For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: సాక్షి కంట పడిన ప్రేమ పక్షులు.. ఎట్టకేలకు ఓపెన్ అయిపోయిన వసుధార!

  |

  గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగిపోతోంది. ఎలా అయినా తన ప్రేమను రిషి ముందు ఉంచాలని వసుధార ప్రయత్నిస్తుంటే వాళ్ళిద్దరూ కలవకుండా చేయడానికి సాక్షి ఎంత దూరమైనా వెళదామని చూస్తోంది. తాజాగా కాలేజీలో చదువుల పండగ ఎపిసోడ్ చూపిస్తున్నారు. చివరి ఎపిసోడ్ లో వసుధార రిషి క్యాబిన్ కి వెళ్లి ఆయన కుర్చీతో మాట్లాడుతున్న సమయంలో రిషి అక్కడికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. రిషి కుర్చీతో ప్రేమ పలుకులు పలుకుతున్న సమయంలోనే రిషి రావడంతో వినేశాడు ఏమో అని వసుధార భయపడుతుంది కానీ రిషి వినడు ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

  మీరు రావాలా

  మీరు రావాలా

  రిషి లోపలికి రావచ్చా అని వసుధారను అడగడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యి అదేంటి సార్ మీ క్యాబిన్ కి మీరు రావాలా అని నన్ను అడుగుతారు అంటే నువ్వే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు కదా అందుకే అని అంటాడు. అక్కడ మీటింగ్ జరుగుతుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావంటే ఆనందం సార్, ఆనందం అంటుంది. అంత ఆనందం దేనికి అంటే గొప్ప ఆనందం కలిగితే చాటుగా వచ్చి మురిసిపోవాలి సార్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి అంటూనే ఈ మీటింగ్ అయిపోయాక మీకు ఒక సూపర్ గిఫ్ట్ ఇస్తాను అని మనసులో అనుకుంటుంది. అలా అనుకుంటూనే ఆయన వంక అదోలా చూస్తూ ఉండడంతో ఏమిటి అలా చూస్తున్నావ్ అంటే ఏమీ లేదు సార్ అంటూనే మాట్లాడుతున్నానని అంటుంది.

  సాక్షి కంట

  సాక్షి కంట

  ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటే నాతో నేనే మాట్లాడుతున్నాను నా మనసుతో మాట్లాడుతున్నానని అంటుంది. ఓహో నీకు మనసు కూడా ఉందా సరేలే వెళ్దాం పద అనడంతో ఇదేంటిది రాకపోతే చెయ్యి పట్టి లాక్కు వెళ్లేలా ఉన్నారే అని మనసులో అనుకుంటున్న సమయంలో రిషి ఆమె చేయి పట్టుకుని తీసుకువెళ్లడంతో షాక్ అవుతుంది. నేను వస్తున్నాను కదా అంటే నువ్వు వచ్చేలా కనిపించడం లేదు పదా అంటూ తీసుకు వెళుతూ ఉండగా వాళ్ళిద్దరూ అలా చేయి చేయి పట్టుకుని నడుస్తూ రావడం సాక్షి కంట పడుతుంది. ఇందులో రిషి వసుధార చేయి వదిలేస్తాడు. చదువుల పండుగ మీటింగ్ మనం సక్సెస్ చేయాలి సాక్షి అంటూ వసుధార ఆమెను తీసుకు వెళుతుంది.

  ఐ లవ్ యు రాసి

  ఐ లవ్ యు రాసి

  ఇక మీటింగ్ సందడి మొదలైన తర్వాత రిషి వసుధార ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన దేవయానికి చూడు సాక్షి వసుధార దృష్టి అంతా రిషి మీదే ఉంది. ఆమె ఎలా రిషిని ఆకర్షిస్తుందో చూడు అంటుంది. ఇంతలో సాక్షి టిఫిన్ ప్లేట్ తీసుకెళ్లి రిషికి ఇస్తుంది. నాకు వద్దు అంటే అందరూ మీకోసం చూస్తున్నారు మీరు వస్తే తిందామని ఆగామని వసు అంటుంది. నాన్సెన్స్ రిషి వాళ్ళతో కలిసి ఎందుకు తింటాడంటే ఇదంతా చూసి జగతి మహేంద్ర వీళ్లిద్దరి మధ్య రిషి నలిగిపోతున్నాడు కదా అనుకుంటారు. అయితే కాసేపు ఆగాక కాలేజీలో చెట్టు కింద కూర్చున్న వసుధార తన రిషి ఇచ్చిన గిఫ్ట్ తీసుకోకపోవడం వల్ల కింద పడిపోతే దాన్ని అతికించే పనిలో పడి దాని పూర్తిగా అతికించిన తర్వాత ఐ లవ్ యు రాసి ఈరోజు నేను మీకు ఇవ్వబోయే సర్ప్రైజ్ ఇదే, మీరు ఇచ్చిన మీకే గిఫ్ట్ మీకే ఇస్తున్నాను అనుకుంటుంది.

   అమ్మ అంటూ

  అమ్మ అంటూ


  ఇంతలోనే రిషి అక్కడికి రావడంతో మీకే గిఫ్ట్ రెడీ చేస్తున్నానంటే ఇవ్వమంటాడు కానీ ఇప్పుడు కాదు దానికో సమయం సందర్భం ఉంటుంది అప్పుడే ఇస్తానని అంటుంది. అయితే రిషి మాత్రం చూడనివ్వమని లాక్కుంటాడు కానీ ఎందుకో మధ్యలోనే ఆపేసి సరే నీకు నచ్చినప్పుడు ఇవ్వు అని ఆమెకే తిరిగి ఇచ్చేస్తాడు. అయితే ఇదంతా చూస్తూ ఉన్న సాక్షి మాత్రం ఒక పక్క రగిలిపోతూ ఉంటుంది. ఇక అందరూ కూడా మీటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వస్తారు. అక్కడ ప్రెస్ వాళ్లు జగతి మేడం గురించి మీ అమ్మ అంటూ ప్రస్తావించడంతో రిషి కొంత బాధ వ్యక్తం చేస్తాడు. తర్వాత మాట్లాడదామని అక్కడ నుంచి పంపించేస్తాడు.

  కమింగ్ అప్ లో

  కమింగ్ అప్ లో

  ఇక ఆ తరువాత రిషి మాట్లాడుతున్న సమయంలో సాక్షి ఎందుకో వరుసగా మెసేజీలు పెడుతూ ఉంటుంది. ఏంటి ఇన్నిసార్లు మెసేజ్లు వస్తున్నాయి చూడడం అవసరమా అంటూ రిషి చూస్తాడు. ఇక చివరికి వసుధార, రిషి కోసం తాను రెడీ చేసిన గిఫ్ట్ ని బ్యాగ్ లో పెట్టుకుని మీటింగ్ రూమ్ కి వెళుతుంది. స్టేజ్ పైన మాట్లాడిన తర్వాత రిషి ఒక్కొక్కరిని స్టేజి పైకి ఆహ్వానిస్తాడు. తర్వాత సాక్షి చదువుల పండుగ గురించి నేను కూడా మాట్లాడాలి నాకు కూడా అవకాశం ఇవ్వమని స్టేజి మీదకు వెళుతుంది ఇక రిషి వచ్చి కూర్చోగానే వసు కూడా కూర్చుని ఈ గిఫ్ట్ మీకోసమే అంటూ తను సిద్ధం చేసిన గిఫ్ట్ చేసి రిషికి ఇస్తుంది. రిషి షాక్ అవుతున్నట్లుగా రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్నారు చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

  English summary
  Guppedantha Manasu Episode 515: Rishi gets suspicious as Vasudhara leaves the event suddenly. Later, she plans a surprise for Rishi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X