Guppedantha Manasu July 30th Episode: తల్లి ఆశలపై నీళ్లు చల్లిన రిషి.. పార్టీకి అందుకే వచ్చానంటూ!

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. జగతి పుట్టినరోజు సందర్భంగా రిషి ఇచ్చిన పూల బొకేను ఫొటో తీసి అతడికే పంపుతుంది వసుధార. అలాగే పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్ అని మెసేజ్ చేయడంతో ఆమెపై రిషి ఫైర్ అవుతాడు. ఆ తర్వాత ధరణి రిషిని వసుధార పిలిచినందుకే పార్టీకి వచ్చావు కదా అని అడుగుతుంది. అనంతరం జగతి వసును హగ్ చేసుకుని థ్యాంక్స్ చెబుతుంది.

వసుతో సినిమా... ప్లాన్ చేసిన శిరీష్

వసుతో సినిమా... ప్లాన్ చేసిన శిరీష్

మహేంద్ర కారులో వసుధారను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు శిరీష్. ఆ తర్వాత ఆ కారు కీని ఆమెకు ఇచ్చేస్తాడు. అంతేకాదు, కానిస్టేబుల్ తన కారును తీసుకొస్తున్నాడని చెబుతాడు. ఇక, వెళ్లే ముందు 'సాయంత్రం మనం సినిమాకు వెళ్తున్నాం' అని వసుధారతో చెబుతాడు. దీనికి ఇప్పటికిప్పుడే అంటే ఎలా అంటుంది. కానీ, అతడు మాత్రం ఆమెను చిరునవ్వుతో ఒప్పించి వెళ్లిపోతాడు.

ఆ ఫొటో ఎందుకు పెట్టావని ప్రశ్నలు

ఆ ఫొటో ఎందుకు పెట్టావని ప్రశ్నలు

శిరీష్‌తో మాట్లాడి వస్తున్న వసుధార.. అక్కడే ఉన్న రిషి దగ్గరకు థ్యాంక్స్ చెప్పేందుకు వెళ్తుంది. కానీ, అతడు మాత్రం చాలా కోపంతో ఉంటాడు. ఆమె రావడమే 'బొకే ఫొటో ఎందుకు పెట్టావ్? నువ్వు కూడా నీ వల్లే నేను పార్టీకి వచ్చానని అనుకుంటున్నావా? నన్ను ఎవరూ మార్చలేరు. నేను ఎవరి వల్లా మారిపోను. ఇది కాలేజ్ కావడం వల్లే ఇలా మాట్లాడుతున్నా' అని కోప్పడతాడు.

గర్వంగా ఫీల్ అయ్యే అక్కడకు వచ్చా

గర్వంగా ఫీల్ అయ్యే అక్కడకు వచ్చా

వసుధారపై కోప్పడుతున్న సమయంలోనే కాలేజ్ పేరును చూపిస్తాడు రిషి. 'చూశావా? నా కాలేజ్‌కు మంచి పేరు తీసుకు రావాలనే కారణంతోనే పార్టీకి వచ్చాను. అంతేకానీ, నువ్వు నీ మేడమ్ వేరేగా ఊహించుకోకండి. పది మందికి ప్రచారం చేసుకోకండి' అని అంటాడు. అప్పుడు వసుధార 'మీకు చివర్లో ఓ మాట చెప్పాను. వస్తే రండి లేకపోతే లేదు అని. అది గుర్తు లేదా సార్' అంటుంది.

వసుధారను మనసులోకి రానివ్వను

వసుధారను మనసులోకి రానివ్వను

వసుధార మాటలకు ఖాతరు చేయని రిషి.. ఆమెకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆఫీస్‌ రూమ్‌లోకి వెళ్లిపోతాడు. అయితే, అతడికి లాప్‌టాప్‌లో, ఫైల్స్‌లో వసుధార రూపమే కనిపిస్తుంది. అప్పుడు రిషి 'వసుధార మాయలో పడిపోకూడదు. తను నా స్టూడెంట్.. నేను ఎండీని. ఆమెను ఎప్పటికీ నా మనసులోనికి రానివ్వను' అంటూ తనలో తానే చెబుతాడు.

Recommended Video

FCUK Movie Song 4 Manasu Katha
జగతి ఎమోషనల్.. రిషి మాత్రం అలా

జగతి ఎమోషనల్.. రిషి మాత్రం అలా

మహేంద్రతో కలిసి కాలేజ్‌కు వచ్చిన జగతి.. పార్టీ జరిగిన రూమ్‌లోకి వెళ్తుంది. అక్కడ రిషి తనకు విషెస్ చెప్పింది, బొకే ఇచ్చింది గుర్తు చేసుకుని సంబర పడిపోతుంది. అలాగే, రిషి రావడం తనకు కలలా అనిపించిందని తెగ సంతోష పడుతుంది. అవన్నీ చూస్తున్న, వింటున్న రిషి మాత్రం 'నన్ను ఎవరూ మార్చలేరు. నాకు అన్ని విషయాలూ గుర్తున్నాయి' అంటూ అక్కడి నుంచి వెళ్తాడు.

తండ్రితో రిషి చర్చ.. ఊహించుకోవద్దు

తండ్రితో రిషి చర్చ.. ఊహించుకోవద్దు

కొద్ది సేపటికి మహేంద్ర అక్కడి నుంచి వస్తుండగా రిషి ఎదురై 'చిన్న చిన్న దానికే మరీ సంతోషపడకండి డాడ్. ఇప్పుడేమీ మర్చిపోలేదు. ఇష్టం లేని మనుషులను ఎప్పటికీ దగ్గరకు రానివ్వలేము. గోడకు అంటిన సున్నాన్ని తుడిపేయొచ్చు. కానీ, మనసుకు అంటకుంటే కష్టం డాడ్. చెత్తను ఎప్పటికైనా డస్ట్‌బిన్‌లోనే వేస్తాం' అని అంటాడు. దానికి మహేంద్ర ఎంత చెప్పినా పట్టించుకోడు రిషి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X