For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu : సాక్షికి మన ప్రేమ విషయం ఎలా తెలిసింది.. వసును కొట్టినంత పని చేసిన రిషి?

  |

  స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు తాజా ఎపిసోడ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సాక్షి రిషిని ఎలా అయినా దక్కించుకోవడానికి అతని మీద ఏకంగా లైంగిక వేధింపల ఆరోపణలు కూడా చేయడానికి సిద్ధం అవుతుంది. అయితే అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన వసుధార ఆమె బారి నుంచి అతన్ని కాపాడుతుంది. ఈ క్రమంలోనే తన ప్లాన్ ఫెయిల్ అవడంతో వసుధారని టార్గెట్ చేసిన సాక్షి నోటికొచ్చినట్టు మాట్లాడడమే కాక తనకు అడ్డు వస్తుంది అంటూ వసు మీద కొట్టేందుకు చేయెత్తిన సాక్షితో వసు గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. నువ్వు నోరు పారేసుకోవడం,చెయ్యి చేసుకోవడం లాంటివి మానేస్తే మంచిదని హితవు పలుకుతుంది. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  విషపు ఆలోచనలే

  విషపు ఆలోచనలే


  రిషి సార్ ని బ్లాక్ మెయిల్ చేస్తావా? అలా బ్లాక్ మెయిల్ చేసి ఓ మనసును ఎలా గెలుస్తావ్ అని ప్రశ్నిస్తుంది. నీకున్న తెలివితేటలు నాకు లేవు కద, నువ్వు వద్దన్నా నిన్ను రిషి వదలడం లేదని అంటే, వదలడం, వద్దనడం మనసులో ఉంటుంది నీకు అర్థం కాదులే అంటుంది వసు. లైబ్రరీ మ్యాటర్ బయటకు చెబితే నీ పరువు పోతుంది, జీవితంలో రిషిని చూడలేవు కూడా అని వార్నింగ్ ఇస్తే, నిజంగా నేను ఎక్కువ చేస్తే నువ్వు తట్టుకోలేవని అంటుంది. మరోపక్క రిషి ఇంట్లో అంతా పంచాయతీ పెడతారు. సాక్షి చేసిన రచ్చ అంతా గుర్తుచేసుకుని కాదని వెళ్లింది కాదనుకునే ఉంది మళ్లీ అభిప్రాయాలు మార్చుకోవడం లేదని రిషి అంటాడు. మనసు మారుతుంది కదా అని సాక్షి అంటే నేను పెద్దమ్మతో మాట్లాడుతున్నాను నువ్వు మధ్యలో మాట్లాడకు, తను వంద కారణాలు చెబుతుంది కానీ అందులో ఏ ఒక్కటీ నాకు నిజం అనిపించడం లేదు. చెప్పకుండా ఇంటికొస్తుంది, అపాయింట్ మెంట్ లేకుండా కాలేజీకి వస్తుంది. బయటకు కనిపించేది రూపం మాత్రమే తనవన్నీ విషపు ఆలోచనలే అని అంటాడు రిషి.

  ఎంత బాధ పడ్డారో

  ఎంత బాధ పడ్డారో

  మనకు ఎంగేజ్ మెంట్ అయింది రిషి, ఈ విషయం నువ్వు మర్చిపోతున్నావ్..నేను కాలేజీకి వచ్చానని ఇలా అంటున్నావా అంటే దానికి రిషి ప్రతిదానికీ ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుందని అంటాడ. ఇంతలో దేవయాని ఏదో మాట్లాడబోతుంటే...పెద్దమ్మా మీరంటే నాకు గౌరవం ఆ గౌరవాన్ని ఇలాంటి వాటికోసం వాడుకోకండి అని రిషి అనడంతో ఆమె సైలెంట్ అయిపోతుంది. మహేంద్ర, ఫణీంద్ర కూడా రిషి అంత క్లియర్ గా చెబుతున్నాడు కదా వదిలేయాలని అంటే సాక్షి జగతిని అడుగుతుంది. ఓ ఆడపిల్లగా నీపై నాకు ప్రేమ,గౌరవం ఉంది. నీ మనసు మారింది అన్నావ్..రిషి కూడా మారాలి అనుకోవడం కరెక్ట్ కాదు కదా..తన మనసేంటో చెప్పాడు,ఇంతకన్నా నేను ఏం చెప్పలేనని అంటుంది. అలా ఆ పంచాయితీ ముగుస్తుంది. ఇక మరో పక్క రూమ్ బయట చెట్టుకింద ఫోన్ చూస్తూ కూర్చున్న వసుధార, లైబ్రరీలో సాక్షి మాటలు తల్చుకుంటూ రిషి సార్ ఎంత బాధ పడ్డారో అని ఆలోచిసుంది.

  అనగనగా రాజ్యంలో

  అనగనగా రాజ్యంలో

  రిషి కూడా ల్యాబ్ లో వసు రక్షించడం, లైబ్రరీలో వెన్నంటి నిలబడి కాపాడడంతో వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క వసు నుంచి కాల్ వస్తే ఏంటి ఈమె ధీమా..ఇష్టం వచ్చినప్పుడు కాల్ చేసి హలో అంటే మాట్లాడుతా అనుకుంటుందా అనుకుంటాడు. అయితే నిజానికి ఆ కాల్ చేసింది వసుధార కాదు. ఆమె దగ్గరకు వచ్చిన పిల్లలు కొందరు అక్కా కథచెప్పు అని అడిగి ఫోన్ లాక్కుంటారు. అప్పుడు ఆ ఫోన్ డయల్ అయిపోవడంతో కాల్ వెళుతుంది. అసలు ఎత్తితే ఏమంటుందో చూద్దామని కాల్ లిఫ్ట్ చేస్తే అనగనగా రాజ్యంలో ఓ ప్రిన్స్ ఉన్నాడు..అంటూ ఆమె తన కధనే చెబుతూ ఉంటుంది. నా కథను పిల్లలకు కథలు కథలుగా చెబుతుంది రేపు కాలేజీలో పని చెబుతానని అంటాడు.

  మగవారి మాటలకు అర్థాలే వేరులే

  మగవారి మాటలకు అర్థాలే వేరులే

  కాలేజీకి వచ్చిన తరువాత సాక్షిని ఈ విషయం మీద నిలదీస్తే అయితే రాత్రి వినగానే అడగొచ్చు కదా..రాత్రంతా ఆలోచించి లిస్ట్ తయారు చేసుకుని ఇప్పుడు అడుగుతున్నారని అంటుంది. అలా అంటూనే ఆయాసపడుతూ వాటర్ దొరుకుతాయా సార్ అని అడుగుతుంది. రిషి ఆశ్చర్యంగా చూస్తే మీరు నా కథ చెప్పండి నేను సంతోష పడతానని అంటూ పారిపోయి వచ్చినప్పటి నుంచీ జరిగినదంతా చెప్పబోతుంటే ఇక ఆపు..నువ్వెళ్ళమని అంటాడు. దానికి ఆమె ఎవరు రాశారో కానీ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని..మగవారి మాటలకు అర్థాలే వేరులే అని పాట పాడుతూ ఆట పట్టించి వెళ్లిపోతుంది.

  మళ్ళీ ఫైర్

  మళ్ళీ ఫైర్

  ఇక అలా తాజా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక కమింగ్ అప్ ఎపిసోడ్ లో తమరు చేసిన ఘన కార్యానికి భారీ సన్మానం చేసినా తప్పులేదని ఆమెను రిషి తిడుతూ ఉంటాడు. నేను ప్రపోజ్ చేసింది, నువ్వు రిజెక్ట్ చేసింది సాక్షికి ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నిస్తాడు. ఆమెకు చెప్పక నీ ఈగో తృప్తి పడిందా అని అడుగుతాడు. ఆ రోజు సాక్షి అక్కడే ఉందని ఎలా చెప్పేది అని వసుధార అడుగుతూ ఉంటే ఏం చెప్పాలా అని ఆలోచనలో పడుతుంది. ఆమె ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా రిషి పట్టించుకోడు.. ఇక్కడి నుంచి వెళ్లిపో అని అరవడం ఆసక్తికరంగా మారింది.

  English summary
  Guppedantha Manasu Episode 482: Rishi lashes out at Sakshi for trying to trouble him. Later, he confronts Vasudhara after overhearing her words.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X