For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu July 24th Episode: తల్లి కోసం రిషి సాయం.. చిక్కుల్లో వసుధార.. చివర్లో సస్పెన్స్

  |

  చాన్నళ్లుగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో శనివారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందంటే!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రాజీవ్‌పై పెట్టిన కేసును వసుధార వాపసు తీసుకుంటుంది. దీంతో రిషి కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇదే విషయంపై మహేంద్ర కూడా నిరాశగా ఉంటాడు. అతడికి జగతి సర్ధి చెబుతుంది. ఆ తర్వాత జగతి పుట్టినరోజును ఘనంగా జరపాలని వసుధార ఏర్పాట్లు చేస్తుంది. కానీ, దీనికి ఆమె మాత్రం అంగీకరించకపోగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

  Intinti Gruhalakshmi July 24th Episode: తులసిని భయపెట్టిన లాస్య.. నందూకు షాకిచ్చిన దివ్య.. కథ మలుపు

  సెలెబ్రేషన్స్‌కు ఒప్పేసుకున్న జగతి

  సెలెబ్రేషన్స్‌కు ఒప్పేసుకున్న జగతి

  జగతి పుట్టినరోజు సెలెబ్రేషన్స్ గురించి జరుగుతున్న చర్చతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఎవరు ఎంత చెప్పినా జగతి మాత్రం ఒప్పుకోదు. అయితే, ఫణేంద్ర 'మిషన్ ఎడ్యూకేషన్ గురించి మీరిచ్చిన ఐడియా గురించి మిమ్మల్ని సన్మానించుకోవాలని అనుకుంటున్నాము' అంటాడు. ఆ తర్వాత మహేంద్ర కూడా అడగడంతో జగతి పుట్టినరోజును జరుపుకోడానికి ఒప్పుకుంటుంది.

  ఎంటరైన రిషి.. నేను రాలేను అంటూ

  ఎంటరైన రిషి.. నేను రాలేను అంటూ

  వీళ్లంతా మాట్లాడుతుండగా రిషి ఎంట్రీ ఇస్తాడు. రావడం రావడమే దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఫణేంద్ర 'మిషన్ ఎడ్యూకేషన్ ఐడియా ఇచ్చినందుకు జగతి మేడంను సన్మానం చేద్దామని అనుకుంటున్నాము' అని చెబుతాడు. దీంతో దీనికి అందరూ ఓకే చెప్పారని తెలుసుకున్న రిషి.. 'ఆ ఏర్పాట్లు మీరే చేసుకోండి. నేను రాలేను' అని చెప్పి వెళ్లిపోతాడు.

  బర్త్‌డే గిఫ్టు గురించి వసుకు రిషి క్లాస్

  బర్త్‌డే గిఫ్టు గురించి వసుకు రిషి క్లాస్

  జగతి బర్త్‌డేకు గిఫ్టు కొనాలని వసుధార తన స్నేహితురాలితో మాట్లాడుతుండగా రిషి ఎంట్రీ ఇస్తాడు. ఎవరి పుట్టినరోజు అని అడుగుతాడు. దీనికి వసు తనకు బాగా కావాల్సిన వాళ్ల బర్త్‌డే అని బదులిస్తుంది. అప్పుడు 'ఎవరా పర్సన్? ఆడా మగా. అయినా మనం సెలెక్ట్ చేసే గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నామో వాళ్లకు నచ్చినదాన్నే తీసుకోవాలి అర్థమైందా' అంటూ ఆమెకు క్లాస్ పీకుతాడు.

  వయసు, పెళ్లిపై రష్మీ సంచలన వ్యాఖ్యలు: బట్టలు విప్పేస్తా.. ఉన్నది తీసేస్తా అంటూ ఓ రేంజ్‌లో రచ్చ

  రిషికి, తనకు దూరం పెరుగుతుందని

  రిషికి, తనకు దూరం పెరుగుతుందని

  పుట్టినరోజు సెలెబ్రేషన్స్ చేయడానికి ఒప్పుకున్న జగతి.. మహేంద్రతో కలిసి కారులో వెళ్తుంది. ఆ సమయంలో 'రిషికి నా బర్త్‌డే అన్న విషయం చెప్పలేదు. అది తెలిస్తే కోప్పడతాడు. దాని వల్ల మా ఇద్దరి మధ్య ఉన్న దూరం ఇంకా పెరుగుతుంది' అంటూ బాధ పడుతుంది. అప్పుడు మహేంద్ర ఆమెకు ధైర్యం చెబుతూ.. రిషి, జగతి కలుసుకున్నట్లు పగలే కలగంటూ సంతోష పడతాడు.

  శిరీష్‌కు అర్జెంట్ కాల్.. వసు కోసం రిషి

  శిరీష్‌కు అర్జెంట్ కాల్.. వసు కోసం రిషి

  కేక్ కోసం రమ్మన్న శిరీష్ కొంచె ఆలస్యంగా వస్తాడు. కానీ, ఏదో మర్డర్ కేసు గురించి ఫోన్ వస్తే వెళ్లిపోతాడు. అంతలో రిషి వచ్చి వసును బేకరీకి తీసుకెళ్తాడు. ఆ సమయంలో అతడితో కలిసి వసు ఓ సెల్ఫీని కూడా తీసుకుంటుంది. అప్పుడు అతడికి నచ్చిన కేక్‌నే తీసుకుంటారు. అయితే, దానిపై ఏ పేరు రాయాలి అని అడగ్గా వసు సమాధానం చెప్పలేకపోతుంది. దీంతో ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Guppedantha manasu Serial Episode 198: Jagathi Gave Green Signal to her Birthday Celebration. But Rishi Did Not Accept This. After That Rishi Selected Birthday Cake For Jagathi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X