Guppedantha Manasu : పారని వసు పధకం.. లాంచ్ బాక్స్ స్కెచ్ కూడా విఫలం!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వసుధారతో ఒక స్కాలర్షిప్ టెస్ట్ రాయించడం కోసం వేరే ఊరికి తీసుకెళ్లి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందనుకుంటే అలా చేయకుండా షాక్ ఇవ్వడంతో రిషి దేవదాసులా మారిపోతాడు. తరువాత కొంచెం తెరుకున్నా ఆమెను చూసి దూరం జరిగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అలా అందరినీ టెన్షన్ పెడుతూ ఉంటాడు. అయితే రిషి సాక్షితో కలిసి ఆమె కార్లో ఇంటికి బయలుదేరి యాక్సిడెంట్ కు గురవుతాడు. అయితే వసుధార రిషిని కాపాడి ఇంటికి తీసుకువస్తే ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది దేవయాని. చివరికి గౌతమ్ తో అమ్మవారి కుంకుమ రిషికి చేరేలా చేస్తుంది వసుధార. అలా గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 క్షేమాన్ని కోరేదే ప్రేమంటే..

క్షేమాన్ని కోరేదే ప్రేమంటే..


గౌతం తాను రిషి చేత తినిపిస్తా అని చెప్పి అతని రూం కి ఫుడ్ తీసుకువెళ్లి తినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంతలో ఇంతలో నుదుటిన కుంకుమ బొట్టు పెట్టడం తో
బొట్టు ఎక్కడిదిరా? అమ్మవారిదా? పెద్దమ్మ వెళ్లిందా? తనే పంపించి ఉంటుంది. తనకి నేనంటే చాలా ప్రేమ కదా అని అంటాడు రిషి. అయితే గౌతమ్ అది నిజం కాక పోవడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. అదే సమయంలో భోజనం తినిపిస్తూ ఉండగా.. రేయ్ గౌతమ్ నిన్ను చాలా సార్లు తిట్టాను కద.. నీకు కోపం లేదా? అని అడుగుతాడు రిషి. 'లేదంటే అబద్దం అవుతుందిరా.. కోపం వస్తుంది. కానీ ఏది ఏమైనా అది క్షణాల్లో పోయి తిరిగి ఇష్టంగా క్షేమాన్ని కోరేదే ప్రేమంటే.. భిన్న అభిప్రాయాలు ఉన్నా ఒక్కటిగా కలిసి ఉండటమే ప్రేమంటే అంటూ చెబుతాడు గౌతమ్.

పెద్దమ్మ పంపిందా?

పెద్దమ్మ పంపిందా?


గౌతమ్ కావాలనే అలా చెప్పడంతో ఆ మాటలకు రిషికి వసు గుర్తొస్తుంది. అది అర్ధం కావడంతో భోజనం తినిపించడం అవ్వగానే రిషి ఫోన్ అందుకుని వసు నెంబర్ అందులో డయల్ చేయడంతో వీడియో కాల్ వెళుతుంది. రిషి బొట్టు పెట్టుకున్నట్లు చూపించాలని చేయడంతో ఆ నంబర్ కొట్టేసరికి పొగరు అని వస్తుంది. 'రేయ్ పొగురు అంటే వసుధారా' అని గౌతమ్ ఆశ్చర్యంగా అడుగుతాడు. దీంతో రిషి కూడా కోపంగా నా ఫోన్ ఎందుకు తీశావ్‌ అని లాక్కునే లోపు.. వసుకి వీడియో కాల్ వెళ్లిపోతుంది. ఒకరికొకరు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయంలోనే వసుధార ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అంత హడావుడి లో కూడా రిషి నుదుట కుంకుమ చూసి మురిసిపోతుంది వసు. చివరికి రిషి ఫోన్ కట్ చేస్తాడు. ఫైనల్ గా గౌతమ్ తినిపించి వెళ్తుంటే రేయ్.. నిజంగానే కుంకుమ పెద్దమ్మ పంపిందా? నిజంగానే పెద్దమ్మ గుడికి వెళ్తే తెచ్చి బొట్టుపెడుతుంది, జగతి మేడమ్ వెళ్తే డాడ్‌తో పంపిస్తారు. వీళ్ళు కాదు మరి ఇంకెవరు పంపించారు అంటాడు.
సైలెంట్ గా

 అప్పుడు భ్రమ

అప్పుడు భ్రమ


అప్పుడు భ్రమ అనుకుంటూ వసుధారను చూసిన సంగతి గుర్తు వచ్చి వెంటనే వసుధారా ఇచ్చింది కదూ.. నాకు అర్థమైంది. నువ్వు వెళ్లు అంటూ చున్నీని తీసుకుని చూసుకుంటూ ఆలోచనలో పడతాడు. వీడియో కాల్ చేసి డాడ్‌ని నేనెలా ఉన్నానని అడిగి తెలుసుకుంటుంది. కుంకుమ బొట్టు తెచ్చి గౌతమ్‌కి ఇచ్చి నాకు పెట్టిస్తుంది. అలాంటిది నన్ను చూడడానికి నా దగ్గరకు ఎందుకు రాదట? అంటూ అని ఆలోచిస్తాడు. నాకు ఫోన్ కూడా చేయలేదు అనుకుంటాడు అలా అనుకుంటున్న సమయంలోనే వసు మెసేజ్ చేస్తుంది. 'ఎలా ఉన్నారు సార్.. నొప్పి తిగ్గిందా? నా మీద కోపం తగ్గిందా?' అని మెసేజ్ చేస్తుంది. రిషి రిప్లై ఇవ్వకుండా చూసి సైలెంట్ గా ఉంటాడు.

 అందరి చేతుల్లో గులాబీలు

అందరి చేతుల్లో గులాబీలు


తరువాతి రోజు వసుని పుష్ప బలవంతంగా బయటికి తీసుకు వచ్చి రిషి సార్ వచ్చే టైమ్ అయ్యింది. నువ్వే గులాబీల ఐడియాస్ ఇచ్చి.. ఇప్పుడు దూరంగా ఉంటావేంటని అడుగుతుంది. అందరికీ ఎర్ర గులాబీలు ఇచ్చి నువ్వేంటి ఎల్లో గులాబీ తెచ్చావు అని అడిగితే అదేమీ లేదని అంటుంది. రిషి వచ్చాక అందరి చేతుల్లో గులాబీలు చూసి,'ఏంటి విషయం' అంటాడు. 'మీరు క్షేమంగా తిరిగి వచ్చారని ఇలా గులాబీలతో స్వాగతం పలుకుతున్నాం' అంటే ఇలా కంటే ఏవైనా మొక్కలు నాటితే హ్యాపీగా ఫీలవుతా అని అంటాడు. వసుధార ఆ ఐడియా కూడా ఇచ్చింది సార్.. తర్వాత అదే చేస్తాం.. మొక్కలు తెచ్చి పెట్టాం' అని అనడంతో సైలెంట్ గా క్యాబిన్ కు వెళ్తాడు.

 నేనెందుకు కాదంటా

నేనెందుకు కాదంటా


రిషి పువ్వులు వద్దు, థాంక్యూ అనేసి లోపలికి వెళ్తుంటే.. వసు చేతిలోని గులాబీ రిషి కోట్ జేబులో పెట్టేస్తుంది. మహేంద్ర కిందకు వచ్చి.. అంటెండర్‌తో పిల్లల పువ్వుల్నీ రిషి టేబుల్ మీద ఉండాలి అనడంతో అతను అలానే చేస్తాడు. అవన్నీ చూసిన వెంటనే వసు తనని రిజెక్ట్ చేసిన సీన్ గుర్తొచ్చి వాటినన్నింటినీ విసిరికొడుతాడు. అప్పుడే మహేంద్ర వచ్చి ఒక్కోసారి మనం వద్దు అన్నా మనదగ్గరకే వస్తుంటాయి కొన్ని.. అలా వచ్చిన ఈ ఒంటరి గులాబీని ఏం చేస్తావ్ అని అడుగుతాడు మహేంద్ర. రిషికి అది వసు చేతిలో చూసిన విషయం గుర్తు వస్తుంది. ఈలోపు నచ్చప్పుడు వద్దులే అని దాన్ని టేబుల్ మీద పెట్టేస్తాడు మహేంద్ర కావాలనే. రిషి దాన్ని తీసుకునీ అనుకోకుండా వచ్చి నన్ను చేరిన ఈ గులాబీని.. నేనెందుకు కాదంటాను డాడ్ అని ప్రశ్నిస్తాడు. అలా తాజా ఎపిసోడ్ ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X