Guppedantha Manasu: కళ్ళు తిరిగి పడిన వసు.. గౌతమ్ ప్లాన్ సక్సెస్.. రిషి కారులోనే రూమ్ కి?

గుప్పెడంత మనసు సీరియల్ లో గత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. వసుధార గౌతమ్ తో కలిసి కాలేజీ పని కాకుండా వేరే ఏదో పని చేస్తుంటే రిషి నొచ్చుకుని ఆమెను కిందకు వెళ్ళిపోమని చెబుతాడు. ఆ తరువాత తన గదిలో ఉన్న సాక్షి వసుధార ఇచ్చిన హార్ట్ సింబల్ తో ఆడుకుంటుంటే ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తర్వాత ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయాన్ని గుర్తుతెచ్చుకొని ఇకమీదట జాగ్రత్తగా ఉండమని నెమ్మదిగా చెబుతాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్లో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకున్న రిషి టీ కావాలా కాఫీ కావాలా ఏమైనా తెప్పించాలా అని అడిగితే అవేమీ వద్దు నీ టైం కావాలి అని అంటుంది.

హార్ట్ సింబల్ తో

హార్ట్ సింబల్ తో


ఆ తర్వాత ఆమె ఆలోచిస్తూ ఆత్మహత్య చేసుకున్నట్లు నటిస్తే కానీ నువ్వు నా దారికి రాలేదు రిషి, ఇకముందు చూడు ఒక్కో అడుగు నీకు దగ్గరయ్యే విధంగా వేస్తూ దగ్గరవుతాను అనుకుంటుంది.. అయితే రిషి నీ మనసులో నువ్వు క్లియర్ గా ఉన్నట్టే నా మనసులో నేను క్లియర్ గా ఉన్నాను నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని అంటూనే ఉండగా సాక్షి నువ్వు నాకు సినిమా బాకీ ఉన్నావు కదా ఎప్పుడు తీరుస్తావని అంటే ఇప్పుడే కదా అడిగావు, తీరుస్తాలే అంటాడు రిషి. నువ్వేదో పనిలో ఉన్నావు కదా నేను వెళతా, ఇంకెప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టను అంటే అలా అని కాదు నీకు రావాలి అనిపించినప్పుడు నాకు ఫోన్ చేసి నేను ఫ్రీ గా ఉన్నాను అని చెబితే రమ్మని అంటాడు. ఆమె అటు వెళ్లిన తర్వాత వసూ ఆలోచనలో పడి హార్ట్ సింబల్ తో కూర్చుని ఆడుకుంటూ ఉంటాడు.

నడవలేకపోతున్నానని

నడవలేకపోతున్నానని


మరోపక్క గౌతమ్ మహేంద్రతో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో ఎదురు వస్తున్న వసుధార కళ్ళు తిరిగి కింద పడిపోతున్న సమయంలో మహేంద్ర గౌతమ్ ఆమెను పట్టుకుని తీసుకొచ్చి నీడలో కూర్చోబెడతారు హాస్పిటల్ కి వెళ్దాం అంటే వద్దని తాను రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని అంటుంది. వెంటనే గౌతమ్ రిషి దగ్గరికి వెళ్లి కారు తాళాలు ఇవ్వమని అడుగుతాడు. ఎందుకు ఏమైంది అని అడిగితే ఇలా జరిగిందనే విషయం చెబుతాడు. అయితే జాగ్రత్తగా ఇంట్లో దింపి రమ్మని రిషి చెప్పడంతో గౌతమ్ వారిద్దరిని ఎలాగైనా కలపాలి అనే ఉద్దేశంతో ఒక నాటకం ఆడతాడు. తన కాలు మెలిక పడిందని తాను నడవలేకపోతున్నానని నాటకం ఆడడంతో రిషి నడుచుకుంటూ వసుధార దగ్గరకు వెళతాడు.

 అనవసరంగా

అనవసరంగా


అప్పటికే వసుధారను కారులో కూర్చోబెట్టిన మహేంద్ర రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడ వరకు వెళ్లిన తర్వాత ముందు తన తండ్రిని దింపి రమ్మంటే బాగుంటుంది అని ఆయనను దింపమని అడుగుతాడు. రిషి ఆయన కూడా తటపాటాయిస్తూ వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో మీరు ఉండండి నేను వెళ్లి వస్తానని ఆయన దగ్గర తాళాలు తీసుకుంటాడు. అలా తాళాలు తీసుకుని రిషి కార్ డ్రైవ్ చేస్తూ వెళుతున్న సమయంలో వసుధార స్పృహలో లేకపోయినా కారు డ్రైవ్ చేసేది గౌతమ్ అనుకుని మీరు అనవసరంగా రిషి గారి కారు తీసుకొచ్చారు నేను ఆటోలో వెళ్ళేదాన్ని కదా అంటూ రిషి గురించి మాట్లాడుతూ ఉంటుంది..

పలకరించుకోవడానికి

పలకరించుకోవడానికి


అది విన్న రిషి ఈమె నా గురించి ఇంత ఆలోచిస్తుందే, మరి ఎందుకు నేను ప్రేమిస్తున్నాను అంటే కాదన్నది ఇంతలా నా గురించి ఆలోచించే మనిషి ఇలా నన్ను రిజెక్ట్ చేయకూడదు కదా అని అనుకుంటూ ఉన్న సమయంలోనే ఆమెకు మెలుకువ రావడంతో మీరేంటి ఇక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. ఏ నేను ఉంటే తప్పు ఏమైనా ఉందా అని రిషి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇలా వీరిద్దరి మధ్య సరదా సంభాషణలు సాగుతూ ఉంటాయి. అయితే వెంటనే వారిద్దరి మధ్య మాటలు కట్ అవుతాయి. రిషి, వసుధార ఏమీ మాట్లాడదేంటి ఏదో ఒకటి మాట్లాడవచ్చు కదా అని అనుకుంటే వసుధార మాత్రం ఈయనేంటి ఏమీ మాట్లాడటం లేదు నేను మాట్లాడితే మాట్లాడాలి అనుకుంటున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది. రిషి కూడా ముందు నేనే మాట్లాడాలని ఆమె ఆలోచిస్తుందా అని కూడా అనుకుంటాడు. అయితే ఇలా ఆలోచనలో ఉన్న వీరిద్దరూ ఒకేసారి పలకరించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు.

ఇదంతా అవసరమా అని

ఇదంతా అవసరమా అని


ఆమెకు నీరసం ఎందుకు వచ్చిందా అని ఆలోచించిన రిషి అనవసరమైన పనులన్నీ తల మీదకు తెచ్చుకుంటే ఇలాగే ఉంటుంది ఇదంతా అవసరమా అని అడిగితే ఆమె కూడా ఆలోచిస్తూ అలా జరిగిపోయింది సార్ అంతే అని అంటుంది. అయితే రిషి మళ్ళీ ఆలోచనలో పడతాడు. ఈ అమ్మాయి ఎప్పుడు గలగలా మాట్లాడుతూనే ఉంటుంది కానీ ఈ రోజు ఎందుకు ఇలా సీరియస్ గా ఉంది. అయినా పాపం ఆరోగ్యం బాగోలేదు కదా అనుకుంటాడు. నేనంటే ప్రేమ లేదు అంటూనే నన్ను రక్షించినప్పుడు నేను లేకపోతే బతకలేను అంటుంది అసలు ఈవిడని ఎలా అర్థం చేసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడితో తాజా ఎపిసోడ్ ముగించారు చూడాలి రాబోతున్న ఎపిసోడ్లో ఎలాంటి ఆసక్తికర విషయాలు చూపిస్తారు అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X