Guppedantha Manasu: సాక్షి, దేవయానిలకు దిమ్మ తిరిగే షాక్.. రిషి మెడలో వసుధార పూలమాల!

గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. వసుధార అభినందసభ మొదలు కాకుండానే రిషి కారు తీసుకుని కావాలని బయటకు వెళ్లిపోగా, వసు 'రావచ్చు కదా సార్' అని మెసేజ్ పెట్టడంతో తిరిగి కాలేజీకి వచ్చి ఆడుకుంటూ ఉంటాడు. మరోపక్క సాక్షి, దేవయాని ప్లాన్‌ చెప్పడంతో జగతి టెన్షన్లో మునిగిపోతుంది. అలా గత ఎపిసోడ్ ముగించగా తాజా ఎపిసోడ్లో అది సాక్షి, దేవయానిల ఊహ అని తెలుస్తుంది.

సాక్షి, దేవయాని నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉండడంతో జగతి దేవయాని దగ్గరకు వెళ్లి.. 'అక్కయ్యా మీరు అనుకున్నట్లు ఏం జరగలేదు కూర్చోండి' అని అంటుంది. ఆమె కూడా దేవయాని పక్కనే కూర్చుని మీ వీడియో ఇంకా ప్లే కాలేదని అంటుంది. అంతేకాదు ఇక మీదట కూడా కాదు అంటూ.. గౌతమ్ సాయంతో ఆ పెన్‌ డ్రైవ్‌ని మార్పించిన విషయం కూడా చెబుతుంది. ఇక నేటి ఎపిసోడ్లో ఏమేం జరిగాయనే విషయం పరిశీలిస్తే

వసుధార గురించి గొప్పగా

వసుధార గురించి గొప్పగా

అంతేకాక నాకు ఆ వీడియో చూపించక ముందే మీ మీద నాకు డౌట్ వచ్చిందన్న జగతి నా జాగ్రత్తలో నేను ఉన్నాను' అంటూ అసలు ఏం జరిగిందనేది చెబుతుంది. ఇక వాళ్లు ఇచ్చిన వీడియో బదులుగా.. గౌతమ్ సీక్రేట్‌గా అందరిని వసు ఎలాంటిది? అని అడిగిన ప్రశ్నలు సమాధానాలు తెర మీద ప్లే అవుతాయి. వసు గురించి కాలేజ్ వాళ్ళు ఎం అనుకుంటున్నారు అని కూడా రికార్డు చేస్తారు. ఆ వీడియోలో జగతిని వసు గురించి చెప్పమనగా వసు చాలా యాక్టీవ్, కష్టజీవి అని అంటుంది. ఆ తర్వాత మహేంద్ర కూడా వసు మంచి పిల్ల అంటూ పొగుడుతాడు.. ఇక రిషిని అడిగితే ఎందుకు రా ఇబ్బంది పెడుతావని అంటూనే వసుధార గురించి గొప్పగా చెప్తాడు.

అందరూ షాక్

అందరూ షాక్

ఆ వీడియో చూసి వసు ఆనందపడుతుంటే అది చూసి తట్టుకోలేక సాక్షి కోపంగా వెళ్ళి పోదాం పదండి అని అంటే దేవయాని ఆగమని అంటుంది. తరువాత వసు గురించి రిషి స్టేజ్ మీద మాట్లాడుతూ.. 'ఇది పూర్తిగా వసుధార విజయమే అని, దీనికి కాలేజ్ గర్విస్తుందని అంటాడు. అయితే వాసు మాత్రం నా ఈ విజయాన్ని రిషి సార్‌కి అంకితం ఇస్తున్నాను' అంటూ అనడంతో అందరూ చప్పట్లు కొడతారు. ఇక ఈ క్రమంలో మినిస్టర్ వసు మెడలో దండేస్తాడు. అప్పుడే రిషి.. వసు పక్కకు వచ్చి నిలబడతాడు. వెంటనే ఏమనుకుందో ఏమో కానీ వసు తన మెడలోని దండ తీసి రిషి మెడలో వేసేస్తుంది. అది సాధారణంగా భార్యాభర్తలు మాత్రమే చేసే పని కావడంతో అందరూ షాక్ అవుతారు.

ప్రత్యక్షం అయినట్టు

ప్రత్యక్షం అయినట్టు

రిషి తన మెడలో దండ తీసి గౌతమ్‌కి ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోగా మహేంద్ర ఆ దండని తీసుకుని వెళ్లి రిషి కారులో వసు కూర్చునే సీట్‌లో కావాలనే పెడతాడు. రిషి బయలుదేరాక ఆ దండని చూసి పడేద్దాం అనుకుంటే.. వెంటనే పక్క సీట్‌లో వసు ప్రత్యక్షం అయినట్టు భ్రమ పడతాడు. నా మీద కోపం పూల మీద చూపిస్తారా అంటూ కౌంటర్ వేస్తున్నట్టు అనిపించడంతో నేను నీ వైపు చూడను అనుకుంటూ వసు సీట్ వైపు చూడకుండానే కారు ముందు వైపు ఆ దండను పెడతాడు. ఇక రిషి సహా మిగిలిన వాళ్లు వెళ్లిపోయిన తర్వాత.. వసు ఓ చోట కూర్చుని.. దండ వేయడం గుర్తు చేసుకుంటూ 'రిషి సార్ ఇప్పటికైనా నా మనసు మీకు అర్థమైందా?' అని అనుకుంటూ ఉంటుంది.

నిలదీసినట్లు

నిలదీసినట్లు

అప్పుడే జగతి, మహేంద్రలు ఆమెను వెతుక్కుంటూ రాగా జగతి కోపంగా.. 'దండ ఎందుకు వేశావని నిలదీస్తే ఏమనాలో అర్ధం కాక నాకు తెలియకుండానే.. అలా జరిగిపోయింది.. క్లారిటీగానే ఉన్నాను కానీ తెలియట్లేదు' అంటూ అర్ధం కాని సమాధానం ఇచ్చి వసు అక్కడ నుంచి ఎస్కెప్ అవుతుంది. మరోవైపు ధరణి, దేవయాని ఇంటికి వచ్చాక. కాఫీ కావాలని ధరణిని అడిగితే.. ధరణి ఆవేశంతో దేవయానిని 'అసలు నీ పద్దతేంటీ.? నేను నీకు పని మనిషిలా కనిపిస్తున్నానా? నీ కొడుకేమో అమెరికా నుంచి రాడు, నన్ను అక్కడికి పోనివ్వవు..' అంటూ గట్టిగా అరుస్తూ.. నిలదీసినట్లు భ్రమ పడుతుంది.

 దేవయానికి కన్నుకొట్టి

దేవయానికి కన్నుకొట్టి

మళ్లీ తేరుకుని.. 'ఇదంతా నా ఊహనా' అనుకుని కాఫీ తేవడానికి వెళ్లిపోతుంది. ఇంతలో జగతి, మహేంద్రలు ఇంటికి వస్తారు. రిషి కూడా రావడంతో కారు డ్రైవర్.. రిషి కారులోని పూల దండను అపురూపంగా లోపలికి తెస్తుంటే.. దేవయాని చూసి.. 'దాన్ని చెత్తబుట్టలో వేయమని అంటుంది. అయితే అలా చేసేందుకు జగతి అడ్డు పడుతుంది. అయితే అప్పుడే రిషి వస్తున్నా సంగతి తెలిసి సరిగ్గా రిషి లోపలికి వచ్చేసరికి జగతి కావాలనే ఆ పూల దండని చెత్తబుట్టవైపు తీసుకుని వెళ్తుంది. ఎక్కడికి మేడమ్ దాన్ని తీసుకుని వెళ్తున్నారని అంటే చెత్తబుట్టలో వేయడానికని అంటుంది జగతి. 'చెత్తకుప్పలో వేస్తారా? మనుషుల మీద కోపాన్ని పూల దండ మీద చూపిస్తారా? అది ఇలా ఇవ్వండి' అని దాన్ని రిషి తీసుకుంటాడు. ఇదంతా చూశావా అన్నట్టు జగతి దేవయానికి కన్నుకొడుతుంది. చూడాలి రాబోతున్న ఎపిసోడ్స్ ఎలా సాగనున్నాయి అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X