For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu : రిషి దగ్గర కుండబద్దలు కొట్టేసిన వసుధార .. కావాలంటే అలా చేయమంటూ!

  |

  స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. గత ఎపిసోడ్ లో వసుధార సహా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ స్లంస్ కి వెళ్లి అవగాహన కల్పించి వస్తారు. తరువాత ఇంటికి వచ్చాక ఈ విషయం మీద దేవయాని అనరాని మాటలు అంటుంది. ఇక తాజా ఎపిసోడ్లో దేవయాని అన్న మాటలు తల్చుకుని మహేంద్ర దగ్గర బాధపడుతుంది జగతి. దేవయాని అక్కయ్యలో కడుపుమంట రోజురోజుకీ పెరుగుతోందన్న ఆమె బావగారి ముందే ఇలా బయట పడింది అంటే ఆమె ఆలోచనలు ఇంకా ఎలాంటి వికృత రూపాలు తీసుకుంటాయో అని అనుమానం కలుగుతుంది అని అంటుంది జగతి.

   మోసాన్ని తట్టుకోలేడు

  మోసాన్ని తట్టుకోలేడు

  రిషిని నేను వదిలి వెళ్లానని, సాక్షి మోసం చేసిందని, వసు నో చెప్పిందని బాధపడుతున్నాడు, చివరికి దేవయాని అక్కయ్యది కూడా కపట ప్రేమే అని తెలిస్తే బంధాల మీద, మనుషుల మీద ఉన్న కాస్త నమ్మకం పోతుంది కదా అని అంటుంది. దానికి మహేంద్ర నీరు ప్రవహిస్తూ అన్ని మలినాలను కలుపుకుంటూ కొంత దూరం వెళ్లాక మలినాలు కిందకు చేరి స్వచ్ఛమైన నీరు ముందుకు సాగుతుందని, మనిషి జీవితం కూడా అలాంటిదేనని వేదాంతం చెబుతాడు. చెడ్డవాళ్లు మురికినీరులా అడుగుకి చేరుతారు, మంచివాళ్లు మనతో పాటు ప్రయాణం చేస్తారని అంటూనే దేవయాని వదిన తన నిజస్వరూపం ఎంత తొందరగా బయటపెడితే అంత మంచిదని అంటాడు. వదిన నిజస్వరూపం రిషికి తెలిస్తే ఆవిడ పరిస్థితి ఏంటో ఊహకు కూడా అందదని అంటాడు. దానికి జగతి దేవయాని అక్కయ్య ఓడిపోతుందని సంతోషించడం కాదని, ఇప్పటి వరకు గాయపడిన రిషి మనసు మళ్లీ ఇంకో మోసాన్ని తట్టుకోలేడు కదా అని బాధ పడుతూ ఉంటుంది.

  రిషిలా యాక్ట్ చేస్తూ

  రిషిలా యాక్ట్ చేస్తూ

  మరోపక్క రోడ్డు పక్కన సైకిల్ ఆపేసి చైన్ వేసుకుంటూ ఉంటుంది వసుధార. అదే దారిలో వెళుతున్న రిషి అది చూసి ఆగి నేను ట్రై చేయనా అడిగితే మీ వల్ల కాదు లెండి అంటుంటే నేను ఎండీని అని రిషి అంటాడు. మీరు కాలేజీ ఎండీ అని నాకు తెలుసు కానీ సైకిల్ కి, చైన్ కి తెలియదు కదా అని కౌంటర్ వేస్తుంది. ఈలోపు వసు ముఖానికి ఆయిల్ మరకలు అంటుకుంటే అది ఫోటో తీసి చూపిస్తాడు. ఇక మనం కాసేపు క్యారెక్టర్స్ మార్చుకుందామన్న వసు మాటలకు రిషి: నేను మనసు, క్యారెక్టర్స్ మార్చుకునేవాడిని కాదని అంటాడు. దానికి వసు కాసేపు అలా అనుకుందాం సార్..అంటూ... రిషిలా యాక్ట్ చేస్తూ తన కారులో సైకిల్ ఎక్కించమని చెప్పినట్టు చెప్పి తీసుకు వెళుతుంది.

  టీ తాగేసి వెళుతుండగా

  టీ తాగేసి వెళుతుండగా

  అలా బయలుదేరక వసు తిరిగి తిరిగి తలనొప్పిగా ఉంది ఎక్కడైనా ఆపితే టీ తాగుదాం సార్ అంటే ఓ టీ కొట్టు దగ్గర ఆపుతాడు రిషి. రెండు స్పెషల్ టీ చెప్పి బిస్కెట్స్ ఉన్నాయా అంటే షాపతను లేవనడంతో అతనికి క్లాస్ పీకుతుంది. ఇక వేడి టీ పట్టుకుని హడావుడిగా వెళ్లి రిషికి ఇవ్వడంతో నిన్నెవరు తెమ్మన్నారు అతను ఇస్తాడు కదా అంటే నేనే మీకిద్దామని అని అంటుంది. టీ తాగేసి వెళుతుండగా రిషి సార్ లిఫ్ట్ ఇవ్వరేమో అనుకున్నానని అనుకుంటుంది వసుధార. మీ పక్కన కార్లో కూర్చుంటే ఎంతో బాగుంటుంది అనుకుంటూ, ప్రశాంతంగా బాగుంది కదా అని బయటకు అనేయడంతో రిషి ఆశ్చర్య పడతాడు. ఇక ఇంటికి వచ్చిన రిషికి ఎదురుగా మహేంద్ర నిల్చుని ఉండడంతో ఎక్కడికి వెళ్లావ్, నీ మూడ్ ఎలా ఉంది అని అడగొద్దు డాడ్ అని అనడంతో మహేంద్ర నన్ను అడగొద్దు అన్నావ్ నువ్వు నన్ను అడుగుతావా అని అంటాడు.

  పశ్చాత్తాప పడుతుందా

  పశ్చాత్తాప పడుతుందా


  దానికి రిషి భోజనం చేశారా అంటే లేదు నీకోసమే వెయిట్ చేస్తున్నానని అంటాడు మహేంద్ర. జగతి మరోపక్క డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సిద్దం చేస్తుంటే వచ్చి జగతి చేతిలో ప్లేట్ లాక్కుని, ఆకలి మీద వస్తున్నాడు నువ్వు వడ్డిస్తే తింటాడో తినడో తెలియదు..నువ్వు పక్కకు జరిగితే కనీసం కడుపునిండా అయినా భోజనం చేస్తాడని అంటుంది. జగతి కొడుకు తింటే చాలని ఏమీ మాట్లాడకుండా ఆగిపోతుంది. ఇక ఈ క్రమంలోనే దేవయాని సాక్షి నా దగ్గర చాలా ఫీలవుతోంది రిషి అని అనడంతో జగతి ఆమె చేసిన దానికి పశ్చాత్తాప పడుతుందా అని అడుగుతుంది.

  Recommended Video

  Sammathame,Chor Bazaar Movie Review | Kiran Abbavaram | Akash Puri *Reviews |FilmiBeat Telugu
  మాట్లాడటం లేదు

  మాట్లాడటం లేదు

  దీంతో దేవయాని కాదు నాన్నా తను నీకు సారీ చెప్పాలనుకుంటుందని అంటే రిషి కోపంగా ప్లేట్ లో చేయి కడిగేసుకుని పెద్దమ్మా మీరంటే నాకు గౌరవం కానీ బ్లాక్ మెయిల్ , అబద్ధాలు చెప్పే అలాంటి వాళ్ళు అంటే నాకు అసహ్యం..సాక్షి ఏం చేసిందో మీకు తెలియదు, కుటుంబం పరువు తీసేలా మాట్లాడుతుంటే ఎలా ఊరుకుంటానని అంటాడు. ఇంకో సారి తన టాపిక్ మనింట్లో వినపడకూడదు పెద్దమ్మా అనేసి సీరియస్ గా వెళ్లి పోతాడు. అల తాజా ఎపిసోడ్ ముగిసింది. కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం వసుధార రిషికి టీ తీసుకొచ్చి ఇస్తుంది. నువ్వెందుకు తీసుకొచ్చావని అంటే మాట్లాడాలి అంటుంది. మీరు నాతో ఎప్పటిలా ఉండడం లేదు..నాతో మాట్లాడటం లేదు..నాపై కోపం ఉంటే డైరెక్ట్ గా తిట్టండి సార్ అంటుంది. రిషి షాకయ్యి చూస్తూ నిలబడడం కనిపిస్తోంది.

  English summary
  Guppedantha Manasu Episode 485: Jagathi and Mahindra are upset as Devayani talks ill about them. Elsewhere, Gautham teases Rishi when he questions him about Vasudhara.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X