twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: సాక్షి ఆశలు ఆవిరి.. దేవయాని కళ్ల ముందే రిషి-వసు మూగబాసలు!

    |

    ఎలా అయినా వసుధారను రిషి దగ్గర ఇబ్బంది పెట్టాలని చూస్తున్న సాక్షి వసుధార పెన్ డ్రైవ్ పారేసుకుందన్న విషయం తెలిసి ఇంక రెచ్చిపోతుంది. ఖచ్చితంగా తప్పు చేసినవారికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతుంది. అయితే రిషి మాట్లాడుతూ తప్పు చేసిన వారికి శిక్ష తప్పకుండా వేయాలి సాక్షి అంటూనే అప్పుడు శిక్ష వేయాలి అంటే నాకు వేయాలి అంటూ షాకిస్తాడు. ఏం శిక్ష వేసుకోవాలో చెప్పమని అడిగితే ఏం మాట్లాడుతున్నావ్ రిషి నీకు శిక్ష వేయడమేంటి అని సాక్షి ప్రశ్నిస్తుంది. అవును ఈ పెన్ డ్రైవ్ నిజానికి నేను వసుధారకు ఇవ్వలేదు, ఇచ్చాను అనుకున్నాను అని అంటదు. ఏంటి వసుధార నువ్వు కూడా మరిచిపోయావా? మొదటి నీకు పెన్ డ్రైవ్ ఇచ్చాను మళ్లీ నేనే తీసుకున్నాను కదా అంటాడు.

    వసుధారకు క్షమాపణలు

    వసుధారకు క్షమాపణలు

    సాక్షి రిషి నువ్వు బాగా ఆలోచించి చెప్పు అంటే సాక్షి జరిగిందేంటో నాకు తెలుసు వసుధారకు తెలుసు పెన్ డ్రైవ్ మిస్ అయింది అనుకో దానికి సంబంధించి నేను అరవాలి లేదా ఏదైనా యాక్షన్ ఉంటే నేను తీసుకోవాలి మధ్యలో నువ్వెందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటాడు. దీంతో సాక్షి రిషి నేను ప్రాజెక్టు కోసం అంటూ ఉండగానే అవును ప్రాజెక్టు కోసం ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఆమె నోరు మూపిస్తాడు. దీంతో సాక్షి ఈ విషయంలో నేను ఆవేశ పడి ఉంటే సారీ అని చెప్పబోతుంటే సాక్షి నాకు కాదు సారీ చెప్పాల్సింది నువ్వు చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి అంటాడు. దీంతో సాక్షి ఆమె వసుధారకు క్షమాపణలు చెబుతుంది.

    మీకే దొరికింది కదా

    మీకే దొరికింది కదా

    తర్వాత ఏదో ఆలోచిస్తూ రిషి క్యాబ్ దగ్గరకు వెళ్ళిన వసుధార అసలు రిషి సార్ పెన్ డ్రైవ్ నాకు ఇచ్చారు కదా ఇప్పుడు నా దగ్గర అది లేకపోవడం ఏమిటి? నాకు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఆయన చేతికి ఎలా వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే క్యాబిన్ కి వచ్చిన రిషి అసలేంటి వసు ఇంత అజాగ్రత్తగా ఉంటున్నావు అంటే మీకు పెన్ డ్రైవ్ ఎలా దొరికింది అని అడుగుతుంది. నువ్వు పోగొట్టుకున్నావ్ కాబట్టి నాకు దొరికింది నాకు కావాల్సింది మాత్రం నేను పోగొట్టుకున్నాను అంటూ ఇంకా ఏదో మాట్లాడుతుంటాడు. మనిద్దరి చేతిలోనే ఉంది కదా దాన్ని పోగొట్టుకోవడం అనరు చేతులు మారడం అంటారు. ఆ పెన్ డ్రైవ్ మీరు నాకు ఇచ్చారు ఇవ్వలేదని మీరే కాపాడారు. మళ్ళీ మీకే ఎలా దొరికింది అంటే వసుధారకి ఇచ్చిన పెన్ డ్రైవ్ ఆమె బ్యాగులో పెట్టబోతూ ఉంటే అది కింద పడిపోయిన విషయాన్ని రిషి గుర్తు చేసుకుంటాడు. అయినా నీకు ఎందుకింత పరధ్యానం అంటే మీకే దొరికింది కదా అంటుంది వసుధార.

     తెలియని నిర్లక్ష్యం

    తెలియని నిర్లక్ష్యం


    ఒకవేళ నాకు దొరకకపోతే పరిస్థితి ఏంటి? నువ్వు ఇంతకు ముందులాగా బాధ్యతగా, భయం భక్తులతో ఉండడం లేదు ఏదో తెలియని నిర్లక్ష్యం నీలో కనిపిస్తోంది నాపై గౌరవం తగ్గిందా అసలు పూర్తిగా పోయిందా అంటే ఒక చిన్న పెన్ డ్రైవ్ కోసం ఇలా అడగడం ఏమీ బాలేదని ఆమె అంటే దానికి షట్ అప్ వసు అని అంటూ గట్టిగా అరిచి నువ్వు తప్పు. నువ్వు ఇచ్చిన పెన్ డ్రైవ్ పోగొట్టావ్ అది ఎంత ముఖ్యమో చెప్పాను కదా అయినా అందరి ముందు నిన్ను అవమానపరచడం ఇష్టం లేక అలా మాట్లాడలేదు అంటాడు. మామూలు స్టూడెంట్ ఇలాంటి తప్పు చేస్తే బాధపడే వాడిని కాదు కానీ నువ్వు ఇలా చేయడం నచ్చలేదంటే నాదే పొరపాటు నేను పెన్ డ్రైవ్ పోగొట్టాల్సింది కాదు నిజంగా మీకు దొరక్కపోతే మీరు ఇబ్బంది పడేవారు కదా అంటూ వసుధార ఏడవడం మొదలు పెడుతుంది.

    దేవయాని వంక

    దేవయాని వంక

    దీంతో రిషి అప్పటివరకు అరుస్తున్న వాడల్లా బతిమిలాడడం మొదలుపెడతాడు. ఇప్పుడేమైంది అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఇక అక్కడ సీన్ కట్ చేస్తే ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. నువ్వు కూడా మాతో పాటు కూర్చుని తినవచ్చు కదా అంటూ ధరణితో రిషి అంటే మీరు తినండి మీరు తిన్న తర్వాత నేను తింటాను అని ఆమె అంటుంది. అందరూ దేవయాని వంక చూస్తే అందరూ నా వంక చూస్తున్నారు ఏంటి? నేను ఏమైనా కంట్రోల్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అయినా ధరణి మీరు అనుకున్న విధంగా లేదు.

    ఫోన్లో చెబితే

    ఫోన్లో చెబితే


    ఇప్పుడు ఆమెలో మార్పులు కనిపిస్తున్నాయంటూ చెబుతుంది. ఇక నిద్రకు రెడీ అవుతున్న సమయంలోనే సాక్షి రిషికి ఫోన్ చేస్తుంది. నీతో మాట్లాడాలనిపిస్తుంది అంటే ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలోనే వసుధార ఇంటికి రావడంతో ఈ టైంలో ఎందుకు వచ్చావు నిన్ను దింపుతాను అంటూ సిద్ధమవుతాడు. ఈ లోపు వసుధార కింద పడబోవటంతో రిషి ఆమెను పట్టుకోవడాన్ని దేవయాని చూసి వాళ్ల మీద అరుస్తుంది ఈ సమయంలో అసలు ఇంటికి రావాల్సిన అవసరం ఏమిటి? ఫోన్లో చెబితే సరిపోతుంది కదా? అని అంటే అన్ని పనులు ఫోన్లోనే అవ్వవు కదా అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో ముందడుగు వేయాలి అంటూ వసుధార సమాధానం చెప్పడంతో తాజా ఎపిసోడ్ ముగించారు. చూడాలి రాబోతున్న ఎపిసోడ్స్ లో ఇంకా ఎలాంటి ట్విస్టులు ప్లాన్ చేశారనేది.

    English summary
    Guppedantha Manasu Episode 513: Rishi and Vasudhara have a romantic moment. Meanwhile, Sakshi plans to take advantage of Vasudhara's situation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X