Guppedantha Manasu : సాక్షి ప్రైవేట్ మెసేజ్.. పర్సనల్ అంటూ వసు మీద రెచ్చిపోయిన రిషి!

గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ ప్రతి ఎపిసోడ్ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సాగే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఎలా అయినా రిషితో పెళ్లి జరిపించుకోవాలి అని తాపత్రయ పడుతున్న సాక్షి రిషి మీద లైంగిక వేధింపులు కూడా మోపి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో వసుధార ఎంట్రీ ఇచ్చి ఆమె ప్లాన్స్ అన్నీ విఫలం చేస్తుంది. ఆ తర్వాత వసుని భయపెట్టాలని చూస్తే నువ్వే జాగ్రత్తగా ఉండాలి అని వసు హెచ్చరిస్తుంది. ఇక అలా గత ఎపిసోడ్స్ ముగించారు తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 ఒక్కసారి షాక్

ఒక్కసారి షాక్


తన గురించి చిన్న పిల్లలకు లేనిపోని కథలు చెబుతుంది అంటూ వసుధార మీద కాస్త ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత రిషి తన కాబిన్ కి వచ్చి కూర్చున్నాడు. ఈ సమయంలోనే ఒక కవర్ రావడంతో ఆ కవర్ లో ఏముందో చూడాలని చూస్తే ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది.. ఆ పెన్ డ్రైవ్ పెట్టి చూస్తే అందులో సాక్షి వీడియో మెసేజ్ కనిపిస్తుంది. ఎప్పటిలాగే నాకు నువ్వంటే చాలా ఇష్టం, నన్ను దూరం చేసుకోవద్దు, ఎలా అయినా మన ఇద్దరం ఒకటి కావాలి అంటూ సాక్షి తన అంతరంగాన్ని మరోసారి బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే రిషి మాత్రం ఇది ఎప్పుడూ ఉండే గోలే కదా అన్నట్లు లైట్ తీసుకుంటాడు. కానీ ఆమె మాట్లాడుతూ నీకు నేనంటే ఇష్టం లేదు, అయితే ఎందుకు ఇష్టం లేదు అన్నా సరే వసుధార వెంట నువ్వు పెడుతున్నావు అని అనడంతో ఒక్కసారి షాక్ తగిలినట్టు అవుతుంది.

అభాండాలు

అభాండాలు

ఇదేమిటి ఇది నాకు వసుధార కు మధ్య ఉండాల్సిన విషయం సాక్షి దృష్టికి ఎలా వెళ్ళింది దీనంతటికీ కారణం వసుధార అని రిషి భావిస్తాడు. వెంటనే కాలేజ్ ప్యూన్ ని పిలిచి ఒక సారి వసుధారను పిలిచుకుని రమ్మని అంటాడు. వసుధార వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నువ్వు మన ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్సనల్ విషయాలను నీ ఇగో చల్లార్చు కోవడం కోసం సాక్షి దృష్టికి తీసుకు వెళ్లావు అంటూ ఆమె మీద అభాండాలు వేస్తాడు. అయితే మనిద్దరం మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో సాక్షి అక్కడే ఉందనే విషయం చెప్పడానికి వసుధార ప్రయత్నిస్తుంది కానీ ఇప్పుడు చెప్పినా, నమ్ముతాడో నమ్మడో అని సైలెంట్ అవుతుంది.

జెంటిల్మెన్ అని

జెంటిల్మెన్ అని

ఆమె మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన రిషి ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని అనడంతో ఆమె వెళ్లిపోయి ఒక చెట్టు కింద కూర్చుని బాధపడుతూ ఉంటుంది.
ఇప్పుడు సాక్షి గొడవ జరిగినప్పుడు అక్కడే ఉందనే విషయం చెప్పినా ఆయన నమ్మడమో, అయినా అసల కనీసం ఆయన నన్ను మాట్లాడించే అవకాశం కూడా ఇవ్వడం లేదు, ఇలా అయితే నేను చెప్పాలనుకున్న విషయాన్ని ఆయన దృష్టికి ఎలా తీసుకు వెళ్ళగలను అని ఆమె బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన జగతి, అసలేం జరిగింది? ఎందుకు వసుధార అలా ముభావంగా ఉన్నావు అని అడుగుతూనే రిషితో ఏదైనా గొడవ జరిగిందా అంటే లేదు మేడం మీ అబ్బాయి ఒక జెంటిల్మెన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

పెళ్లి త్వరగా చేయాలని

పెళ్లి త్వరగా చేయాలని

అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర తను ఎందుకు అలా ఉంది నువ్వు ఏమి అడిగావు అని అడగడంతో ఏమైనా ఇబ్బంది పడుతున్నావా అంటే మీ అబ్బాయి జెంటిల్మెన్ అని చెప్పి వెళ్ళిపోయింది అని అంటుంది. ఇక ఆ తర్వాత దేవయాని తో భేటీ అయిన సాక్షి ఎలాగోలా తన పెళ్లి త్వరగా చేయాలని అంటుంది. దేవయాని తొందరపడితే పనులు జరగవ్, నెమ్మదిగా అన్నీ ప్లాన్ చేసి చేద్దామని అభయమిస్తుంది. మరోపక్క రాత్రి సమయంలో రిషి తన రూం లో కూర్చుని వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార తన రూమ్లో కుర్చుని రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జగతి రిషి రూమ్ కి వచ్చే సమయానికి వసుధార డబ్బా కింద పడి ఉండటంతో దాన్ని తీసుకుని రిషిని విసిగిస్తుంది.

మధన పడుతుందో

మధన పడుతుందో

మీతో మాట్లాడడం కోసం వచ్చానని అనడంతో ఆమె వసుధార గురించి మాట్లాడుతుంది ఏమో అనే ఉద్దేశంతో ఆమె మీరు ఒకే జాతికి చెందిన పక్షులు, మీరెలా అయితే నన్ను వదిలేసి వెళ్లారో ఆమె కూడా రకరకాల కారణాలతో వదిలేయడానికి చూసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే నిజానికి నేను వచ్చింది అందుకోసం కాదు స్లం క్లియరెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి మినిస్టర్ మెయిల్ పెట్టారు అది మీకు ఫార్వర్డ్ చేశాను దయచేసి అది చూసి కొంచెం రిప్లై ఇవ్వమని జగతి అడుగుతుంది. అయితే అనవసరంగా వసుధార వ్యవహారాన్ని ప్రస్తావించానని బాధపడుతూ నేను ఆ పని చూస్తా అని చెబుతాడు. ఇక అలా తాజా ఎపిసోడ్ ముగించారు. ఇక రాబోతున్న ఎపిసోడ్స్ లో వసుధారా సాక్షి వ్యవహారం గురించి రిషి దృష్టికి తీసుకు వస్తుందో లేక తనలోనే దాచుకుని మధన పడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X