For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: సాక్షి సూసైడ్ నాటకం.. నమ్మేసిన రిషి.. వసుధారకు షాక్!

  |

  గుప్పెడంత మనసు సీరియల్ లో ప్రస్తుతం వసు తనకు రిషి మీద ఏర్పడిన ప్రేమను ఆయనకు ఎలా వ్యక్తం చేయాలా అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి ఆసక్తికరంగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎపిసోడ్లో వసుధార-సాక్షి మధ్య ఈ విషయం మీద వాగ్వాదం జరిగింది. ఇక అలా గత ఎపిసోడ్ ముగియగా తాజా ఎపిసోడ్లో ఏమి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  లంచ్ చేయడానికి

  లంచ్ చేయడానికి

  తాను చేసిన మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదని రిషిని అడిగిన వసుధాతో...నాకేం పనిలేదా, నాకు కుదిరిప్పుడు రిప్లై ఇస్తాను అని అంటాడు. ఇదంతా చూసి జగతి-మహేంద్ర.. అసలేం జరుగుతోందబ్బా అని ఆలోచనలో పడతాడు. ఐటీ రిషి దగ్గరకు వసు ఎందుకొచ్చిందని జగతి అడిగితే... సాక్షి నుంచి రిషిని రక్షించేందుకు వచ్చింది ఏమో అని అంటాడు మహేంద్ర. రిషి మాత్రం చాలా బ్యాలెన్స్ గా వ్యవహరిస్తున్నాడు అని కూడా అంటాడు. అయితే రిషి వెళ్ళిపోవడంతో వసుని లంచ్ చేద్దాం రమ్మని పిలుస్తుంది జగతి. రిషి సార్ తినకుండా వెళ్లిపోతున్నారని అన్న వసుధారతో..మీ సార్ నువ్వు ఏమనుకుంటారో మీ ఇష్టం అనేసి జగతి రూమ్ కి వెళ్లి మహేంద్రతో కలిసి తినడం మొదలు పెడుతుంది. జగతి-మహేంద్ర తింటుంటే వసుధార కూడా వాళ్ళతో జాయిన్ అవడంతో ఆమె కూడా వాళ్లతో కలిసి లంచ్ చేయడానికి వెళుతుంది.

  ఇంకెప్పుడైనా చెబుతా

  ఇంకెప్పుడైనా చెబుతా

  ఇక రిషి సార్ కి తినమని మీరైనా చెప్పొచ్చుకదా అని వసుధార అంటుండగా అక్కడకు వచ్చిన రిషి మహేంద్ర దగ్గర ఆయన కార్ కీస్ తీసుకుని వెళ్లిపోతూ, జగతితో మీ స్టూడెంట్ ఈ మధ్య కొన్ని అర్థం పర్థం లేని పనులు చేస్తోంది, కాస్త చెప్పండి..కాలేజీ కనెస్ట్రక్షన్ వర్క్స్ తనకి అవసరం లేదని అంటాడు. దానికి జగతి నేను చెబుతానని అంటుంది. దానికి వసుధార నేను ఏం చేశానని అలా అంటున్నారు అంటే, నన్నేం అడగొద్దు..అది ఎండీగారి ఆర్డర్ అని జగతి అంటుంది. ఇంతలో మహేంద్ర స్టేజ్ పైన అంత ధైర్యంగా ఎండి గారి మెడలో దండ ఎలా వేయగలిగావు అని అడిగితే మళ్లీ రిషి సార్ వచ్చినా వస్తారు...ఇంకెప్పుడైనా చెబుతానని అంటుంది.

  రిషి సీరియస్

  రిషి సీరియస్

  ఇక మరోపక్క రిషి ఇంటికి వెళ్ళే సమయానికి మంచం మీద ఉన్న సాక్షిని డాక్టర్ చెకప్ చేస్తుంది. పొట్ట వాష్ చేశాం...కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్పడంతో సాక్షికి ఏమైంది పెద్దమ్మా అని రిషి అడుగుతాడు. దానికి ఆమె సాక్షి సూసైడ్ చేసుకోవాలనుకున్నదని, నేనే కాపదానని చెబుతుంది. అంతేకాక దానికి నువ్వంటే ప్రేమ రిషి, నువ్వంటే తనకి ప్రాణం, పిచ్చి, పాపం మొదట్లో నిన్ను కాదనుకొని వెళ్లిపోయి అది అర్ధం చేసుకుని వెనక్కు వచ్చిందని అంటుంది. ఓ ఆడపిల్ల నీ వెంట పడుతోందని చులకన చేసేవాడివి కాదునువ్వు, ఆమె నీ ఆస్తిపాస్తులపై ఆశతో రాలేదు కదా. నీ మీద ప్రేమతోనే నిన్ను కోరుకుందని అంటుంది. అంతేకాక తనకి ఇష్టం లేకపోయినా లైబ్రరీలో బ్లాక్ మెయిల్ కూడా చేసింది, ఇంక నువ్వు తనకు దక్కవని తెలిసిపోయింది, అందుకే వేరే దారి లేక ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అంటూనే రిషి నా మాట విను....మనం కోరుకున్న వారికన్నా మనల్ని కోరుకున్నవారితోనే జీవితం ఆనందంగా సాగిపోతుంది... నా మాట విని సాక్షిని అనబోతూ ఉండగానే రిషి సీరియస్ అవుతాడు.

  చెప్పడానికే కాల్ చేశా

  చెప్పడానికే కాల్ చేశా

  దీంతో దేవయాని నీ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పను, అలాగే తనను ప్రేమించకు, పెళ్లిచేసుకోకు...ఓ స్నేహితురాలిగా భావించమని, సమయం-సందర్భం చూసి నేనే తనకు సర్దిచెప్పి లండన్ పంపించేస్తానని అంటుంది. అలా రిషి వెళ్ళగానే సరే లే సాక్షి అంటుంది దేవయాని. ఇక బయటకు వచ్చాక మహేంద్ర, ఏంటి వదినా సాక్షి అంత పని చేసిందా అంటే ఆమె చాలా సున్నిత మనస్కురాలు అని అంటుంది. మహేంద్ర ఇంకేదో అనబోతే ఈ విషయం మీద విశ్లేషనలు మనకు అనవసరం...ఇదో సున్నితమైన అంశం...పెద్దమ్మా ఆ సాక్షికి గట్టిగా చెప్పండి..ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అని అంటాడు. ఇక తర్వాత వసు రిషికి కాల్ చేసి ఈ రోజంతా నేను రెస్టారెంట్ డ్యూటీలోనే ఉంటాను సార్..ఈ విషయం మీకు చెప్పడానికే కాల్ చేశానని అంటుంది.

  అదే తాగుతా

  అదే తాగుతా

  అంటే కలుద్దాం అని ఇన్ డైరెక్ట్ గా రెస్టారెంట్ కి రమ్మంటోందా... రమ్మనగానే నేను వెళతానా అనుకుంటాడు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావ్...నీకు చాలా క్లారిటీ ఇస్తాను చూడు అనుకుంటూ సాక్షికి కాల్ చేసి బయటకు వెళదామని చెప్పి అదే రెస్టారెంట్ కు బయలుదేరతాడు. ఇంతలో వసుధార రెస్టారెంట్లో డ్యూటీ చేస్తూ రిషి ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. చేతిలో గులాబీ పట్టుకుని తనకు తెలియకుండానే లవ్ సింబల్ గీస్తుంది. ఇక రిషి ఎంట్రీ ఇచ్చి నువ్వు ఇన్ డైరెక్ట్ గా రమ్మంటే వచ్చాను అనుకున్నావా...నేను కాఫీ తాగేందుకు వచ్చానని అంటే ఎందుకు వచ్చారో నాకు తెలుసులే అనుకుంటుంది. తదుపరి ఎపిసోడ్ లో సాక్షి కాఫీ కావాలా జ్యూస్ కావాలా అని రిషి అడిగితే... నువ్వు ఏది తాగితే నేను అదే తాగుతానని అంటుంది సాక్షి. దీంతో షాక్ అవడం వసుధార వంతు అవుతుంది.

  English summary
  Guppedantha Manasu Episode 495: Devayani and Sakshi mislead Rishi with a cunning plan. Later, Rishi lands in a fix with Vasudhara's message.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X