Guppedantha Manasu: ఎట్టకేలకు ఓపెన్ అయిన వసుధార.. సందిగ్ధావస్థలో జగతి
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వసుధార, రిషి మధ్య ప్రేమ వ్యవహారాన్ని హైలైట్ చేస్తున్నారు. వసుధారను ఒక స్కాలర్ షిప్ టెస్ట్ రాయించడం కోసం వేరే ఊరికి తీసుకు వెళ్లి పరీక్ష రాసి వచ్చాక రిషి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఆమె ఒప్పుకుంటుంది అనుకుంటే ఒప్పుకోకుండా షాక్ ఇస్తుంది. దీంతో రిషి దేవదాసు లాగా మారిపోతాడు. తన తండ్రి మహేంద్రను తీసుకుని బార్ కు వెళతాడు.
ఇక తాగటమే అని అనుకుంటున్న తరుణంలో వసుధార అక్కడికి వచ్చి మీ మనసు ఇంత బలహీనమైన అని అడిగినట్లు ఊహించుకోవడం తో తాగడం కరెక్ట్ కాదని చెప్పి తన తండ్రికి మళ్లీ రివర్స్ షాక్ ఇచ్చి ఇంటికి తీసుకువస్తాడు. మరోపక్క జగతి వసుధారతో మాట్లాడేందుకు కాలేజ్ దగ్గరికి వెళుతుంది. అలా గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

పట్టుపట్టిన జగతి
జగతి వసుధారతో మాట్లాడుతూ పరీక్షకు వెళ్లి వచ్చిన తర్వాత నీ నుంచి ఎలాంటి ఫోన్ లేదు, రిషి చూస్తే అలా ఉన్నాడు నువ్వేమో కనీసం బాధ్యత లేకుండా ఫోన్ కూడా చేయలేదు అని అడుగుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది? రిషి కూడా నీతో పాటు వచ్చి ఉంటాడు అని నేను ఊహించగలను అని ఆమె ప్రశ్నిస్తుంది. దానికి వసుధార ప్రతిసారి జరిగిన అన్ని విషయాలు చెప్పుకోలేము అంటుంది.
అయితే రిషి బార్ లో కూర్చొని మందు తాగడానికి సిద్ధమవుతున్న సమయంలో మహేంద్ర తీసిన ఫోటో జగతికి రావడంతో, అది చూసి రిషి ఎంత బాధ పడుతున్నాడో నేను మాత్రమే అర్థం చేసుకోగలను అలా చూసి నా మనసు అదోలా అయిపోయింది అంటుంది. అంతే కాక ఇప్పుడు రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసా బార్లో ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ విషయం మీద ఏం జరిగిందో చెప్పి తీరాల్సిందే అని ఆమె అంటుంది. రిషి బార్ లో మందు తాగడానికి సిద్ధమవుతున్న ఫోటో చూసి వసుధార షాక్ అవుతుంది.

రిజెక్ట్ చేశానని
రిషి సార్ ఏమిటి? బార్ లో మందు కొట్టడానికి వెళ్లడం ఏమిటి? అని ప్రశ్నిస్తే ఇప్పుడే ఈ ఫోటో మహేంద్ర పంపించాడు కాలేజీ కి వెళ్లాల్సిన నా కొడుకు బార్ కి వెళ్లాల్సి వచ్చింది అంటే అక్కడ ఏం జరిగిందో నువ్వు చెప్పి తీరాల్సిందే అని జగతి పట్టుబడుతుంది. అయినా సరే తొలుత వసుధార ఏమీ చెప్పకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది.
కానీ చాలా బలవంతం చేసిన తర్వాత రిషి తనకు ప్రపోజ్ చేసిన విషయాన్ని, తాను రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన విషయాన్ని వసుధార చెబుతుంది. ఇదంతా విన్న తర్వాత ఒక్కసారిగా షాక్ అయిన జగతి నువ్వేంటి రిషి ప్రేమను రిజెక్ట్ చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తుంది.. నీ ప్రేమను పొందే అర్హత రిషికి లేదా? అంటూ ప్రశ్నించడంతో ఇక్కడ అర్హతలు గురించి నేను మాట్లాడటం లేదు నేను చదువుకోవడం కోసం అమ్మా నాన్నలని వదిలేసి బయటకు వచ్చాను నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అని వసుధార కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది..

జగతికి షాక్
దానికి జగతి నువ్వు అబద్దం చెబుతున్నావ్, నువ్వేంటో నీ మాట తీరు ఏమిటో నీ నడవడిక ఏమిటో నీ మనస్సు ఏమిటో నాకు అన్నీ తెలుసు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నావు అంటూ అంటుంది. నా కొడుకుని వద్దు అనడానికి ఒక్క కారణం చెప్పు అంటే ఆయన నన్ను ఇష్టపడినంతమాత్రాన నేను ఆయనను ఇష్టపడాలి అని రూల్ లేదు కదా, నా మనస్సు ఏమిటో నాకు తెలుసు అంటే నీ మనసులో ఏముందో చెప్పమని జగతి అడుగుతుంది.
నాకు తెలుసు సరిపోతుంది అని వసుధార అంటుంది. అయితే జగతి మాత్రం వదలకుండా నిన్ను ఎవరైనా కలిసారా . వారు నన్ను భయపెట్టారా? నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఊహించలేదు అసలేం జరిగిందో చెప్పమని అడుగుతుంది.. ఎంత చెప్పినా ఆమె వినే పరిస్థితుల్లో లేకపోవడంతో ఇది నాకు రిషికి మధ్య జరిగింది మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని అర్థం వచ్చేలా మాట్లాడడంతో జగతి వెళ్ళి పోతూ నేను ఏ పరిస్థితుల్లో బయటకు వెళ్లానో, దాని గురించి రిషి ఎంత బాధ పడ్డాడో నాకు తెలుసు నేను బాధ పెట్టిన దానికి వెయ్యి రెట్లు నువ్వు రిషిని బాధ పెట్టావు వాడి గుండెను ముక్కలు చేసావు అంటూ అనడంతో రిషి కూడా అదే మాట చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది.

కవరింగ్ కోసం
మరోపక్క రిషి మహేంద్ర కలిసి కాలేజీకి వెళ్తారు. కాలేజీకి వెళ్లిన తర్వాత మహేంద్ర కారు కూడా దిగక ముందే రిషి కారు దిగి కాలేజీ లోపలికి వెళ్ళి పోతూ ఉంటాడు. రిషిని పిలిచిన మహేంద్ర ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా అంటాడు. అవునా మరి నేను క్లాస్ చెప్పడానికి వెళ్తున్నాను మీరు కూడా క్లాస్ కి వస్తే బాగోదు కదా అంటూ కౌంటర్ వేస్తాడు రిషి. దీంతో మహేంద్ర నీ మనసు బాగోలేదు అని నాకనిపిస్తోంది అంటే అదేమీ లేదు నేను అంతా బాగానే ఉన్నాను అని కవర్ చేసుకోవడానికి రిషి ప్రయత్నిస్తాడు.
నేను నీ తండ్రిని నీ మనస్సు ఏమిటో నాకు తెలుసు అని చెప్పిన మహేంద్ర చివరికి రిషి ఓపెన్ కాకపోవడంతో నేను ఇంటికి వెళతాను అని బయలుదేరుతాడు. మరో పక్క ఇంటికి వచ్చిన జగతి మహేంద్ర ఎక్కడ ఉన్నాడు అని ధరణిని అడుగుతుంది. అంతలోనే అక్కడికి వచ్చిన మహేంద్రని నీకో విషయం చెప్పాలని లోపలికి వెళుతుంది.

పార్టీ కావాలన్న పుష్ప
కాలేజీకి వెళ్ళిన తర్వాత వసుధార నిర్లిప్తంగా నడుస్తూ వెళుతుంది అదే సమయంలో పుష్ప ఆమెను గట్టిగా పిలుస్తూ వస్తున్నా వినిపించుకోకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడంతో పరిగెత్తుకుంటూ వచ్చి పుష్ప ఆపివేస్తుంది. స్కాలర్షిప్ టెస్ట్ ఎలా రాసావు అని అడిగితే దానికి వేదాంత ధోరణితో మాట్లాడుతుంది వసుధార. అదేంటి నువ్వు రాస్తే ఫస్ట్ ర్యాంకు రావడం గ్యారెంటీ కదా అని అంటూనే నిన్ను రిషి సార్ తీసుకు వెళ్లారు అంట కదా ఆయనతో లాంగ్ జర్నీ ఎలా ఉంది అని అడుగుతుంది.
చాలా బాగుందని చెప్పడంతో నువ్వు రాగానే నాకు ఫోన్ చేసి చెబుతావు అని అనుకున్నాను కానీ నువ్వు చెప్పలేదు. నాకు పార్టీ కావాలి అని పుష్ప పట్టుపడుతుంది. సరే ఇస్తానని చెప్పడంతో నేను క్లాస్ కి వెళ్తున్నా అని చెప్పి ఆమె వెళుతుంది. నేను కొంచెం ఆగి వస్తానని వసుధార నెమ్మదిగా వెళుతూ ఉంటుంది. అప్పటికే క్లాసులో రిషి లెక్కలు చెప్పడం మొదలు పెడతాడు. లేటుగా వచ్చిన వసుధార లోపలికి రావచ్చా అని అడగడంతో రిషి అసహనానికి లోనైనట్లు చూపించారు.


Click it and Unblock the Notifications











