twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu : కారు ప్రయాణమే ఇలా ఉంటే, జీవితం అంతా ఎలా ఉంటుందో.. వసుధార ప్రేమ ఊసులు

    |

    గుప్పెడంత మనసు సీరియల్ ను ఆసక్తికరంగా మలుచుతున్నారు మేకర్స్. కొద్దిరోజుల కృతం రిషి ప్రేమను వద్దన్న వసుధారకు రిషి మీద ప్రేమ కలుగుతుంది. అయితే ఆ విషయాన్ని బయట పెట్టాలా? వద్దా అనే ఆలోచనలో పడుతుంది. అలా సాగుతూ ఉండగా గత ఎపిసోడ్ లో రిషి దగ్గర సాక్షి గురించి మాట్లాడిన దేవయానికి వార్నింగ్ ఇచ్చిన రిషి, తినే కంచంలో చేయి కడిగేసుకుని వెళ్లిపోవడం చూపించారు. ఇక తాజా ఎపిసోడ్లో కొడుకు తినకుండా వెళ్లి పోవడంతో మహేంద్ర కూడా తినడం ఆపేస్తాడు.

    దేవయానితో మాట్లాడుతూ వదినా ఒకసారి రెండు సార్లు మాత్రమే చేపలు గాలానికి చిక్కుతాయి అది ఎప్పటికీ జరగదని అంటాడు. సాక్షిని ఇంటికి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు అది జరగదని అంటే జగతి కూడా సాక్షిని ఇంటికి తీసుకొచ్చినా మేం అడ్డుకుంటాం...నా కొడుకుని కడుపునిండా తినకుండా చేశారు..థాంక్స్ అని అంటుంది. అయితే దేవయాని షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది.

    అవకాశం ఇస్తే కాదనుకున్నా

    అవకాశం ఇస్తే కాదనుకున్నా

    ఇక మరోపక్క వసుధార రిషి తనకు లిఫ్ట్ ఇచ్చిన విషయం గుర్తుచేసుకుని మురిసిపోతూ...నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ సార్ అని మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ చూసిన రిషి, ఆమె దూరంగా ఉండే భరించలేను, దగ్గరకు వస్తే సహించలేను. ఎదురుగా వస్తే చూడలేను అలా అని చూడకుండా ఉండలేను, ఆమె మీద కోపం ప్రేమ రెండు తగ్గడం లేదు...ఏంటీ పరిస్థితి అని ఆలోచనలో పడతాడు. ఈ క్రమంలో వసు సైకిల్ ని చూస్తూ నువ్వు టైమ్ కి ఆగిపోయావని తిట్టుకున్నాను కానీ టైమ్ కి రిషి సార్ తో కలిసి నీ వల్లే ప్రయాణించానని అంటుంది. కార్లోనే ప్రయాణం ఇంత బాగుంది కదా, ఇక జీవితాంతం ప్రయాణిస్తే ఎంత బాగుంటుందో.. అని అనుకుంటూ రిశి తనకు ప్రపోజ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని, మీరు అందమైన అవకాశం ఇస్తే కాదనుకున్నాను, ఇప్పుడు ఆకాశానికి వినిపించేలా సారీ చెప్పాలా అనుకుంటూ మళ్లీ మెసేజ్ చేస్తుంది.

    డైరెక్ట్ గా తిట్టండి

    డైరెక్ట్ గా తిట్టండి

    మీరు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాను మీరు రిప్లై ఇవ్వలేదని అంటే, రిషి నీ ప్లేస్ లో ఎవ్వరున్నా నేను అదే చేస్తానని అంటాడు. దానికి ప్రపంచంలో కొన్నింటి ప్లేస్ లు రీప్లేస్ చేయలేం...నా ప్లేస్ ఏంటో నాకు తెలుసని అనడంతో ఈమేంటి ప్లేసులు అంటుంది? అనుకుంటూ, ఈ మెసేజ్ కి అర్థం ఏంటి అనుకుంటూ ఆలోచనలో పడతాడు. మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీలో రిషి కనిపించగానే వసు వచ్చి మీరు నాతో ఎప్పటిలా మాట్లాడడం లేదు, కోపం ఉంటే డైరెక్ట్ గా తిట్టండి, పడతాను కానీ ఇలా మాట్లాడకుండా ఇవ్వవద్దని అంటుంది. రిషి ఏమో వసుధారా నాకు పని ఉంది బై అనేసి వెళ్లిపోబోతే, ఏదో మనసులో పెట్టుకుని ఇంకోలా మాట్లాడటం సరికాదని అంటుంది.

    సాహసాలు చేయొద్దని

    సాహసాలు చేయొద్దని

    అప్పుడే కాలేజీకి వచ్చిన మహేంద్ర, ఎక్కడా రిషిధార కనిపించడం లేదేంటి జగతి అనడంతో ఆ మాట విన్న రిషి, డాడ్ ఏం మాట్లాడుతున్నారు అని అంటూనే మీరు అవసరం అయిన దానికన్నా ఎక్కువ ఆలోచిస్తున్నారని అంటాడు. ఇక మీ స్టూడెంట్ కి ఓ మాట చెప్పండి జగతి మేడం అంటే ఎవరూ? రమ్య, షీలా, పుష్ప అంటూ కాసేపు అందరిపెర్లు చెప్పి ఆటపట్టించి అప్పుడు వసు గురించా సరే చెబుతానని అంటుంది. దానికి రిషి: తను ఈ మధ్య తన జీవిత లక్ష్యాన్ని పట్టించుకున్నట్లు లేదు..ఆ విషయం చెప్పండని అంటాడు. అంతేనా రిషి...ఇంకేమైనా చెప్పాలా గుర్తుచేసుకోండని అంటే స్లమ్ విజిట్ కి సైకిల్ పై వెళ్లాలా? ఆమెకు ధైర్యం ఎక్కువే కానీ అనవసరమైన సాహసాలు చేయొద్దని చెప్పండని చెప్పి వెళ్తాడు.

    సీరియస్ అవడంతో

    సీరియస్ అవడంతో

    ఇంతలో వసుధార అక్కడికి రావడంతో, ప్రాజెక్టుకి సంబంధించిన పని పూర్తిచేస్తావా అంటే, వసు మెయిల్ పెట్టమంటారా అని అడుగుతుంది. దానికి జగతి రిషి సార్ కి వివరంగా చెప్పు...మినిస్టర్ గారికి డైరెక్ట్ గా పంపితే బాగోదని అంటుంది. ఈ క్రమంలో వసు ఆ ఫైల్ తీసుకుని రిషి సార్ మూడ్ ఎలా ఉందో ఏంటో ఇప్పుడు ఏమంటారో? అనుకుంటూ వెళుతుంటుంది. ఇంతలో కాఫీ తీసుకెళుతున్న ప్యూన్ దగ్గర్నుంచి కాఫీ తీసుకుని రిషి దగ్గరకు వెళ్తుంది. వసు వచ్చిన విషయం గమనించకుండా రిషి మంచి నీళ్ళు తాగి తరువాత వసుధారని చూస్తాడు. నువ్వెందుకు కాఫీ తెచ్చావని అడిగితే మాట్లాడాలి సార్ అందుకే తెచ్చానని అంటుంది. అయితే రిషి సీరియస్ అవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

    రిషి ఫోటో తీసి

    రిషి ఫోటో తీసి

    ఇక మరోపక్క దేవయాని మహేంద్ర-జగతి కళ్లలో కాన్ఫిడెన్స్ కనిపిస్తోందని, అది నా ప్రశాంతతని దెబ్బతీస్తోందని అనుకుంటుంది. రిషి-వసు మధ్య ఏం జరిగిందో తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నారని ఆలోచిస్తూనే, లైబ్రరీలో సాక్షి అంత గొడవ చేసినా సాక్షిని ఎందుకు నిలదీయలేదు, తెలియనట్టు ఎందుకు ఉన్నారు? అంటూ ఆలోచనలో ఉంటుంది. ఇక అలా తాజా ఎపిసోడ్ ముగించారు. కమింగ్ అప్లో చూపిస్తున్న దాని ప్రకారం కారులో వెళుతున్న క్రమంలో సార్ మీరెప్పుడైనా మూకీ సినిమాలుచూశారా...మన ప్రయాణం కూడా అలాగే ఉంది సార్ అంటుంది వసుధార. కారు ఓ పక్కన ఆపి ఒక మంచి పుచ్చకాయ ఇమ్మంటే ఏంటీ బేరాలు లేవా అని రిషి అంటే డబ్బులు మీరిచ్చేటప్పుడు నేనెందుకు బేరం ఆడటం అంటుంది. అయితే క్లారిటీ బాగానే ఉందంటాడు రిషి. తరువాత రిషి ఫోటో తీసి బుగ్గమీద అంటుకుందని చూపిస్తుంది.

    English summary
    Guppedantha Manasu Episode 486: Mahindra and Jagathi warn Devayani to mend her ways. Elsewhere, Rishi scolds Vasudhara for trying to talk with him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X