For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: రిషికి దిమ్మతిరిగే షాకిచ్చిన సాక్షి.. మింగలేక కక్కలేక ఇబ్బందులు!

  |

  గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఎలా అయినా రిషికి తన ప్రేమను బయటపెట్టడానికి చూస్తుండగా సాక్షి దాన్ని అడ్డుకోవాలని చూస్తోంది. ఇక తాజాగా మీటింగ్ జరుగుతుండగా రిషి దగ్గరకు వచ్చిన వసుధార మీతో మాట్లాడాలి అంటుంది. అంతే కాక తను ప్యాక్ చేసిన గిఫ్ట్ తీసి రిషికి ఇస్తుంది. రిషి దాన్ని ఓపెన్ చేస్తుంటే టెన్షన్ పడుతుంటుంది వసుధార.

  ఓపెన్ చేసిన రిషి..అందులో గతంలో వసుకి తాను ప్రపోజ్ చేసినప్పుడు ఇచ్చిన గిఫ్ట్ ఉండడం చూసి ఒక రకంగా షాక్ అవుతాడు. ఒకప్పుడు తాను ప్రపోజ్ చేయడం వసు రిజెక్ట్ చేయడం నా గుండెను ముక్కలు చేసి వెళుతున్నావ్ అంటూ గిఫ్ట్ పగలగొట్టిన విషయం గుర్తుచేసుకుని ఆ ఈ గిఫ్ట్ అతికించి మళ్లీ నాకే ఎందుకు ఇచ్చింది అని ఆలోచనలో పడతాడు.

  కిందపడబోతుండగా

  కిందపడబోతుండగా

  అసలు ఈమె నాకు ఏం చెప్పాలనుకుంటోంది..నన్నెందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావ్ అనుకుంటూ దాన్ని ముందుకు తిప్పుతాడు.. అక్కడ ఐ లవ్ యూ అని వసు రాసి ఉంటుంది. అది ఆనందించే లోపే మరోవైపు స్టేజ్ పై మాట్లాడుతున్న సాక్షి వాళ్ళిద్దర్నీ గమనిస్తూనే డీబీఎస్టీ కాలేజీకి నాకు ఎలాంటి సంబంధం లేదు కానీ అంతకుమించిన బంధం ఉందని అంటూ కాలేజీకి నాకు ఎలాంటి సంబంధం లేదుకానీ ఈ కాలేజీ నాది.. ఈ కాలేజీ ఎండీ రిషికి కాబోయే భార్యని నేనే అంటూ బాంబు పేలుస్తుంది.

  రిషి తన కాబోయే భర్త అయినప్పుడు కాలేజీ నాదే కదా అని ఆమె అంటూ ఉంటె ఆ మాట విని షాక్ అయి రిషి పైకి లేచి నిల్చున్న క్రమంలో తన ఒడిలో నుంచి గిఫ్ట్ కిందపడబోతుండగా వసుధార పట్టుకుంటుంది.

  వికటాట్టహాసం

  వికటాట్టహాసం

  ఈ సమయంలోనే రిషికి నాకు యంగేజ్ మెంట్ అయింది..కాదని రిషి సార్ ని చెప్పమనండి అని సాక్షి అంటుంటే స్టేజ్ పైకి వెళ్లిన రిషి ఏం చేస్తున్నావ్ అని ఆమెను ప్రశ్నిసాడు. నీ ఫోన్ కి చాలా ఫొటోస్ పంపించాను ఇప్పుడైనా చూడు రిషి అంటే ఏమిటో అని చూస్తాడు. ఆ ఫొటోస్ ఏంటంటే స్టోర్ రూమ్ లో పొరపాటున వసుధార పడిపోతుండగా రిషి పట్టుకున్న ఫొటోస్ ఆ ఫొటోలతో ఇలా అంటుంది ఏంటి అని రిషి ఆలోసిహ్స్తూ ఉంటే నువ్వేమైనా మాట్లాడితే ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నీ మీడియాకు పంపిస్తా, ఈ ఫొటోలకు అందమైన ప్రేమకథను జోడిస్తా నీకేం కాదు కానీ నీకు ఇష్టమైన వాళ్ళ జీవితం నాశనం అవుతుందని బెదిరిస్తుంది. రిషి ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతే దేవయాని మనసులోనే వికటాట్టహాసం చేస్తూ ఉంటుంది.

  నాకే ఇలా ఉంటే

  నాకే ఇలా ఉంటే

  వసుధార, సాక్షి ఏంటి రిషి సార్ ని ఇలా ఇరికించింది అనుకుంటుంది. దానికి సాక్షి వసుధార నువ్వేం చేయలేని పరిస్థితి కల్పించానని, ఈ రోజు ఆటా నాదే గెలుపూ నాదే అని మనసులో అనుకుంటుంది. ఇక మహేంద్ర అసలేం జరిగింది జగతి, నాకేం అర్థంకాలేదు మైండ్ బ్లాక్ అయిపోయింది తెలుసా అంటే మాట్లాడడానికి ఏముంది..ఇలా జరగాల్సింది కాదు కానీ జరిగిందని అంటుంది.

  అసలు నాకే ఇలా ఉంటే..రిషి సంగతి ఆలోచించావా..తన మొహంలో నాకు ఎలాంటి భావాలు కనిపించలేదని మహేంద్ర అంటాడు. ఇక ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్..అందరూ వెళ్లిపోయారు పదండి వెళదాం అంటే అప్పుడే వచ్చిన దేవయాని జగతి నువ్వు మాత్రం ఉండమని అంటుంది.

   వాడు నా కొడుకు

  వాడు నా కొడుకు


  అలా ఆమె ఒక్కతే దొరకగానే ఇదీ దేవయాని అంటే..అర్థమైందనుకుంటానని అంటే దానికి జగతి దేవయాని అక్కయ్య అంటే నాకు 20 ఏళ్ల క్రితమే అర్థమైందని అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదని అంటుంది. దానికి దేవయాని సాక్షి నా ఆయుధం, నీ ఓటమి నా గెలుపు. నేను స్థిరంగా ఉంటానని అంటుంది. అయితే నా చుట్టూ నీడలా నువ్వు మారుతావని అంటుంది. అంతేకాక సాక్షి-రిషి పెళ్లికి నువ్వుండాలని దేవయాని ఉంటుంది. ఇక జగతి మాట్లాడుతూ రిషి పెళ్లి నా చేతుల మీదుగా నా కళ్లముందే జరుగుతుంది..మీరనుకుంటున్నట్టు సాక్షితో జరగదని అంటుంది. అయితే దేవయాని ఇంకా ఓటమిని ఒప్పుకోవడం లేదు కదా జగతి అంటే, జగతి రిషి ఎప్పటికీ సాక్షిని ఒప్పుకోడు..వాడు నా కొడుకు అని అంటుంది.

   హ్యపీగా ఉన్నానని

  హ్యపీగా ఉన్నానని


  దానికి దేవయాని నేను పెంచాను కదా అంటుంది. అయితే జగతి గంజాయి మొక్క పక్కన తులసి మొక్క పెరిగినా దాని పవిత్రతను కోల్పోదని అంటుంది. ఇక మరో పక్క బయట కారు దగ్గరకు వెళ్లిన రిషి..స్టేజ్ పై సాక్షి మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడకు వచ్చిన రిపోర్టర్ పెళ్లి గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. దానికి రిషి పర్సనల్ క్వశ్చన్స్ వద్దు అనేసి తప్పించుకుంటాడు. వసుధార కనిపించడం లేదేంటి అని ఆలోచిస్తూ ఉండగా వసుధార రెస్టారెంట్లో కూర్చుని ఎదురుగా గిఫ్ట్ పెట్టుకుని ఆలోచనలో ఉంటుంది. అసలు సాక్షి అలా మాట్లాడుతుంటే మీరెందుకు మాట్లాడలేదు అని వాసు అనుకుంటుంది..ఇంతలో అక్కడకు వచ్చిన సాక్షి నాకు కంగ్రాట్స్ చెప్పవా..నేను చాలా హ్యపీగా ఉన్నానని అంటుంది. సాక్షి ఏదేదో మాట్లాడుతున్నా వసుధార సైలెంట్ గా ఉండగా ఎపిసోడ్ ముగించారు.

  English summary
  Guppedantha Manasu Episode 516: Vasudhara tries to express her love for Rishi. Meanwhile, Sakshi blackmails Rishi during a press meet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X