For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu : నేను మిమ్మల్ని వదులుకోలేను.. రిషికి స్వీట్ షాక్ ఇచ్చిన వసు

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్లో వసుధార రిషిని రెండో ప్రమాదం నుంచి కాపాడుతుంది. కాలేజీలో జరిగిన ప్రమాదం తరువాత రిషిని క్షేమంగా కాపాడి ఆయన దగ్గరకు తీసుకు వెళ్లి కూర్చో బెట్టిన తర్వాత జగతి మహేంద్ర కలిసి బయటకు తీసుకు వస్తారు. అలా బయటకు తీసుకు వచ్చిన తర్వాత అసలు రిషి సార్ ని లోపలికి ఎలా పంపించారు అని అడుగుతుంది. దీంతో జగతి అసలు నువ్వు లోపలికి ఎందుకు వెళ్లావు చెప్పమని అంటుంది. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అసలు నువ్వు లోపలికి ఎందుకు వెళ్లావు అని వసుధారను అడుగుతుంది. వసుధార బిత్తరపోయి చూస్తూ ఉంటే నువ్వు సమాధానం చెప్పలేవు కానీ దాని సమాధానం ఏమిటో నీకు తెలుసు నాకు తెలుసు అని అంటుంది.

  బతకలేను అని

  బతకలేను అని


  మహేంద్ర మాట్లాడుతూ అవన్నీ ఇప్పుడు ఎందుకు జగతి అంటే ఒక మనిషి మనసు, ఆలోచన తత్వం ఇలాంటి విపత్కర సమయం లోనే బయటపడతాయి ఒకవేళ నాకు సమాధానం చెప్పక పోయినా రిషి ఇదే ప్రశ్న అడిగితే ఏమని సమాధానం చెబుతావు ఆలోచించుకో మరి అంటుంది. నీ ఆరాటం, ఉద్వేగం, భయం, ఇవన్నీ నువ్వేమిటో నీ మనసేమిటో తేటతెల్లం చేస్తున్నాయి. అయినా నిజం దాచి పెట్టి ఇంకేదో చెప్పడం నీకు ఈ మధ్య అలవాటు అయినట్టు ఉంది కదూ అంటుంది జగతి. వసుధార కూడా ఆలోచనలో పడటంతో వారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరోపక్క రిషి తన కాబిన్ లో కూర్చొని వసుధార తాను ప్రాణాపాయంలో ఉంటే పడిన ఆరాటాన్ని అంతా గుర్తు చేసుకుని అసలు ఈ వసుంధర ఎందుకిలా చేస్తోంది తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది ఎంతమంది ఉన్నా ఎవరూ లోపలికి వచ్చి ధైర్యం చేయలేదు కానీ తను అలా లోపలికి రావడమే కాక మీరు లేకపోతే నేను బతకలేను అని మాట్లాడటం ఏమిటి? అనుకుంటాడు.

  సాక్షి నోట్లో కుక్కి

  సాక్షి నోట్లో కుక్కి


  వసుధారలో మార్పు వచ్చిందా లేదా అన్న ఆలోచనలో మార్పు వచ్చిందా ఒకవేళ తొందరపాటు వల్ల నేనే ముందు ఆమెకు నా ఇష్టాన్ని చెప్పానా అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మాత్రం వసుధార నాకు నా ఆలోచనలలో క్లారిటీ లేదని అన్నది కానీ నిజానికి ఆమెకు క్లారిటీ లేదని అనుకుంటాడు. ఒకసారి వసుధారను కలిసి అడిగితే బాగుంటుందా అని ఆలోచించి మళ్ళీ వద్దులే నన్ను కన్ఫ్యూజ్ చేసి నాకే క్లారిటీ లేదని అంటుంది అనుకుంటాడు. ఇక మరోపక్క వసుధార కాలేజీలో ఒక చోట కూర్చుని జరిగిన విషయం అంత గుర్తు చేసుకుంటూ ఉన్న సమయంలో సాక్షి అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నారా మీకోసం కాలేజ్ అంతా వెతికాను రిషి విషయంలో సాహసం చేశావంట కదా అందుకే స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చాను అని స్వీట్ తీసుకోమని అంటుంది. రిషికి సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెబుదామని వచ్చాను ఇలాంటి సమయంలో అభినందన సభ పెడితే బాగోదు స్వీట్ తీసుకో అని అంటే నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా సాక్షి తప్పకుండా స్వీట్ తింటా అని తాను ఒక ముక్క తిని మరో స్వీట్ ముక్క సాక్షి నోట్లో కుక్కింది.

   సార్ కూడా అనుకోవాలి కదా

  సార్ కూడా అనుకోవాలి కదా


  ఇదేంట్రా ఇలా మాట్లాడుతుంది అనే సాక్షి ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్న సమయంలో నాకు ఉన్న కన్ఫ్యూజన్ క్లియర్ అయింది. గుర్తుపెట్టుకో సాక్షి ఇప్పుడు నేను చాలా క్లారిటీతో ఉన్నాను. గతంలో లేని క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది అంటే అసలు ఏ విషయంలో నీకు క్లారిటీ వచ్చింది అని అడుగుతుంది సాక్షి. అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చేసింది అంటే కొంపతీసి అని సాక్షి అనడంతో కొంప తీయకుండానే క్లారిటీగా ఉన్నాను అంటుంది. అయితే నువ్వు నేను ఊహించిన దాని కంటే చాలా స్పీడ్ గా ఉన్నావు అని అంటే, అవును నీకు కాలేజీలో గూఢచారులు ఉండవచ్చు కానీ నా మనసులో ఏం జరుగుతుందో చెప్పే గూఢచారులు లేరు కదా అంటుంది. నా మనసు కూడా ఇక్కడే ఉంది రిషి ఎక్కడ ఉంటే అక్కడే నా మనసు ఉందని సాక్షి చెప్పబోతుంటే అది నువ్వు అనుకుంటే సరిపోదు సార్ కూడా అనుకోవాలి కదా అంది.

   తలుచుకుంటే భయం వేస్తోంది

  తలుచుకుంటే భయం వేస్తోంది


  నువ్వు రిషిని ఎప్పటికీ చేరుకోలేవు నేను సార్ నేను ఎప్పటికీ వదులుకోను అని అంటే అసలు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు అర్థం అయ్యేలా చెప్పు అంటుంది సాక్షి. అంటే నీకు అంత అర్థం అయిందని నాకు తెలుసు నాకు స్వీట్ ఇచ్చావు కదా నేను కూడా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సాక్షి గతంలో ఇచ్చిన బ్లాంక్ చెక్ తిరిగి ఇస్తుంది. తరువాత ఒక రూపాయి చూపించి ఈ రూపాయి నేను, ఎక్కడ ఉన్నా నాకు విలువ ఉంటుంది. కానీ నువ్వు ఆ చెక్ లాంటి దానివి బ్యాంకు లోపలికి వెళితేనే నీకు విలువ అంటుంది. మరోపక్క సాక్షితో వివాదం జరిగిన తర్వాత రిఋషిని కలవాలని మెసేజ్ పెడుతుంది. ఏంటో చెప్పమని అడిగితే కాలేజీలో జరిగిన విషయం తలుచుకుంటే భయం వేస్తోంది ఏం జరిగిందో అర్థం కాక పొగలు వస్తున్నా లోపలికి వచ్చాను అని అంటుంది.

  Recommended Video

  కరోనా భారిన సోనియా - Get Well Soon
  నేను మిమ్మల్ని వదులుకోలేను

  నేను మిమ్మల్ని వదులుకోలేను


  అయితే థాంక్స్ చెప్పడానికి పిలిపించుకున్నావన్న మాట అంటే లేదు థాంక్స్ నేనే చెప్పాలి అనుకుంటున్నాను అని అనడంతో దేని కోసం చెబుతావు అని అడుగుతాడు. అదీ ఇదీ అని స్పష్టంగా చెప్పలేను కానీ నాకు ఒక విషయం అర్థం అయింది. ల్యాబ్ లో మీతో మాట్లాడిన మాటలు అన్నీ నా గుండెల్లో నుంచి వచ్చినవే. నిజంగా మీకు ఏమైనా జరిగితే మరుక్షణమే ఈ గుండె ఆగిపోతుంది. మీరు లేకుండా నేను బతకలేను ఇష్టమో, ప్రేమో తెలియదు కానీ నేను మిమ్మల్ని వదులుకోలేను అని అంటూ ఉండగానే ఎపిసోడ్ ముగించారు. దీంతో రాబోయే ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

  English summary
  Guppedantha Manasu Serial Today Episode June 15th
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X