India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: సాక్షితో క్లోజ్ గా రిషి.. షాకయిన వసుధార.. భలే ప్లాన్ వేశాడే!

  |

  గుప్పెడంత మనుసు సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. రిషి మీద వసు ప్రేమ పెంచుకున్న క్రమంలో దాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఇక గత ఎపిసోడ్ లో వసుధారని కాలేజీలో ఆపి మరీ సాక్షి వాదన పెట్టుకుంటుంది. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగియగా తాజా ఎపిసోడ్లో ఏమి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  నీ సంగతి చెప్తా

  నీ సంగతి చెప్తా

  సాక్షి తనను ఆపిన క్రమంలో వసుధార మాట్లాడుతూ నువ్వు వెళుతున్న దారి కరెక్ట్ కాదని అంటే సాక్షి ఒకరు చెప్పింది వినడం నాకు అలవాటు లేదని, నాపై నాకు నమ్మకం ఉందని అంటుంది. దానికి వసుధార కాన్ఫిడెన్స్ ఓకే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని, నీ ఆలోచనల్లో కుట్రలు కుతంత్రాలున్నాయని అంటుంది.

  అయితే దానికి సాక్షినా దగ్గర ప్రేమ ఉందని అంటుంది. అయితే వసుధార లైబ్రరీలో దొరికే పుస్తకం కాదు ప్రేమంటే..దాన్ని కొట్టేయలేం, కొనుక్కో లేం. ప్రేమ సహజంగా పుట్టాలి, స్వతహాగా ఉండాల్సిన ఫీలింగ్ ని తెచ్చిపెట్టుకుంటే రాదని క్లాస్ పీకుతోంది. ఇక ఈ క్రమంలో సాక్షి గెలిచానని పొంగిపోకు వసుధార...గెలుపు పర్మినెంట్ కాదు...రాబోయే గెలుపు నాదే అంటూ అంటుంటే ఎప్పుడో అప్పుడు నీ మెడపై చేయి పెట్టి నీ దారి తప్పు అని చెప్పేవరకూ తెచ్చుకునేలా ఉన్నావని అంటుంది.

  దానికి సాక్షి కూడా హారన్ కొడితే మనుషులు తప్పుకుంటారేమో దురదృష్టం తప్పుకోదు...ఆల్ ది బెస్ట్... చెప్తాను నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటుంది.

  ఇప్పుడొచ్చిందేంటి

  ఇప్పుడొచ్చిందేంటి

  అలా క్లాసుకు వసుధార వెళుతున్న క్రమంలో వసుధార క్లాస్ రూమ్ లో అడుగుపెట్టగానే స్టూడెంట్స్ అందరూ కంగ్రాట్స్ అంటారు. పుష్ప కూడా నీకోసం పెద్ద పార్టీ ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ కుదర్లేదు అంటుంది. దానికి వసు ఈ మాత్రం దానికే పార్టీ ఎందుకు అంటుంది. ఆలా అంటూనే రిషి సార్ ఇంకా రాలేదా? కాలేజీలో కనిపించలేదు అనుకుంటుంది.

  ఇంతలో జగతి మేడం క్లాస్ రూమ్ కి రావడంతో ఆమెను చూసి వసు అసలు సాక్షి కాలేజీకి ఎందుకు వచ్చింది, సాక్షి వచ్చిన విషయం తెలియకపోతే నేను టెన్షన్ పడేదాన్ని కాదని అనుకుంటుంది. అందుకే క్లాస్ రూమ్ లోంచి బయటకు వెళ్లేందుకు పర్మిషన్ అడుగుతుంది. అర్జెంట్ మేడం ప్లీజ్ అనగానే సరే వెళ్లమని జగతి అంటుంది. రిషి రూమ్ కి సాక్షి రావడంతో మహేంద్ర సాక్షి ఇప్పుడొచ్చిందేంటి, పెద్ద తలనొప్పిగా తయారైంది అనుకుంటాడు.

  దండలు ఎప్పుడు వేస్తారు

  దండలు ఎప్పుడు వేస్తారు

  అలా వచ్చిన సాక్షి రిషి టేబుల్ పై న్యూస్ పేపర్ వేసి మీ ఇద్దరి ఫొటో పేపర్లో వచ్చింది..ఏంటిది అని అడుగుతుంది. దానికి మహేంద్ర ఫొటో పేపర్లో వస్తే తప్పేముందని అంటే ఈ విషయం రిషి చెబితే బాగుంటుందని అంటుంది. రిషి కూడా డాడ్ చెప్పిన దాంట్లో తప్పేముంది...తను విజయం సాధించింది..అభినందించామని ఆ ఫోటోనే కదా వేశారని అంటాడు.

  అయితే మీరిద్దరూ హత్తుకున్న ఫోటోలు ఇలా పేపర్లో వస్తే ఏమనాలని ప్రశ్నిస్తుంది. దానికి రిషి వసు ప్లేస్ లో ఎవ్వరున్నా ఇదే చేస్తానని అంటాడు. మహేంద్ర సాక్షితో రిషికి చాలా పనులుంటాయని, చిన్న చిన్న వాటికి డిస్టబ్ చేయొద్దని అంటే ఇది చిన్న విషయం ఎందుకవుతుంది..దండలు ఎప్పుడు వేస్తారు, ఎప్పడు మార్చుకుంటారో తెలుసా అని అడుగుతుంది. ఇక సాక్షిని బలవంతంగా బయటకు తీసుకెళ్లి వదిలి వస్తాడు మహేంద్ర.

  రెస్టారెంట్ కి రా

  రెస్టారెంట్ కి రా

  మరో పక్క కాలేజీ ఎంట్రన్స్ లో నిల్చున్న వసుధార..సాక్షి దగ్గర్నుంచి పేపర్ లాక్కుని, ఒక్కొక్కప్పుడు లాక్కోవడంలో కూడా ఎంతో ఆనందం ఉంటుందని అంటే సాక్షి దానికి ముందు ముందు నీకే తెలుస్తుందిలే అంటుంది. అయితే ఈ ఫొటోలో నేను బాగున్నానా?, రిషి సార్ తో కలిసి ఎలా ఉన్నాను? జోడీ అనబోతూ ఉండగా సాక్షి షటప్ అంటుంది.

  అయితే వసు మాత్రం అంత దూరం నుంచి వచ్చావ్ , ఈ పేపర్ తెచ్చావ్...బదులుగా ఏమైనా ఇవ్వాలి కదా అని చాక్లెట్ ఇవ్వబోతుంది. అయితే అది చిన్నదే అనుకుంటే...రెస్టారెంట్ కి రా బిల్లు మొత్తం కడతానని అంటుంది. అలా అన్న తరువాత ఓ ఫొటో తీసుకుంటాను అని పేపర్లో ఫొటోని ఫోన్లో దాచుకుంటుంది వసుధార.

  రిషి సాక్షితో క్లోజ్ గా

  రిషి సాక్షితో క్లోజ్ గా

  ఇక మరోపక్క వసుధార దండ వేసిన ఫొటో తలుచుకుంటూ రిషి అలా ఆలోచనలో పడి నడుచుకుంటూ వెళ్తుండగా ఆయనకు వసుధార ఎదురుపడుతుంది. రిషి ఆమెను చూస్తూ ఏంటి వసుధార నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావని అడుగుతాడు. దానికి వసు మీ గురించే సార్...రిషి సార్ కి మెసేజ్ పెడితే ఇంకా రిప్లై ఇవ్వడం లేదేంటని నాలో నేనే అనుకుంటున్నానని అంటుంది.

  దానికి రిషి నాకు ఇంకేం పనులుండవా, నీ మెసేజ్ కి ఆన్సర్ ఇవ్వడమే పనా అని ప్రశ్నిస్తాడు. ఇక అక్కడితో తాజా ఎపిసోడ్ ముగించారు. ఇక తదుపరి ఎపిసోడ్ కమింగ్ అప్ లో కనిపిస్తున్నదని ప్రకారం ఈ రోజంతా నేను రెస్టారెంట్ డ్యూటీలోనే ఉంటాను అని రిషితో అంటే వసుధార నన్ను రెస్టారెంట్ కి రమ్మంటోందా అని అనుకుంటాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు వసుధార నీకు చాలా క్లారిటీ ఇస్తాను చూడు అనుకుని సాక్షిని తీసుకుని అక్కడికి వెళ్లిన రిషి ఆమెతో కలిసి కాస్త క్లోజ్ గా కనిపిస్తూ ఉండడంతో వసు షాక్ అవుతుంది.

  English summary
  Guppedantha Manasu Episode 494: Sakshi tries to create trouble, but Rishi gives her a befitting answer. Later, she gets infuriated after having a heated argument with Vasudhara.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X