Guppedantha Manasu July 28 Episode: పార్టీ చివర్లో ట్విస్ట్ ఇచ్చిన రిషి.. వసుధారకు కొత్త టెన్షన్

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందంటే!

 మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పుట్టినరోజు వేడుకలకు రమ్మని వసు రిషిని అడుగుతుంది. కానీ, అతడు మాత్రం ఆమెతో వాదిస్తాడు. అంతేకాదు, ఆ పార్టీకి రాను అని తెగేసి చెప్పేస్తాడు. ఆ తర్వాత దేవయాని అతడిని మరింతగా రెచ్చగొడుతుంది. ఇక, కాలేజ్‌లో జగతి బర్త్‌డే పార్టీ జరుగుతుంది. దానికి రిషి రాకపోవడంతో తల్లి ఎంతగానో బాధ పడుతుంది. అంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు.

జగతికి రిషి విసెష్... చివర్లో ట్విస్ట్ ఇస్తూ

జగతికి రిషి విసెష్... చివర్లో ట్విస్ట్ ఇస్తూ

రిషి రాలేదని అందరూ బాధ పడుతోన్న సమయంలో అతడు తనదైన శైలి మేనరిజంతో ఎంట్రీ ఇస్తాడు. బొకే పట్టుకుని నడుచుకుంటూ వచ్చిన హీరో.. జగతికి బర్త్‌డే విసెష్ చెబుతాడు. ఆ తర్వాత ట్విస్ట్ ఇస్తూ.. 'పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. ఇది మినిస్టర్ గారి తరపున చెబుతున్నా. కాలేజ్ ఎండీగా నాకు ఆ బాధ్యతను అప్పగించారు. బొకే కూడా ఆయనే పంపారు' అని చెబుతాడు.

 వసుధారకు మహేంద్ర ఊహించని రిక్వెస్ట్

వసుధారకు మహేంద్ర ఊహించని రిక్వెస్ట్

జగతి బర్త్‌డే పార్టీలో కేక్ పంచుతున్న వసుధారను పక్కకు పిలిచి మాట్లాడాలి అంటాడు మహేంద్ర. అప్పుడు 'నువ్వు మేడంకు ఏ గిఫ్ట్ ఇచ్చావ్' అని అడుగుతాడు. దానికి 'నేనేం ఇవ్వగలను సార్' అని అంటుంది. ఆ తర్వాత మహేంద్ర 'నువ్వు మేడంకు గురు దక్షిణ ఇవ్వాలి వసుధార. జగతి ఆనందాన్ని ఎప్పుడూ అలాగే ఉంచాలి. అంటే నువ్వు వాళ్లిద్దరినీ కలపాలి' అని రిక్వెస్ట్ చేస్తాడు.

 నా వల్ల అవ్వదు... ఎవరికీ సాధ్యం కాదు

నా వల్ల అవ్వదు... ఎవరికీ సాధ్యం కాదు

మహేంద్ర అడిగిన దానికి వసుధార షాక్ అవుతుంది. అంతేకాదు, 'సీరియస్ సింహాన్ని, కూల్ మేడంను కలపడమా? అది నా వల్ల కాదు సార్. నా వల్లే కాదు ఎవరికీ ఇది సాధ్యం కాదు' అని బదులిస్తుంది. అప్పుడు మహేంద్ర 'నువ్వు అలా చేయగలవు వసుధార. ఎలాగైనా వాళ్లిద్దరినీ కలుపు. జగతిని చూడు తన కొడుకును ఎంత ప్రేమతో చూస్తుందో' అని ఆమెను ప్రోత్సహిస్తాడు.

ఆదిలోనే షాకిచ్చిన రిషి... వసులో టెన్షన్

ఆదిలోనే షాకిచ్చిన రిషి... వసులో టెన్షన్

మహేంద్రతో మాట్లాడి వచ్చిన వసుతో 'రిషికి కేక్ ఇవ్వు' అని జగతి చెబుతుంది. దీంతో ఆమె కేక్ తీసుకెళ్లగా 'నో థ్యాంక్స్' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. దీంతో ఆదిలోనే షాక్ తగిలినట్లు అవుతుంది. అప్పుడు వసుధార.. 'మహేంద్ర సార్ నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించారు. కానీ, ఇది నా వల్ల అవుతుందా? నేను వాళ్లిద్దరినీ కలపగలనా' అంటూ టెన్షన్ పడిపోతుంటుంది.

తండ్రిని బాధ పెట్టిన రిషి.. వెళ్లిపోతూ అలా

తండ్రిని బాధ పెట్టిన రిషి.. వెళ్లిపోతూ అలా

బర్త్‌డే పార్టీ నుంచి సడన్‌గా బయటకు వెళ్లిపోయిన రిషి వెనుక మహేంద్ర కూడా వెళ్తాడు. కాసేపు ఉండమని అడుగుతాడు. దీనికి రిషి 'మీరు అనుకున్నది చేశారు కదా డాడ్ కంగ్రాట్స్. నాకు ఇష్టం లేకపోయినా.. నన్ను కాదని.. నేను వద్దన్నా వినకుండా మీకు నచ్చినట్లు చేసుకున్నారు' అంటూ వేరు వేరు చేసి మాట్లాడి వెళ్లిపోతాడు. దీంతో మహేంద్ర మనసులో ఎంతగానో బాధ పడతాడు.

తప్పు చేశావన్న దేవయాని.. రిషి జవాబు

తప్పు చేశావన్న దేవయాని.. రిషి జవాబు

ఇంటికి వచ్చిన రిషిని పిలిచిన దేవయాని 'బర్త్‌డే పార్టీకి వెళ్లి తప్పు చేశావేమో' అంటుంది. అప్పుడతను 'మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఎండీగా వెళ్లాను. వాళ్లంతా ఇష్టంతో వెళ్తే నేను తప్పక వెళ్లాను' అంటాడు. అప్పుడు దేవయాని 'వసుధార చెప్పడం వల్లే వెళ్లావనుకున్నా' అంటుంది. దీనికి 'నేను ఎవరి మాటలు వినను. ఎవరూ నన్ను మార్చలేరు' అంటూ సరైన సమాధానం ఇస్తాడు రిషి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X