ తర్వాత మహేంద్ర వెళ్లి జగతిని షాపింగ్‌కు వెళ్దాం రెడీ అవమని అంటాడు. ఎందుకని అడగ్గా.. 'నా భార్య పుట్టినరోజు. నేను ఆగినా వసుధార ఆగదుగా.. ఆమె ప్లాన్ చేస్తుంది' అని చెబుతాడు. దీంతో జగతి కోప్పడుతుంది. అంతేకాదు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె దగ్గరకు వెళ్తుంది.

  వసుధారపై జగతి ఫైర్.. చెప్పాను కదా

  వసుధారపై జగతి ఫైర్.. చెప్పాను కదా


  జగతి పుట్టినరోజు గురించి రిషి పెదనాన్న దగ్గర పర్మీషన్ తీసుకుంటూ ఉంటుంది వసుధార. అంతలో అక్కడకు జగతి వస్తుంది. అంతేకాదు, 'నీకు బుద్ది లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నాకిలాంటి ఇష్టం ఉండదని' అని అంటుంది. అంతలో రిషి పెదనాన్న 'వసునే కాదు.. ఐడియా ఇచ్చిన తర్వాత మేము కూడా మిమ్మల్ని గౌరవించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము' అంటూ బదులిస్తాడు.

  English summary
  Guppedantha manasu Serial Episode 197: Vasudhara Taking Back Her Complaint on Rajiv. Then She Ready to Celebrate Jagathi Birthday. But She Did Not Accept This.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X