For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu : వసుధార ప్రేమతో ఇబ్బంది పడుతున్న రిషి.. బెట్టు చేస్తూనే సీక్రెట్ లవ్!

  |

  స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సాక్షికి వార్నింగ్ ఇచ్చిన వసు రిషికి తన మీద ఉన్న ప్రేమను అర్ధం చేసుకుంటుంది. అలా సాగుతూ ఉండగా మినిస్టర్ గారు అప్పగించిన వర్క్ ఎందుకు ఎప్పుడూ హడావుడిగా ఉంటుదని అనుకుంటుంది. ఎట్టకేలకు పూర్తి చేసి జగతిమేడంకి కాల్ చేసి మేడం రిపోర్ట్స్ రెడీ అయ్యాయి ఫైనల్ చేయండని అంటుంది. దానికి జగతి నేను నీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను, కానీ ఫైనల్ చేయాల్సింది రిషి, నేను కాదని అంటూ కాస్త టైమ్ ఇవ్వు కాల్ చేస్తానని అంటుంది. వసు పంపించిన వర్క్ మొత్తం చెక్ చేసిన జగతి దీన్ని ప్రింట్ తీసి రిషికి ఇస్తే సరిపోతుంది అంటుంది. ఇంతలో అక్కడకు మహేంద్ర,గౌతమ్ వచ్చి ఇంకా వర్క్ చేస్తున్నారా అని అడగడంతో ల్యాప్ టాప్ తీసుకెళ్లింది కదా తొందరగా చేసి పెట్టేసింది వసు అని చెబుతుంది.

  దారిలో పెట్టే పని నీదే

  దారిలో పెట్టే పని నీదే

  ఇక వసుధార వర్క్ విషయంలో చాలా సిన్సియర్ గౌతమ్ అంటే, మహేంద్ర మాత్రం నాన్ సింక్ లో రిషి మైండ్ ను దారిలో పెట్టే పని నీదే గౌతమ్ అని అంటాడు. నా వరకు నేను పని నేను చేస్తున్నానని అంటాడు. జగతి ఏమో రిషి వాడి ఆశావాదం చూసి సంతోషపడాలో, లోపల నిరాశావాదంలో కూరుకుపోతున్నాడో అర్థం కావడం లేదు. బయటకు గంభీరంగా ఉన్నా లోపల నలిగిపోతున్నాడని, మనమే ఏదోఒకటి చేయాలని అంటుంది. ఇక ఉదయాన్నే రిషి లేచి బాల్కనీలో నిల్చుని టీ తాగుతుండగా మహేంద్ర అండ్ కోతో కూర్చున్న వసుధార కనిపిస్తుంది. ఇలా నువ్వు కంటి ముందుకు రాక వసుధార నీ ఆలోచనలు మింగుడు పడడం లేదు అనుకుంటూ తనను రిజెక్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తుకుంటాడు.

  ఎక్కడ అరుస్తాడో

  ఎక్కడ అరుస్తాడో


  ఇంతలో ధరణి జ్యూస్ తీసుకెళుతుంటే దేవయాని ఆపి వచ్చిన వారికి అతిథి మర్యాదలు బాగా చేస్తున్నావని సెటైర్ వేస్తుంది. ఆ వసుధారతో పని ఉంటే కాలేజీలో చేయించుకోవాలి వదిలేయాలి అంతేకానీ ఇలా ఇంటికి తీసుకురావాలా..ఎన్నిసార్లు చెప్పినా నా బాధ ఎవ్వరికీ అర్థం కాదని అంటుంది. కాలేజీలో మినిస్టర్ అప్పగించిన వర్క్ పై రిషి క్యాబిన్లో డిస్కషన్ పెడతారు. ఉన్నవి రెండు గ్రూపులు, ఆ గ్రూపులను ఎవరెవరు లీడ్ చేయాలన్న విషయం మీద క్లారిటీ ఇస్తుంది జగతి. రిషి. నువ్వు వస్తావా రావా అని మహేంద్ర అడిగితే..నా వీలును బట్టి వస్తానంటాడు. వసుధారలో వెళ్లమని చెప్పాలని ఉంది కానీ చెబితే ఎక్కడ అరుస్తాడో అని భయం అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు మహేంద్ర,జగతి.

  గౌతమ్ కి కాల్ చేసి

  గౌతమ్ కి కాల్ చేసి

  గౌతం, వసుధార ఒక టీంలో పని చేయాల్సి వస్తుంది. వసుధార సైకిల్ పై అక్కడికి వస్తే కారులో రావచ్చు కదా అంటాడు గౌతమ్. డానికి ఆమె ఆసక్తికర సమాధానం ఇస్తుంది. వాళ్ళ వెంటనే వెళ్ళిన రిషి మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ ప్లైన్ చేస్తున్న వసుని చూస్తూ ఉండిపోతాడు. తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా చూసిన వసుధార..రిషి సార్ వచ్చారా అనుకుంటుంది.
  మరోపక్క దేవయాని, ఫణీంద్ర భోజనం చేస్తుండగా లోపలకు వచ్చిన మహేంద్ర, జగతిని భోజనానికి పిలుస్తాడు ఫణీంద్ర. మేం బయట తినేసి వచ్చాం అని మహేంద్ర చెప్పడంతో ఏ స్టార్ హోటల్లోనే తినేసి వచ్చింటారులే అంటే దానికి జగతి స్లమ్ ఏరియాలో వాళ్లతో పాటు జొన్నరొట్టెలు తినేసి వచ్చామని అంటుంది. కంచంలో చేయి కడుక్కుని ఇదంతా వింటుంటే నాకు కడుపులో దేవుతుంది అంటూ ఓవరాక్షన్ చేస్తుంది. మరోపక్క అటు గౌతమ్ కి కాల్ చేసిన రిషి వసుధార గురించి అడగాలని అనుకుని ఎక్కడున్నావ్ అని అడుగుతాడు.

  కడుపుమంట

  కడుపుమంట

  మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ అయిపోయింది కదా రిటర్న్ వెళుతున్నాం అని గౌతమ్ అంటే వసు కార్లో ఉందో తెలుసుకునేందుకు రిషి పడుతున్న తాపత్రయం చూసి కాసేపు ఆడుకోవాలని అనుకుంటాడు గౌతమ్. నేను కూడా మీరు వెళ్లిన ఏరియాకు వచ్చారా, అన్ని గ్రూప్స్ ని టచ్ చేస్తూ వెళ్ళాను. ఇంకా ఎవరైనా ఉండిపోయారా అంటే మేం అయితే బయలుదేరి పోయామని అంటాడు. రిషి ఏమో వసుధార గురించి తాపత్రయ పడుతున్నాడని తను సైకిల్ పై వెళ్లిపోయింది అంటాడ. తను అంటే వసుధారే కదా అని రిషి అంటే అవునని అంటాడు. మరోపక్క దేవయాని అన్న మాటలు తల్చుకుని జగతి తనలో తాను బాధ పడుతూ ఉంటుంది. దేవయాని అక్కయ్యలో కడుపుమంట రోజురోజుకీ పెరుగుతోంది.

  Venkaiah Naidu...నో మోర్ పాలిటిక్స్ అమ్మా *Politics | Telugu OneIndia
  మార్చుకునే రకం కాదు

  మార్చుకునే రకం కాదు

  బావ గారి ముందే ఇలా మాట్లాడుతోందంటే పరిస్థితి మరింత దారుణంగా తాయరయ్యేట్టుంది అనుకుంటూ ఉంటుంది జగతి. ఇక అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. కమింగ్ అప్ ఎపిసోడ్ లో చూపిస్తున్న దాని ప్రకారం సైకిల్ పాడవడంతో కూర్చుని బాగు చేసుకుంటుంది వసుధార. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి నేను ట్రై చేయనా అని అడుగుతాడు. కొద్దిసేపు క్యారెక్టర్ మార్చుకుందాం అన్న వసు.. రిషిగా మారి కారులో వెళదాం అని అడుగుతుంది. అయితే డానికి రిషి మాత్రం నేను మనసు, క్యారెక్టర్స్ మార్చుకునే రకం కాదు ఎప్పటికీ ఒకేలా ఉంటానంటూ చెప్పడంతో షాకవుతుంది.

  English summary
  Guppedantha Manasu Episode 484: Jagathi and Mahindra are upset as Devayani talks ill about them. Elsewhere, Gautham teases Rishi when he questions him about Vasudhara.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X