Guppedantha Manasu : మరోసారి రిషిని కాపాడుకున్న వసు.. ప్రాణాపాయం నుంచి సేఫ్!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వసుధారతో ఒక స్కాలర్షిప్ టెస్ట్ రాయించడం కోసం వేరే ఊరికి తీసుకెళ్లి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందనుకుంటే అలా చేయకుండా షాక్ ఇవ్వడంతో రిషి దేవదాసులా మారిపోతాడు. తరువాత ఆమెను దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాక్షితో కలిసి ఆమె కార్లో ఇంటికి బయలుదేరిన రిషి యాక్సిడెంట్ కు గురవుతాడు.
అయితే వసుధార రిషిని కాపాడి ఇంటికి తీసుకువస్తే ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది దేవయాని. అయినా ఆమె రాలేదని రిషి బాధ పడితే రానివ్వలేదని వసుధార బాధ పడుతూ ఉంటుంది. ఇక కాలేజీకి సంబంధించిన పనిని జగతి రిషి సమ్మతితో వసుధారకు అప్పగించడంతో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వలలో వేసుకుంటున్నావు అంటూ
జగతి మేడం చెప్పిన పని పూర్తి చేసిన తర్వాత వసుధార నడుస్తూ తన ఇంటికి వెళుతుంది. అలా నడుస్తూ వెళుతుంటే ఆమె ఆలోచనల్లో పడుతుంది. రిషి సార్ ఎందుకో పొగిడే విషయంలో కూడా పొదుపు పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన చెప్పిన వెంటనే ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి పంపించాను కదా బాగా చేసావు అని మెసేజ్ చేయొచ్చు కదా అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది.
ఆమె అలా వెళుతూ ఉన్న సమయంలో సాక్షి అడ్డం పడి ఆమెను అటకాయిస్తుంది. ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అంటే సరుకులు తీసుకుని వస్తున్నాను అని అనడంతో ఇది నీ రేంజ్, సింగల్ రూమ్ లో ఉండే దానివి బంగ్లాలోకి వెళ్లిపోవడానికి ప్లాన్లు వేస్తున్నావా? డబ్బుకోసమే రిషిని వలలో వేసుకుంటున్నావు అంటూ సాక్షి దారుణంగా మాట్లాడుతుంది.
Recommended Video


కాబోయే ఎండిని
మొదట కాస్త ఓపిక పట్టిన వసుధార కాస్త మర్యాదగా మాట్లాడు సాక్షి అని హెచ్చరిస్తుంది. అయితే సాక్షి కూడా వెనక్కి తగ్గకుండా నేను చెప్పిన మాట చెప్పినట్టు వింటున్నావ్ నాకు నచ్చింది, రిషి ఐ లవ్ యు చెబితే నో అన్నావు అందుకే ఇప్పుడు రిషికి నాకు పెళ్లి అయ్యేవరకు ఎక్కడికైనా వెళ్ళు అని చెప్పి ఆమెకు బ్లాంక్ చెక్ ఇస్తుంది.
మన ఇద్దరికీ ఎలాంటి గొడవ లేదు మన ఇద్దరి మధ్య కేవలం రిషి మాత్రమే అడ్డంగా ఉన్నాడు నీకు రిషి అక్కర్లేదు నాకు కావాలి అంతే సమస్య అని అంటుంది. నువ్వు రిషి కి దూరంగా వెళితే మా వివాహం అయిపోతుంది అయిపోయిన తర్వాత రమ్మని అంటుంది. నువ్వు వెళ్ళిపోతే రిషి ఏమి అయిపోతాడు? మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఏమవుతుంది ఆయనకు అసిస్టెంట్ గా ఎవరు ఉంటారు అని భయపడవద్దు. ఎందుకంటే అవన్నీ నేను నడిపిస్తాను కాలేజీకి కాబోయే ఎండిని కూడా నేనే అని అంటుంది.

ఆటోగ్రాఫ్ ఉంటుంది కదా
దానికి వసుధార కూడా కాస్త గట్టిగానే సమాధానం చెబుతుంది. అందరి లాగా నేను డబ్బు వెనుక పరిగెత్తే మనిషిని కాదు అని అంటుంది. ఇంతలో రిషి పేరు తీసి సాక్షి ఏదో మాట్లాడుతూ ఉంటే అసలు రిషి సార్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఈ కాలేజీ ఎండి కావాలని మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రన్ చేయాలని కలలు నిజమయ్యే అవకాశమే లేదు.
ఒక మనిషిని ప్రేమతోనే గెలవాలి అనే విషయం కూడా నీకు తెలియదు అసలు నీకు ఏం అర్హత ఉందని రిషి గారి వెంట పడ్డారో నాకు తెలియటం లేదు. మనిషిని మనిషి ప్రేమని సాధించాలంటే డబ్బు ఉంటే సరిపోదు అని వసు అంటుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత నేను డబ్బు కోసం నీ చెక్ తీసుకోలేదు. నీ ఆటోగ్రాఫ్ ఉంటుంది కదా అని తీసుకున్నాను అని అంటుంది.

లోపలికి ఎందుకు పంపించారు?
అయితే ఈ విషయం జగతికి చెప్పాలా వద్దా అనే విషయం మీద వసుధార ఆలోచిస్తుంది. అనవసరంగా చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అని ఆగిపోతుంది. ఆమె కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే కాలేజీలో అందరూ పరుగులు పెడుతూ ఉంటార. ఏం జరిగింది అని ఒకరిని ఆపి అడిగితే కాలేజీ కెమికల్ ల్యాబ్ లో పొగలు వస్తున్నాయని పిల్లలు చిక్కుకుపోవడంతో వారిని కాపాడాలని రిషి సార్ లోపలి వెళ్లారని చెబుతారు. పిల్లల కోసం అసలు రిషి సార్ ను లోపలికి ఎందుకు పంపించారు? అంటూ ఆమె ఫైర్ అవుతుంది. అక్కడే జగతి, మహేంద్ర ఉన్నా సరే వాళ్ళు ఆపుతున్నా వినిపించుకోకుండా వసుధార లోపలికి వెళుతుంది.

మరోసారి కాపాడి
చున్నీ ముఖానికి అడ్డు పెట్టుకుని లోపలికి వెళితే రిషి కింద పడి బాధపడుతూ ఉంటాడు. అసలు నువ్వెందుకు లోపలికి వచ్చావు బయటికి వెళ్లి పో వసుధారా అంటే రిషి సార్ మీకు ఏమైనా అయితే నేను బ్రతుకుతానా సార్ అని అంటూ అతనిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. తన చున్నీ నీటితో తడిపి రిషి ముఖానికి కట్టి ఆయనని బయటకు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది.
అలా అనేక ప్రయత్నాల తర్వాత రిషిని ఎట్టకేలకు బయటకు తీసుకు వస్తుంది వసుధార. ఇక అక్కడితో తాజా ఎపిసోడ్ ముగించారు. రిషిని కొన్ని రోజుల వ్యవధిలోనే మరోసారి కాపాడటంతో ఆమె మీద మరింత ప్రేమ పెంచుకుంటాడు రిషి.


Click it and Unblock the Notifications











