twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: ఒకే గదిలో వసు-రిషి.. పరువు తీయడానికి సాక్షి మాస్టర్ స్కెచ్!

    |

    గుప్పెడంత మనసు సీరియల్లో గత ఎపిసోడ్ లో సాక్షి, వసు ఇద్దరూ రిషి అసిస్టెంట్ గా ఉండడానికి పోటీ పడడంతో వారిద్దరికీ పోటీ పెడతాడు రిషి. అలా ఒక్కొక్కరినీ మూడు ప్రశ్నలు అడుగుతానని, చెప్పే సమాధానం నచ్చితే చేయెత్తి ఓటేయండని కాలేజ్ లెక్చరర్లకు చెబుతాడు. అసలు ఇంత ఎందుకు అని గౌతమ్ అంటే ఏ ఒక్కరినీ అగౌరవ పరచడం ఇష్టం లేదని టెస్ట్ మొదలు పెడతాడు. రిషి మొదటి ప్రశ్న అడుగుతూ జీవితం అంటే ఏంటి? అంటే సాక్షి జీవితం అంటే ప్రయాణమని,ఓ నది ప్రవహించినట్టు గెలుపు ఓటములు చూస్తూ పయనించడమే అని అంటుంది. కానీ వసు జీవితం అంటే నిర్వచనం లేదు..జీవితం అంటే పోరాటం, జ్ఞాపకాల పూలగుచ్చం, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించడమని అంటుంది.

    మొదలు నరికేస్తే

    మొదలు నరికేస్తే

    ఈ ప్రశ్న విషయంలో సాక్షి గెలుస్తుంది. తరువాత రిషి రెండో ప్రశ్న ప్రపంచంలో స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ ఎవరిది అని అడిగితే సాక్షి తల్లి ప్రేమ నిజమైనది, నిస్వార్థమైనదని అంటే వసు ఏమో తల్లి ప్రేమ స్వచ్ఛమైనదే కావొచ్చు అందులో కూడా స్వార్థం ఉంటుందేమో అని నా అభిప్రాయం. ఎవరో ఏంటో తెలియకుండా సాటి మనిషికి సాయం చేసే ప్రతివాళ్లదీ నిస్వార్థమైన ప్రేమే అని అంటుంది.

    అయితే సాక్షి సమాధానాన్ని తప్పు బట్టవద్దని చెబుతూ రిషి మూడో ప్రశ్న వేస్తాడు. ఓ మనిషి ఎలా ఉండాలి అని అడిగితె సాక్షి ధైర్యంగా ఉండాలి తాను నమ్మినదానికోసమే నిలబడాలి..అవసరం అయితే ఎంతదూరమైనా వెళ్లాలి. అలా బతికేవాడే నిజమైన మనిషని అంటుంది. కానీ వసు మనిషి చెట్టులా బతకాలి. నీడనివ్వాలి,గాలినివ్వాలి, పుష్పాలనివ్వాలి, ఫలాలనివ్వాలి, మొదలు నరికేస్తే మళ్లీ మొలకెత్తాలి, అందరకీ ఆదర్శంగా ఉండాలని అంటుంది.

    అర్థం చేసుకోదేంటి

    అర్థం చేసుకోదేంటి

    ఈ క్రమంలో వసు సమాధానం విని అక్కడ ఉన్న వారు అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడతారు... ఈ రౌండ్ లో ఓటింగ్ అవసరం లేదు సార్..సాక్షికి ఓటేయ్యం వసుధారకే ఓటేస్తాం అంటారు. ఈ క్రమంలో వసుధార గెలిచిందని ప్రకటించిన రిషి.. కంగ్రాట్స్ అంటూ షేక్ హ్యాండ్ కూడా ఇస్తాడు. ఇక గెలుపు, ఓటములు పక్కనపెడితే నువ్వు చెప్పిన చివరి సమాధానం చాలా బాగుందని మెచ్చుకుంటాడు.

    అయితే సాక్షి ఈ పోటీలో ఓడిపోయినా జగతి మేడంకి అసిస్టెంట్ గా పనిచేస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయి రిషి... కారు దగ్గర నిలబడి వసు చాలా బాగా మాట్లాడింది..ఇన్ని తెలివితేటలున్నాయి మరి నా మనసు అర్థం చేసుకోదేంటి అనుకుంటాడు.

    కాల్ మీ మేడం అని

    కాల్ మీ మేడం అని

    మళ్ళీ తన గురించి వద్దనుకుంటూనే ఎందుకు ఆలోచిస్తున్నాను అని ఆలోచిస్తాడు. ఇంతలో దేవయాని నుంచి కాల్ రావడంతో దేవయాని సాక్షిని నీకు అసిస్టెంట్ గా తీసుకున్నావ్ కదా నాకు కాల్ చేసి చెప్పింది చాలా సంతోషమని అంటుంది. కానీ తనని అసిస్టెంట్ గా తీసుకున్నాను కానీ నాకు అసిస్టెంట్ గా కాదు జగతి మేడంకి అసిస్టెంట్ గాతీసుకున్నానని అంటాడు.

    ఇక జగతి క్యాబిన్లో పుష్పకి వర్క్ కేటాయిస్తే సాక్షి చిరాగ్గా కూర్చుంటుంది. నాకు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదని సాక్షి అంటే జగ: అన్నీ మనకు నచ్చినట్టే చేయడం కుదరదని అంటూ సాక్షి ఇంగ్లీష్ , భాష, తెలివైంది కూడా మెయిల్స్ పంపించే వర్క్ తనకి అప్పగించు పుష్ప అంటుంది. పుష్ప సాక్షి గారు పదండి సాక్షి అని అంటే సాక్షి గారూ కాదు కాల్ మీ మేడం అని అంటుంది.

    ఒక్కో రకం జెండా

    ఒక్కో రకం జెండా

    రిషి మామూలోడు కాదు అని అంటూ సాక్షి అంచనాలను తారుమారు చేశారని అనుకుంటుంది జగతి. ఇంట్లో అటు అటు తిరుగుతూ వసు ఆలోచనలో పడతాడు రిషి. బోర్డుపై నెమలీక బొమ్మ కింద ఉన్న చేయి నాదేనా.. వసుధార గురించి ఆలోచించొద్దు అనుకుంటూనే ఆలోచిస్తున్నానని అంటుంది. తను ఏం చేస్తుంటుంది, కాల్ చేద్దామా అని అంటూనే, వసు నిద్రపోతుండగా ఫోన్ రింగవుతుంది, దీంతో కాల్ లిఫ్ట్ చేసిన వసుధార చెప్పండి అంటే రిషి ఏం చెప్పాలి..ఆ బొమ్మ ఎవరు గీశారని అడుగుతాడు.

    ఇక వసు ఏ బొమ్మ సార్ అంటే సరే కాలేజీకి పొద్దున్నే వచ్చేయమని అంటుంది. ఇక రిషి దగ్గరకు మహేంద్ర-గౌతమ్ వస్తారు. వసుధార ని ఐడియా అడుగుదాం అంటాడు గౌతమ్. మనకు ఆలోచనలు లేవనా అని చెబుతూ పేర్కొంటూ ఒక్కో టీమ్ కి ఒక్కో రకం జెండా తయారు చేద్దాం అని అంటాడు.

    తూలి పడుతూ

    తూలి పడుతూ

    గౌతమ్ ఇదే మాట వసుకి చెప్పరా అంటే ఈ ఐడియాకు అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇస్తుందని అంటాడు. గుడ్ నైట్ డాడ్ నాకు నిద్రస్తోందని అంటూ యూత్ ఐకాన్ కి కాల్ చేసి చెబుదామా అనుకుంటూ ఉంటాడు. ప్రతిసారీ నేనే ఎందుకు కాల్ చేయాలని భావించిన రిషి కాలేజీకి వెళ్తాడు. ఇక అక్కడితో తాజా ఎపిసోడ్ ముగుస్తుంది.

    ఇక రాబోతున్న కమింగ్ అప్ ఎపిసోడ్ లో స్టోర్ రూమ్ లో జెండాలు వెతుక్కుంటుండగా వసుధార అక్కడకు వస్తుంది. మీరేంటి సార్ ఇక్కడ అంటే నువ్వేంటి ఇక్కడ అని రిషి అంటుంది వసుధార. రిషి కత్తెర అడగంతో తీసుకొస్తుండగా అక్కడున్న కుర్చీ తన్నుకుని తూలి పడుతూ ఉండగా వసుని కిందపడకుండా రిషి పట్టుకుంటాడు. ఇదే అవకాశంగా వీడియో తీస్తుంది సాక్షి, మీ సంగతి చెబుతాను అని అనుకుంటూ ఉంటుంది.

    English summary
    Guppedantha Manasu Episode 510: Vasudhara feels thrilled after winning against Sakshi. Later, Devayani is shocked to know that Rishi appoints Sakshi as Jagthi's assistant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X