twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: మరోమారు వసుధారను ఇరికించిన సాక్షి.. తీవ్ర స్థాయిలో రిషి ఫైర్!

    |

    వసుధార ఎలా అయినా తన ప్రేమను రిషి ముందు వ్యక్తం చేయాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షి కూడా ఎలా అయినా వారిద్దరూ కలవకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇక కొత్త ఎపిసోడ్ చివరిలో చూపించిన దాని ప్రకారం రిషి వసుధార ఒకేసారి స్టోర్ రూమ్ కి వెళతారు. వారిద్దరిని అక్కడ వీడియో తీసిన తర్వాత బయటకు వస్తున్న సాక్షకి గౌతమ్ ఎదురవుతాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో చూపిస్తున్న దాని ప్రకారం గౌతమ్ మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా అని మొదలుపెట్టి లండన్ లో ఎక్కడ ఉండేవారు? ఏం చేసేవారు? అసలు చదువు మధ్యలో ఆపేసి ఎందుకు వచ్చారు అని అడుగుతారు.

    ఇవ్వలేకపోతున్నా

    ఇవ్వలేకపోతున్నా

    సాక్షి దానికి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అంటే నన్ను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదండి చదువులు పండగలో చురుగ్గా పాల్గొంటున్నందుకు కంగ్రాట్స్ అని చెబుతాడు గౌతం. అసలు మీ పేరు గౌతమ్ ఏనా అంటే ఇన్నాళ్ల నుంచి చూస్తున్నారు కదా ఇప్పటి వరకు తెలియదా అంటే రోడ్డుపై వెళ్లే వారిని పట్టించుకోనని అంటుంది. అయితే చదువుల పండగ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి కానీ అవి మీరు తీర్చలేరులే ఇంకా మీకంటే ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతాను అంటాడు. ఇంతలో అటు వెళుతున్న పుష్పని పిలిచి కొన్ని డౌట్స్ ఉన్నాయని ఆవిడ దగ్గరికి వెళతాడు. దానికి సాక్షి ఏంటి గౌతమ్ కి కూడా చులకనయ్యానా, అందరికీ తగిన సమాధానం ఇస్తాను ఇతనికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అనుకుంటుంది.

    ఇంకా రాలేదేంటి?

    ఇంకా రాలేదేంటి?

    మరోపక్క అటెండర్ బ్యాగ్ తీసుకుని వెళుతూ ఉండగా ఆపిన రిషి ఈ బ్యాగ్ ఎవరిది అని అడిగితే వసుధార మేడం ది ఇందులో బ్యాడ్జీలు ఉన్నాయి అవి తీసేసి బ్యాగ్ క్లాసులో పెట్టడానికి వెళుతున్నానని అంటాడు. రిషి కూడా అక్కడ నుంచి క్లాస్ రూమ్ కి వెళ్ళగా వసూ బ్యాగ్ లో ఉన్న కలర్ చాక్ పీసులు చూస్తాడు. ఆ తర్వాత వెళ్లి వెనక బెంచీలో కూర్చుని అక్కడ ఉన్న ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంటాడు. బుక్ కింద పడటంతో వంగి తీసుకుంటూ ఉండగానే వసుధార క్లాసులోకి వచ్చి ఆమె ప్లేసులో కూర్చుంటుంది. అయితే వెనకే రిషి ఉన్న సంగతి తెలియకపోవడంతో ఏంటి పుష్ప రిషి సార్ రాలేదా? టైమ్ సైన్స్ అంటూ ఉంటారు కదా, ఇంకా రాలేదేంటి? ఇవాళ రాని లేటుగా వచ్చారని నేను పనిష్మెంట్ ఇస్తాను అంటుంది. ఇంతలోనే వెనుక నుంచి వచ్చిన రిషి బోర్డు మీద బొమ్మ గీసిన వాళ్ళు ఎవరు అని అడుగుతాడు.

     చదువులు పండుగ కాన్సెప్ట్

    చదువులు పండుగ కాన్సెప్ట్

    ఎవరూ మాట్లాడకపోవడంతో సరే ఈ కళాకాండాన్నీ ఎవరో గీశారు కానీ ఇప్పుడు దాన్ని చెబితే కానీ క్లాస్ చెప్పలేను కదా అంటాడు. బొమ్మ బాగుంది కానీ చెరిపేయక తప్పడం లేదంటూ చెరపడానికి సిద్ధమైన క్రమంలో వసు చెడపకూడదు అంటూ కళ్ళు మూసుకుంది. ఇంతలోనే వచ్చిన రిషి ఇలా బోర్డుపై బొమ్మలు గీయడం తప్పు ఎవరు గీసారో వాళ్లే వచ్చి బొమ్మ చెరిపేయమని అంటాడు. మరోపక్క తాను క్యాబిన్ కి వెళ్ళిపోతూ వచ్చి చదువులు పండగ విషయాలు అప్డేట్ చేయమని చెబుతాడు. తర్వాత క్యాబిన్ కి వెళ్ళిపోయిన తర్వాత వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రిషి నువ్వు ఎప్పటికీ అర్థం కాని చిక్కులెక్కవా అంటూ ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత అప్పుడే చదువులు పండుగ కాన్సెప్ట్ గురించి స్టూడెంట్స్ కి చెప్పేశావా అని అంటాడు.

    వసుధార కవరింగ్

    వసుధార కవరింగ్

    ఆమె ఇంకా ఏదో మాట్లాడుతున్న సమయంలో చదువులు పండుగ గురించి నీకు బాధ్యత అప్పగించాలని అనుకుంటున్నాను అని అంటాడు. చెప్పండి సార్ చేస్తానని అంటుంది. అప్పుడు చదువుల పండుగకు సంబంధించిన అన్ని వివరాలు ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి కొన్ని ఇంపార్టెంట్ వి నేను అనుకున్నవి నా దగ్గర ఉండవు ఏంటో మరి నేను పారేసుకోవడం కాదు, అవే దూరం అయిపోతాయి.

    కాబట్టి నువ్వు జాగ్రత్త చేయాలని అంటదు. నాకు పోగొట్టుకోవడం అలవాటైపోయింది కాబట్టి ఈ పెన్ డ్రైవ్ కూడా అలా పోతుందేమో అని నీకు ఇస్తున్నాను అంటాడు రిషి. తర్వాత మీరు ఇచ్చిన ప్రతిదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను సార్ అదే పెన్ డ్రైవ్ గురించి అన్నట్లుగా వసుధార కవరింగ్ ఇస్తుంది. దానికి రిషి చూడు వసుధార మనం ఈ చదువులు పండుగని సీరియస్ గా తీసుకోవాలి, నువ్వెంత సీరియస్గా తీసుకుంటున్నావో క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డు చెబుతోంది.

    పెన్ డ్రైవ్ కోసం ఇలా

    పెన్ డ్రైవ్ కోసం ఇలా

    ఈ ప్రాజెక్టుతో మనం మన కాలేజీ పేరు అని మరింత పెరిగేలా చేయాలి అని చెబుతాడు. తర్వాత తన క్యాబిన్ కి వచ్చిన సాక్షికి జగతి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు దుష్టశక్తులకు దూరంగా ఉండమని అంటుంది. తర్వాత అందరూ మీటింగ్ లో కూర్చుంటారు చదువుల పండగ గురించి డిస్కస్ చేయాలని పెన్ డ్రైవ్ అడుగుతాడు రిషి. యితే తన దగ్గర పెన్ డ్రైవ్ పోయిందని వసు అంటుంది.

    ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా పనిష్మెంట్ ఇవ్వాలని సాక్షి అంటే తప్పు చేసిన వారికి కచ్చితంగా ఇస్తాను అని అంటాడు. అక్కడితో తాజా ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత వసుధార మీద రిషి ఫైర్ అవుతూ ఉంటాడు. ఇంతకుముందులా బాధ్యతగా ఉండడం లేదు అంటే ఒక చిన్న పెన్ డ్రైవ్ కోసం ఇలా చేస్తున్నారా అంటే షట్ అప్ వసు అని గట్టిగా అరుస్తాడు. దాంతో వసుధార ఏడవడం మొదలు పెడుతుంది ఈ క్రమంలో రిషి ఆమెను ఓదార్చడం కనిపిస్తోంది.

    English summary
    Guppedantha Manasu Episode 512: Vasudhara gets worried as she loses the pendrive. Meanwhile, Sakshi takes this as an opportunity to trouble her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X