twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: సాక్షితో కలిసి రెస్టారెంట్ల చుట్టూ రిషి.. వసుధార ప్లాన్ తో రిషి సేఫ్.. కానీ?

    |

    గత కొంతకాలంగా గుప్పెడంత మనసు సీరియల్లో తన ప్రేమను ఎలా అయినా రిషి వరకు చేరవేసేలా ప్రయత్నాలు చేయడానికి వసుధార పడుతున్న తిప్పలు చూపిస్తున్నారు. గత ఎపిసోడ్లో తాను ఈరోజు అంతా డ్యూటీలో ఉంటాను అంటూ వసుధార రిషికి హింట్ ఇవ్వడంతో ఎలా అయినా అతను వస్తాడని ఆశలు పెట్టుకుంటుంది. అనుకున్న విధంగానే రిషి రావడంతో గత ఎపిసోడ్ ముగించారు. మరి తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    హార్ట్ ముక్కలు చేసి

    హార్ట్ ముక్కలు చేసి

    రెస్టారెంట్ కి రాగానే తనను తేడాగా చూస్తున్న వసుధార వంక చూసిన రిషి నువ్వు పిలిచావు కాబట్టి వచ్చాను అనుకుంటున్నావా నాకు కాఫీ తాగాలనిపించి వచ్చానని అంటాడు. దానికి ఆమె పొద్దున్నే ఇంట్లో కాఫీ తాగకుండా వచ్చారంటే అర్థమవుతుందని మనసులో అనుకుంటే పొద్దున్నే ఇంట్లో కాఫీ తాగొచ్చు కదా అనుకుంటున్నావా నాకు ఇక్కడ తాగాలనిపించే వచ్చాను అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు.

    మరోపక్క గులాబీ రేకులతో హార్ట్ సింబల్ గీసిన నేపథ్యంలో ఆ టేబుల్ మీద కూర్చోబెట్టకుండా వేరే టేబుల్ మీద కూర్చోబెట్టడానికి వసుధార ప్రయత్నిస్తుంది. కానీ రిషి మాత్రం తాను అక్కడే కూర్చుంటానని పట్టుబడతాడు. దీంతో ఆయనని మాటల్లో పెట్టి గులాబీ రేకులన్నీ చెదరగొడుతుంది. తర్వాత రిషి అక్కడ కూర్చుని ఉంటే చూడటానికి ఇది బాగుంది నేను ఫోటో తీసుకోవచ్చా అంటే నా హార్ట్ ముక్కలు చేసి గులాబీ రెక్కల హార్ట్ ని మాత్రం ఫోటో తీసుకోవాలనుకుంటున్నావా అంటూ వాటిని చెరిపేస్తాడు.

    ఒక్కసారిగా షాక్

    ఒక్కసారిగా షాక్

    కాఫీ తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళిన వసుధార బయటికి వచ్చేటప్పటికి రిషి పక్కన సాక్షి దర్శనం ఇవ్వడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేమిటి సాక్షి ఇక్కడికి వచ్చింది? రిషి సార్ రమ్మన్నారా? లేక సాక్షి అంతట సాక్షి వచ్చి కూర్చుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. కాఫీ తీసుకురావడంతో సాక్షి వసుధారను పలకరిస్తే హాలో మేడం అంటుంది.

    అదేంటి కొత్తగా మేడమ్ అంటున్నావ్ అంటే మీరు ఇక్కడ మా కస్టమర్ కదా అలాగే పలకరిస్తాను అని అంటుంది. ఇంతలో రిషి ఇంకో కాఫీ తీసుకురమ్మని అంటే వసుధార వెళ్ళబోతూ ఉండగా సాక్షి మనం సినిమాకి వెళ్దామా రిషి అని అడుగుతుంది. అవునా గౌతమ్ వస్తానన్నాడు వాడు ఇంకా ఏదో ప్లాన్ చేసినట్టు ఉన్నాడు అంటాడు రిషి. ఇంతలో నా మనసేం బాలేదు సినిమాకి వెళ్దాం ప్లీజ్ అంటే వాళ్ళిద్దరూ కలిసి సినిమాకి వెళుతున్నట్టు తాను కూర్చునే సీట్లో సాక్షి కూర్చున్నట్టు ఊహించుకున్న వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది.

    బయటకు రానివ్వకుండా

    బయటకు రానివ్వకుండా

    ఇంతలో రిషి ఏమో గౌతం వస్తానన్నాడు ఇంకా రాలేదేమిటా అని ఆలోచిస్తూ ఉండగా గౌతంకు ఏదో ఒక పని చెప్పి బయటకు రానివ్వకుండా చేయమని సాక్షి దేవయానికి మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ చూసిన తర్వాత దేవయాని కూడా గౌతమ్ ని మాటల్లో పెట్టి నువ్వు బయటకు వెళితే నా మాట మీద విలువ లేదని అన్నట్టే అంటూ అతనిని అక్కడ లాక్ చేస్తుంది.

    అంతేకాక గౌతమ్ ని చిన్న పని కోసం ఆపాను ఏమీ అనుకోవద్దు అంటూ రిషికి మెసేజ్ కూడా పెడుతుంది. అయితే వీళ్ళు కలిసి వెళ్లడం ఇష్టం లేని వసుధార ముందు జాగ్రత్తతో రిషి కారు గాలి తీసేస్తుంది. రిషి, సాక్షి బయటకు వెళ్లిన తర్వాత వాళ్లకు బాయ్ చెప్పడానికి వచ్చినట్టు వచ్చి మీ కారు టైరు పంచర్ అయింది అని చెబుతుంది.

    హమ్మయ్య సాక్షి బారి నుంచి ఎలా తప్పించుకోవాలని బాధపడుతుంటే ఇదొకటి సాకుగా దొరికింది అనుకుని రిషి ఆనందిస్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో మహేంద్ర, జగతి కూడా రెస్టారెంట్ కి వస్తారు.

    నవ్వుతూ తుళ్ళుతూ

    నవ్వుతూ తుళ్ళుతూ

    రిషి వెంటనే సాక్షిని వాళ్ళ ఇంట్లో దింపి రమ్మని మహేంద్రకి చెబుతాడు. మహేంద్ర సాక్షిని తీసుకు వెళితే జగతి రిషిని లోపలికి రమ్మంటుంది. మీరు వెళ్ళండి అని చెప్పి రిషి లోపలికి పంపిస్తే లోపలికి వచ్చిన తర్వాత అసలు మీ అబ్బాయి ఏంటి సాక్షితో కలిసి సినిమాకి వెళ్లడానికి రెడీ అయ్యాడు? ఇదేమీ కరెక్ట్ కాదు కదా అంటూ వసుధార జగతితో అంటుంది.

    వాళ్ళిద్దరూ కలిసి సినిమాకి వెళ్తున్నారు అంటే నీకేంటి ఇబ్బంది అంటే దానికి నేరుగా సమాధానం చెప్పకుండా ఆ ఇంట్లోకి వెళ్లాక మీరు మారిపోయారు మేడం. రిషి సార్ తో నేనే ఇంకా సినిమాకి వెళ్లలేదు అసలు ఆమె ఎలా వెళుతుంది? ఆమె సార్ పక్కన కూర్చుంటేనే నాకు కడుపు మండిపోయింది, అలాంటిది రెండు మూడు గంటల పాటు రిషి సార్ తో నవ్వుతూ తుళ్ళుతూ ఉందంటే నేను తట్టుకోలేను అంటుంది.

    క్లారిటీ ఉంది కాబట్టే

    క్లారిటీ ఉంది కాబట్టే

    అసలు నీకేంటి సమస్య రిషిమీద నీకు క్లారిటీ ఉంటే ఇలాంటి కడుపు మంటలు రావు కదా అంటే ఆ క్లారిటీ ఉంది కాబట్టే కడుపు మంట వచ్చిందని అంటూనే అసలు రిషి సార్ సినిమాకి ఎలా వెళ్తారు చెప్పండి అని జగతితో అంటూ ఉండగానే రిషి వచ్చి పక్కన నిలుచుంటాడు. అక్కడితో తాజా ఎపిసోడ్ ముగిసింది.

    కమింగ్ అప్ ఎపిసోడ్ లో చూపిస్తున్న దాని ప్రకారం క్లాసులు మానేసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని రిషి వసును లోపలికి పంపిస్తాడు. క్లాసులో కూర్చుని జగతి చెబుతున్న లెసన్ వినకుండా కళ్ళు మూసుకుని రిషి సర్ వస్తాడా రాడా వస్తాడా రాడా అంటూ జపం చేస్తున్న సమయంలో జగతి వచ్చి ఆవేశంగా గెటవుట్ ఫ్రం మై క్లాస్ అంటూ వసుధారను బయటకు పంపిస్తుంది. వసుధార అలా బయటకు వస్తున్న విషయాన్ని కూడా రిషి గమనిస్తాడు. రాబోతున్న ఎపిసోడ్లో ఇంకా ఎలా ప్లాన్ చేశారో చూడాల్సి ఉంది.

    English summary
    Guppedantha Manasu Episode 496: Vasudhara is shocked to see Sakshi with Rishi at the restaurant. Later, Jagathi teases Vasudhara as she feels jealous.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X