Guppedantha Manasu : రిషికి దగ్గరయ్యేందుకు వసు యత్నం.. రగిలిపోతున్న సాక్షి

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. తాజాగా రిషి మీద తనకు ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయట పెట్టేందుకు వసుధార సిద్దమవుతుంది కానీ ఎందుకొచ్చిన టెన్షన్ అని భావించి మళ్ళీ వెనక్కు తగ్గుతుంది. అలా ఆమె మీమాంసలో ఉండగా గత ఎపిసోడ్ ముగించారు. మరి తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది? అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 అంతా నీవల్లే

అంతా నీవల్లే


వసు నిద్రపోకుండా రిషి గురించే ఆలోచిస్తూ..రిషి ఫోన్ కి సారీ సారీ అంటూ మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ చూసిన రిషి చేయాల్సింది అంతా చేసి ఇప్పుడు సారీనా? ఇలాంటి వారికి ఏమీ తక్కువ లేదని ఫోన్ విసిరేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర ఆ ఫోన్ క్యాచ్ పట్టుకుంటాడు. మహేంద్రను ఎందుకొచ్చారని రిషి అడిగితే.. రాత్రంతా నీతో కబుర్లు చెబుదామని వచ్చానంటాడు. నన్నలా వదిలేయండి అని రిషి అంటే నీకు నిన్ను వదిలేస్తే నీతో నువ్వు మాట్లాడుకుంటావా అని అడగడంతో అవును మన మనసుని వేరే వాళ్లు అర్థం చేసుకోనప్పుడు ఏం చేస్తాం అని ప్రశ్నిస్తాడు. దీంతో ఈ మనసుంది చూశావా అని మొదలుపెట్టిన మహేంద్రతో..ఇప్పుడు మనసుపై చర్చ వద్దని బయటకు పంపించేస్తాడు. తండ్రి వెళ్లిపోయిన తర్వాత నేను ఇలా బిహేవ్ చేస్తున్నానంటే అంతా నీవల్లే వసుధారా అని రిషి అనుకుంటాడు.

 తిట్టినా ఓకే

తిట్టినా ఓకే


జగతి మహేంద్ర రూమ్ కి రావడంతో ముసిముసి నవ్వులు నవ్వుతూ అదేంటి మహేంద్ర సార్ ఇప్పుడు వచ్చారేంటి.. రేపటి వరకు కనిపించను అన్నారని అంటే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి.. నీ దగ్గర నీ కొడుకు దగ్గర ఈ వెటకారాలకు తక్కువ లేదంటాడు. ఏమైంది అని అడిగితే..గుడ్ నైట్ చెప్పి వెళ్లి పొమ్మన్నాడు.. వసుపై కోపాన్ని ఎవరిపై తీర్చుకోవాలో అర్థం కాలేదు అని అంటాడు. వసుధార రూమ్ లో నిద్రపోకుండా రిషి గురించి ఆలోచిస్తుంటుంది. మెసేజ్ పెట్టి డిలీట్ కొట్టేలోగా చూసేశారేని బాధ పడుతుంది. ఇక అలా రిషి ఆలోచనల్లోనే ఉన్న వసు మరుసటి రోజు కాలేజీకి వెళ్లి ఈ రోజు ఎలాగైనా రిషి సార్‌తో మాట్లాడతా, కోపం వచ్చినా ఓకే, తిట్టినా ఓకే, క్లాస్ నుంచి గెటవుట్ అన్నా పర్వాలేదు మాట్లాడుతా అని అనుకుంటుంది.

 అర్థం కావడం లేదని

అర్థం కావడం లేదని


దీంతో ఉత్సాహంగా గలగలా మాట్లాడుకుంటూ లోపలికి వెళుతుంటుంది వసుధార. ఏంటి నువ్వేనా హుషారుగా కనిపిస్తున్నావు అని అడుగుతుంది పుష్ప. ఈ రోజు నాకున్న కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అందుకే ఇలా ఉన్నానంటుంది ఆమె, మరోపక్క దేవయాని గౌతమ్ దగ్గరకు వెళ్లి ఏంటీ ఈ మధ్య నాతో మాట్లాడటం లేదు, రిషి ఎలా ఉన్నాడు? తన సంగతులేమిటి అని అంటే మీరునా గురించి అడగండి చెబుతానని గౌతమ్ అంటదు. దానికి దేవయాని నువ్వేంటో నాకు తెలుసు రిషి గురించి చెప్పు అంటుంది. అన్నీ తెలిసినట్టే ఉన్నా మనకు అర్థంకాడు. రిషి-వసుధార మధ్యలో ఏం జరుగుతోందో నాకేం అర్థం కావడం లేదని అనుకుంటాడు.

బాగోదని

బాగోదని


వాళ్లిద్దరి పర్సనల్ విషయాలు మనం మాట్లాడుకోవడం బాగోదని తేల్చేసి కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు గౌతమ్. ఇక మరోపక్క రిషికి సాక్షి ఎదురుపడుతుంది. మళ్లీ ఎందుకొచ్చావ్ అంటూ రొటీన్ క్వశ్చన్స్ వేయొద్దన్న సాక్షి నేను నిన్ను కలవడానికి రాలేదు..డీబీఎస్టీ కాలేజీలో పోస్టులున్నాయి అని తెలిసి అప్లై చేశాను ఇంటర్యూకి వచ్చానని అంటుంది. ఇప్పటి వరకు ఏ ఇంటర్యూలో రిజెక్ట్ కాలేదు..కాస్త లేటైనా కానీ నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ చేస్తావ్..ఈ ఇంటర్యూలో కూడా సెలెక్ట్ అవుతా అంటుంది. ఇక్కడ నీకు పోస్టులున్నాయని ఎవరు చెప్పారో కానీ ఏమీ లేవు, ఆల్ ది బెస్ట్ చెప్పమన్నావ్ కదా ..వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోకు సాక్షి అని చెప్పి పంపుతాడు.

 రగిలిపోతున్న సాక్షి

రగిలిపోతున్న సాక్షి


తర్వాత జగతి క్లాస్ కి వస్తే రిషి వచ్చినట్టు ఫీలవుతుంది వసుధార. దీంతో తాజా ఏపిసోడ్ ముగిసింది. రాబోతున్న ఎపిసోడ్ లో రిషి కారు కీ కిందపడిన క్రమంలో అక్కడకు వచ్చిన వసుధార తీద్దామని వంగుతుంది. రిషి కూడా చూసుకోకుండా వంగడంతో ఇద్దరి తలలు కొట్టుకుంటాయి. సార్ ఒక్కసారి కొట్టుకుంటే కొమ్ములు వస్తాయి అని వసు అంటే ఆల్రెడీ కొమ్ములున్న వాళ్లకి ఏమి వస్తాయి అని అడుగుతాడు రిషి. అయినా వసు సైలెంట్ గా మళ్ళీ ఢీ కొట్టి కారు కీ రిషి చేతిలో పెట్టి వెళ్లి పోతుంది. ఇదంతా చూస్తున్న సాక్షి రగిలిపోతూ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X