twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: ఐలవ్యూ చెప్పేయబోయి వెనక్కు తగ్గిన వసు.. ఏమైందంటే?

    |

    స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా రిషి మీద తనకు ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయట పెట్టేందుకు వసుధార సిద్దమవుతుంది. ఈ క్రమంలో రిషిని బయటకు తీసుకు వెళ్లి చెప్పే ప్రయత్నం చేస్తుండగా గత ఎపిసోడ్ ముగించారు. మరి తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది? అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    ముక్కలు చేసి

    ముక్కలు చేసి

    వసుధార మాట్లాడుతూ ల్యాబ్ లో అన్న మాటలు నా గుండెల్లోంచి వచ్చినవే, ఒకవేళ మీకేవైనా జరిగితే మరుక్షణమే ఈ వసుధార గుండె ఆగిపోతుంది అని అంటుంది. నిజం సార్, మీరు లేకుండా నేను బతకలేనని, ఇష్టమో-ప్రేమో- ఇంకొకటో నాకు తెలియదు సార్ కానీ మీరు లేకుంటే నేను లేనని అంటుంది.

    అంతేకాక అక్కడితో ఆగక నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను..నేను ఏం తప్పు చేశానో నాకు తెలిసింది..ఐ లవ్ యూ అని అంటుంది. వసు నోటి వెంట ఆ మాట వింటూనే రిషి లాగిపెట్టి కొట్టి అది ప్రేమో, ఇష్టమో అర్థం కావడం లేదా? నేను ఆరోజే చెబితే ఏదో అన్నావు, నాకే క్లారిటీ లేదన్నావు, అయితే ఈ రోజు కొత్తగా నీకు ఏం క్లారిటీ కనిపించింది? అని ప్రశ్నిస్తాడు. అంతేకాదు నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను ఆ రోజు నా గుండె ముక్కలు చేసి వెళ్లిపోయావు అని అంటాడు.

    తెలియని మార్పేమిటి?

    తెలియని మార్పేమిటి?

    ఇన్నాళ్లూ ప్రతీక్షణం నేను ఎంత నరకం అనుభవించానో నీకేం తెలుసు - ఇప్పుడు నువ్వొచ్చి ఐ లవ్ యూ అనగానే ఐ టూ లవ్ టూ అంటాను అనుకుంటున్నావా అని అంటాడు. వెళ్ళు ఇంకోసారి నా కళ్ళకు కనిపించకు. మనసంటే బ్లాక్ బోర్డ్ కాదు వసుధారా..రాసినవి చెరిపేయడానికి. కొన్నింటిని వెనక్కి తీసుకోలేం-కొన్ని తప్పులు సరిదిద్దుకోలేమని అంటాడు.

    వెళ్లు నా కంటికి కనిపించకు అంటూ ఉండగా ఒక్కసారిగా ఉలిక్కి పడిన వసుధార ఇదంతా నా ఊహ అన్నమాట అనుకుంటుంది. అలా కల రావడంతో ఇప్పుడు నేను వెళ్లి రిషి సార్ తో ఏం చెప్పినా కొట్టినా కొడతారు ఏమో, ఇలా రిషి సార్ అనుకోవడంలో తప్పేముంది. అసలు నాలో నాకే తెలియని మార్పేమిటి? అని ఆలోచనలో పడుతుంది. రెస్టారెంట్ లో ఉన్న వసుధార రిషి సార్ వస్తారా రారా అని ఎదురుచూస్తుంటుంది.

    చెప్పుకోలేని విషయం

    చెప్పుకోలేని విషయం

    ఆమె అలా ఆలోచనలో పడడం చూసిన రెస్టారెంట్ యజమాని ఈ మధ్య వసుధారలో ఏదో మార్పు కనిపిస్తోందనుకుంటాడు. మరోపక్క రెస్టారెంట్ బయట కారు ఆపిన రిషి.. నువ్వు దిగితే నేను వెళతా అని అంటాడు. నాతో పాటు ఓ కప్పు కాఫీ తాగు రారా అంటాడు గౌతమ్. ఇంతలో బయటకు వచ్చిన రెస్టారెంట్ యజమాని రిషిని లోపలికి రమ్మంటే రాను అని అనడంతో వసుధార గురించి మీతో మాట్లాడాలి రండి సార్ అని పిలవడంతో వెళ్తాడు.

    రెస్టారెంట్ యజమాని కొన్ని రోజులుగా వసుధార ఏదోలా ఉంటుంది, వయసులో కాకపోయినా హోదాలో మీరు పెద్దవారు. వసుధారలో ఏదో తెలియని మార్పు వచ్చింది సార్ ఆమె ఏమైనా పొరపాటు చేసిందా? అని అడుగుతాడు. ఆమె ఇంతకుముందులా లేదు, బయటకు చెప్పుకోలేని విషయం ఏదో ఆ అమ్మాయిని ఇబ్బందిపెడుతోంది సార్ ..మీరే ఆమె బాధేంటో తెలుసుకోవాలని అంటాడు.

     మళ్లీ ఇక్కడకు వస్తారని

    మళ్లీ ఇక్కడకు వస్తారని

    ఇదంతా విని ఎందుకు అవన్నీ రిషిసార్ కి చెబుతున్నారు అనుకుంటుంది వసు. ఇక రిషి మాట్లాడుతూ వసు ఆలోచనా ధోరణి అందరిలా ఉండదు, అంతుపట్టదు, కొందరు చాలా ధైర్యంగా కనిపిస్తారు అంతలోనే కొన్నిటికి భయపడతారు అంటుంటే విన్న వసు సార్ ఆర్డర్ అని రిషిని చూసి అడిగితే గౌతమ్ 2 కాఫీ అంటాడు గౌతమ్. కాఫీ తీసుకొని టేబుల్ పై పెట్టిన వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు రిషి.

    ఇద్దరి మధ్యా దూరం తగ్గిద్దామని తీసుకొస్తే కాఫీ తాగకుండా, వసుతో మాట్లాడకుండా వెళ్లిపోతావేంటి అనుకుంటాడు గౌతమ్. ఇక రిషి కోసం తీసుకొచ్చిన కాఫీ వసుధార తాగుతుంది. తాగుతూ రిషి సార్ కి నాపై కోపం పోలేదా.. ఎందుకో రిషి సార్ మళ్లీ ఇక్కడకు వస్తారని అనిపిస్తోంది అనుకుంటూ ఉంటుంది.

    రిషి గురించే

    రిషి గురించే

    అలా అనుకోగానే ఒక టేబుల్ దగ్గర రిషిని చూసి ఇది నా ఊహే అనుకుంటుంది. కాసేపటికి తేరుకుని నిజంగానే రిషి ఉన్నట్లు అర్థం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఒక గిఫ్ట్, కాఫీకి డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్లిపోతాడు రిషి. వసు గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే యాక్సిడెంట్ అయినప్పుడు వసు చున్నీ రిషి దగ్గర ఉండిపోతుంది కదా దాన్ని ప్యాక్ చేసి తీసుకొనివచ్చి ఇచ్చి థాంక్స్ అని స్లిప్ పెడతాడు.

    ఇక ఈ క్రమంలో రెస్టారెంట్ నుంచి రూమ్ కి వెళ్లిపోయిన తర్వాత కూడా రిషి గురించే ఆలోచిస్తూ కూర్చుంటుంది వసుధార. రిషిని బాధపెట్టాను, ఆయనకు ఎన్నిసార్లు సారీ చెప్పినా సరిపోవడం లేదని అనుకుంటూ ఉంటుంది. అలా తాజా ఎపిసోడ్ ముగించారు. చూడాలి మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

    English summary
    Guppedantha Manasu Episode 478: Vasudhara gets tensed because of the nightmare. Later, she gets suspicious when Rishi leaves a note for her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X