Guppedantha Manasu : రిషి పరువు పోయేలా సాక్షి మాస్టర్ స్కెచ్.. దెబ్బకు మటాష్ చేసిన వసుధార
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ముందుగా రిషి నిన్ను ప్రేమిస్తున్నాను వసుధార అని చెప్పడంతో వసుధార సాక్షి మాటలకు భయపడి తాను ప్రేమించడం లేదని చెబుతోంది. అయితే తాజాగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తాను రిషిని ప్రేమిస్తున్నాను అనే విషయం అర్థం చేసుకుంటుంది. అయితే ఈ విషయం రిషికి చెబితే ఎలా తీసుకుంటాడు అని అర్థం కాక ఆమె ఇప్పుడే చెప్పకూడదని నిర్ణయించుకుంటుంది. అయితే తనకు క్లారిటీ వచ్చిన విషయం రిషికి అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు ఇక ఈరోజు జరిగే ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆలోచనలో పడే విధంగా
రిషి సార్ క్లాస్ కి వస్తాడు రాగానే నేను ఏదో ఒక రకంగా డౌట్లు అడిగి ఆయనను మాట్లాడిస్తూ ఉండాలని వసుధార నిర్ణయించుకుంటుంది. అలా మాట్లాడుతూనే తనకు కొన్ని విషయాల క్లారిటీ వచ్చాయనే విషయం తెలిసేలా చేయాలని వసుధార ప్లాన్. ఆమె రిషి క్లాసుకు వచ్చి తాను డౌటు అడుగుతున్నానని ఊహల్లో కూడా తేలిపోతూ ఉంటుంది..
అయితే ఆమె ఆశలను నిరాశ చేస్తూ రిషి తీసుకోవాల్సిన క్లాసుకు జగతి మేడం వస్తుంది. వెంటనే వసుధార ఒక్కసారిగా నిరాశ పాలవుతుంది. ఇదే విషయాన్ని జగతిని అడిగి అసలు రిషి సార్ తీసుకోవాల్సిన క్లాసు మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగితే ఆమె నేరుగా సమాధానం చెప్పకుండా కొన్నాళ్ళ పాటు రిషి క్లాసుకు రాడు ఆయన క్లాసులు కూడా నేనే తీసుకుంటాను అని అంటుంది. అంతేకాక వసుధార ఆలోచనలో పడే విధంగా కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇస్తుంది.

ముందే అర్థమయ్యేది
దీంతో ఆమెకు ఈవిడ నన్ను ఉద్దేశించి ఈ మాటలంటున్నది అనే విషయం అర్థం అవుతుంది. కానీ అప్పుడు క్లాసులో అందరూ ఉండడంతో ఏమీ మాట్లాడలేక సైలెంట్ గానే ఉండిపోతుంది. ఇంకా క్లాస్ పూర్తయిన తర్వాత వెంటనే జగతీ మేడం వెంట వసు పరిగెడుతూ బయటకు వెళుతుంది. అలా వెళ్లిన తర్వాత రిషి సార్ తీసుకోవాల్సిన క్లాస్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగితే ఆయన తీసుకోమన్నారు నేను తీసుకుంటున్నాను అంతే నాకు ఏమీ తెలియదు అని జగతి అంటుంది. అదేమిటి మీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని వసుధార అడిగితే అందరి మనసులో విషయాలు నాకు తెలిసే అవకాశమే ఉంటే అసలు నీ మనసులో ఏముందో కూడా నాకు తెలిసేది కదా. వసుధార ఎందుకిలా చేస్తోంది అని ఇంత బుర్రలు బద్దలు కొట్టుకోకుండా ఆ విషయం నాకు ముందే అర్థమయ్యేది కదా అని కూడా కౌంటర్ వేస్తుంది.

అవసరం ఏముంది?
రిషి సార్ నా గురించి క్లాసుకి రావడం లేదు ఏమో అని ఈ వసుధార ఆలోచనలో పడుతుంది. మరోపక్క రిషి వద్దన్నా సరే కాలేజీలో మకాం వేసిన సాక్షి ఎలా అయిన రిషిని నా దారికి తెచ్చుకోవాలని అంటుంది. ఆమె ఆలోచిస్తున్న సమయంలో రిషి నడుచుకుంటూ వస్తాడు. వస్తున్న సమయంలో చేతిలో తాళం కింద పడటంతో దాన్ని తీసుకోవడానికి కిందకి వంగుతాడు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు కానీ వసుధార కూడా వంగోవడంతో ఇద్దరి తలలు గుద్దుకుంటాయి. నువ్వెక్కడ నుంచి వచ్చావు ఇంతలో అంటే మీ కీ పడింది కదా అది తీసి ఇవ్వాలని వచ్చా అని అంటుంది. అది నేను తీసుకోగలను కదా అంటే నువ్వు వంగి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు పారేసుకున్న కొన్ని వస్తువులు నేను ఇవ్వాలి అంటూ ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతుంది.

లైబ్రరీలోకి వెళ్లి
అంతేకాక మరోసారి తల గుద్దుకోక పోతే కొమ్ములు వస్తాయని అంటే ఆల్రెడీ కొమ్ములు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు రిషి. మళ్లీ లేవబోతున్న సమయంలో మరోసారి తలతో ఢీ కొట్టిన వసు అక్కడ నుంచి వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి తట్టుకోలేక సాక్షి వెంటనే దేవయానికి ఫోన్ చేసి ఇంకా ఎక్కువ రోజులు వేచి చూసే ఓపిక నాకు లేదు. ఇక్కడ ఏవేవో నాకంట పడుతున్నాయి అంటూ దేవయానిని రెచ్చగొడితే ఆమె మాత్రం నెమ్మది, ఎలా అయినా నువ్వు రిషిని చేరుకుంటాడు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అని ధైర్యం చెబుతుంది. ఇది జరిగిన తర్వాత రిషి కాలేజీలో ఉన్న లైబ్రరీలోకి వెళ్లి అక్కడ ఉన్న బాయ్ ని నీ టైం అవ్వగానే నువ్వు వెళ్ళిపో నేను లైబ్రరీ క్లోజ్ చేసి ఇంటికి వెళ్తాను అంటాడు. స్టూడెంట్స్ ఒక్కరొక్కరుగా లైబ్రరీ నుంచి వెళ్ళిపోతారు.

నేను చెబుతాను అంటూ
అందరూ వెళ్ళిపోయారు అని అనుకున్న తర్వాత సాక్షి ఆ గది లోకి వెళుతుంది. వెళ్లడమే కాక తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే ఇలా లైబ్రరీకి ఒంటరిగా పిలిపించి తనను బలవంతం చేయబోయాడు అంటూ రిషి గురించి చెబుతానని బెదిరిస్తుంది. అయితే ఆమె మీద అప్పటికే ఏహ్య భావనతో ఉన్న రిషికి ఈ మాటలతో అది మరింత పెరుగుతుంది. పెళ్లి చేసుకుంటాను అని చెప్పకపోతే అలారం నొక్కుతాను అని సాక్షి బెదిరిస్తూ ఉన్న సమయంలోనే నేటి ఎపిసోడ్ ముగిసింది. తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం సాక్షి అలారం మోగించడంతో మహేంద్ర, జగతి వంటి వారందరూ వస్తారు. అసలు ఏం జరిగింది అని అడుగుతున్న సమయంలో ఏం జరిగిందో నేను చెబుతాను అంటూ ముందుకు వస్తుంది వసుధార. సాక్షి చేసిన వ్యవహారమంతా వసుధార బయట పెట్టబోతున్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో.


Click it and Unblock the Notifications











