For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: వసుధారకు అస్వస్థత.. తల్లడిల్లిన రిషి..ఏమైందంటే?

  |

  గుప్పెడంత మనసు సీరియల్ లో సాక్షిని సినిమాకి తీసుకువెళ్లేందుకు రిషి సిద్ధం అవగా వసు తన ప్లాన్ తో దాన్ని విఫలం చేస్తుంది. తరువాత ఈ విషయం మీద జగతితో చర్చకు తెర లేపుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాక్షితో కలసి రిషి సార్ సినిమాకు ఎలా వెళతారంటూ జగతి మేడంతో వసు వాదనకు దిగిన సమయంలోనే అక్కడికి రిషి వస్తాడు. ముందు చూసుకోకుండా ఏదేదో మాట్లాడిన వసుధార తరువాత రిషిని చూసి షాకయి మీరెప్పుడు వచ్చారనీ అడుగుతుంది. రిషి మాత్రం జగటితో మేడం డాడ్ తో మాట్లాడాను, మీకు క్యాబ్ బుక్ చేశాను..అందులో మీరు ఇంటికి వెళ్లండి అని చెప్పేసి వెళ్లిపోతాడు. ఇంకా షాక్ లోనే ఉన్న వసు జగతితో మేడం మీ అబ్బాయి అనగానే, మా అబ్బాయే..మా అబ్బాయే అంటూ జ్ఞాన బోధ చేసే ప్రయత్నం చేస్తుంది. నీకు నువ్వే ప్రాబ్లెమ్ వసు, ప్రేమ ఎప్పుడూ బయటపడాలి, మబ్బుల చాటున దోబూచులాడకూడదు తెలుసా అంటూ క్లాస్ పీకుతోంది.

  రిషికి దొరికేసి

  రిషికి దొరికేసి


  మా అబ్బాయి క్యాబ్ బుక్ చేశాడు వెళతా, బయట మా అబ్బాయి వెయిట్ చేస్తుంటాడు, ఈ కాఫీ బిల్లు కూడా ఈసారి మా అబ్బాయి వచ్చినప్పుడు తీసుకో అంటూ ఆటపట్టిస్తూ వెళ్తుంది..దీంతో వసు ఆలోచనలో పడుతుంది. నాకు క్లారిటీ లేదా? ఫుల్ క్లారిటీ ఉంది కదా. అసలు రిషి సార్ సాక్షితో సినిమాకు ఎలా వెళతారు? అనుకుంటుంది. మరోపక్క రిషి కార్లో ఇంటికి వెళుతూ వసుగురించి ఆలోచిస్తుంటే వసు ఆటోలో ఇంటికి వెళుతూ రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క దేవయానికి కాల్ చేసి సాక్షి..నేనెంత కష్టపడినా నన్ను రిషి అస్సలు పట్టించుకోవడం లేదని అంటే, :వచ్చీ రాగానే విజయం ఎదురుకావాలని కోరుకోవడం అత్యాశ అవుతుందని దేవయాని బ్రెయిన్ వాష్ చేస్తుంది. రిషిలో మార్పు వచ్చింది, గౌతమ్ రాకపోతే సినిమా ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకుంటే..చివరి నిముషంలో రిషి మనసు మార్చుకున్నాడని అంటుంది.

  దేవయాని అభయం

  దేవయాని అభయం

  దానికి ఆమె మనసు తెగిన గాలిపటంలాంటిది. ఎవరు దక్కించుకుంటే వారిదే. ఒక్కో అడుగు రిషికి దగ్గరవుతున్నావూ దానికి సంతోషించమని అంటుంది. రాత్రికి రాత్రే రిషి మనసు గెలవాలని కోరుకోకు..అది అత్యాశ అవుతుందని అంటుంది. మరోపక్క రూమ్ లో మహేంద్ర, జగతి...సాక్షి, రిషి, వసుధార గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సాక్షిని తప్పించుకుంటున్న రిషి వసుధారకి ఎందుకు దగ్గరవడం లేదనీ మహేంద్ర అడిగితే
  జగతి ఏమో ప్రేమగా పెంచుకున్న మొక్క గాలివానకు విరిగిపోతే అది చిగురించి పూలు పోయడానికి టైం పడుతుంది కదా అని అంటుంది. ఇది రిషి-వసుల మనసుకి వాళ్ల జీవితానికి సంబంధించిన విషయం. మన ప్రమేయం ఎంతుంటుందో అంతే చేయగలం..కానీ పరిధి దాటి వెళ్లలేం కదా అంటుంది. కాలేజీలో అటెండర్ రెండు కప్పుల కాఫీ తీసుకుని వెళుతుండగా ఆపి రిషి ఎవరికి అని అడిగితే పైన వసుధార-గౌతమ్ సార్ ఉన్నాడని చెప్పడంతో వాళ్లు పైన ఉండడం ఏమిటా అని అనుకుంటూ పైకి వెళతాడు.

  ఎండలో

  ఎండలో


  ఏం చేస్తున్నారిక్కడ అని వసుని అడిగితే కొలుస్తున్నాం సార్ అంటుంది. క్లాసులు ఎగ్గొట్టి ఈ పనేంటి..అసలు నేను నిన్ను ఏమడుగుతున్నానో నీకు అర్థం కావడం లేదనీ కిందకు వెళ్తాడు. ఆ సమయంలో రిషికి మహేంద్ర ఎదురుపడతాడు. పైన ఏం జరుగుతోంది అని అడిగితే మహేంద్ర మినిస్టర్ గారు వాలంటరీ క్లాసులు స్టార్ట్ చేయమన్నారు...మన క్లాసులు డిస్టబ్ అవకుండా పైన షెడ్ వేద్దాం అని అంటాడు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదన్న రిషి..వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారని అడుగుతాడు. బయటవాళ్లకి చెప్పడం ఎందుకని చేస్తున్నామని జగతి అంటే ఎవరి పని వాళ్లు చేస్తే బావుంటుంది..మీ స్టూడెంట్ ని కిందకు దిగమని చెప్పండి అంటూనే మనసులో అంత ఎండలో వసుతో ఈ పని చేయించడం అవసరమా అనుకుంటాడు.

   గేటవుట్ అంటూ

  గేటవుట్ అంటూ


  అలా అక్కడి నుంచి వెళ్ళాక క్లాస్ చెబుతుంటే మాట్లాడుతున్నావ్ అంటూ ఓ స్టూడెంట్ ని నిల్చోబెట్టిన జగతి..ఇంకోసారి మాట్లాడితే బయటకు పంపిస్తాననీ అంటుంది. అదే సమయంలొ రిషి సార్ ఏం చేస్తున్నారో అని వసుధార అనుకోగానే క్లాస్ బయట రిషి నిల్చుని ఉంటాడు. నిజంగా రిషి సార్ వచ్చారా లేక కల కంటున్నానా అని కళ్లుమూసుకుని నంబర్లు లెక్కపెడుతుంది. అప్పుడే చూసిన జగతి..వసుధారను తిట్టి బయటకు వెళ్లిపోమని అంటుంది. ఆ విషయంలో బాధ పడుతూ రిషి తన క్యాబిన్ కి వచ్చేసరికి సాక్షి అక్కడ కూర్చుని గతంలో వసుధార ఇచ్చిన పూవుని చూస్తుంటుంది.

  Recommended Video

  హ్యాపీ బర్త్ డే చెప్పి మత్తు వదిలించావ్ గా *Reviews | Telugu OneIndia
  ఎందుకు వచ్చావ్..

  ఎందుకు వచ్చావ్..


  సాక్షి ఇక్కడకు ఎందుకు వచ్చావ్..నిన్నెవరు రమ్మన్నారని సీరియస్ అయ్యి, తన పర్సనల్ వస్తువులు తీయడానికి నీకేం హక్కుందని అడిగితే సాక్షి తనదే పొరపాటు
  అని అంటుంది. దీంతో రిషి దేవయాని అన్నమాటలు గుర్తు వచ్చి సారీ చెప్పడంతో సాక్షి నాతో ఓ రెండునిముషాల మనస్ఫూర్తిగా మాట్లాడమని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగియగానే రాబోతున్న ఎపిసోడ్లో
  వసుధార కళ్లు తిరిగి పడిపోయిందంటూ కంగారుగా వచ్చిన గౌతమ్..రిషి కార్ తాళాలు అడుగుతాడు. కార్లో కూర్చున్న వసుధార రిషి సార్ కారు తెస్తే ఆయనకు ఇబ్బందికదా నేను ఆటోలో వెళతాను అంటూ డ్రైవింగ్ సీట్ వైపు చూస్తే రిషి కారు డ్రైవింగ్ సీటులో కనిపిస్తాడు.

  English summary
  Guppedantha Manasu Episode 497: Jagathi scolds Vasudhara as she gets distracted in class. Elsewhere, Rishi apologises to Sakshi for his rude behaviour.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X