Guppedantha Manasu : అమ్మవారి సాక్షిగా వసుధార - రిషి మధ్య ప్రేమ కొలిక్కి?
గుప్పెడంత మనసు సీరియల్లో ఇప్పుడు వసుధార - రిషి మధ్య ప్రేమ సన్నివేశాలు ఎక్కువగా చూపిస్తున్నారు. రిషి కాదని తప్పు చేశానని భావిస్తున్న వసుధార అతనిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అలా గత ఎపిసోడ్స్ జరగగా ఇక తాజాగా వసు, రిషి మినిస్టర్ ని కలిసి వెళుతూ దారిలో ఆగడంతో ఫ్రూట్స్ తినాలని అనుకుంటుంటారు. అలా పుచ్చకాయ తింటూ ఉండగా కాస్త సరదా సంభాషణలు జరుగుతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరతారు కూడా.

నిజం ఎప్పుడైనా బాధపెట్టేదే
అయితే మరోపక్క జగతి తనలో తానే నవ్వుకుంటుండడంతో ఏంటి మేడం మీరే నవ్వుకుంటున్నారు మాక్కూడా చెప్పమని మహేంద్ర అంటే ఏం లేదు మహేంద్ర వాళ్లిద్దరూ కలిసి ఉంటున్నారు, అదే ఆనందంగా ఉందంటుంది ఆమె. దానికి మహేంద్ర ఆనంద పడకు జగతి..మన రిషి దేన్నీ అంత తేలిగ్గా దేన్నీ మర్చిపోడు.
నీ విషయం తీసుకుంటే ఆ కోపాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు కదా అంటే, జగతి కూడా అవును మహేంద్ర నేనే పిచ్చిదాన్ని...మనసు మార్చుకుంటాడేమో, నాపై ప్రేమ కలుగుతుందేమో అని ఆశపడుతూ ఎదురుచూస్తున్నానని అంటుంది. ఆమె బాధ పడుతుంటే నిజం చెప్పాలనే ప్రయత్నించాను కానీ నిన్ను బాధపెట్టాలని కాదని అనడంతో, నిజం ఎప్పుడైనా బాధపెట్టేదే అవుతుందని ఆమె అంటుంది.

ఎన్నిసార్లు చదివినా కొత్తగా
కట్ చేస్తే రూమ్ లో ఉన్న వసుధార రిషి రాసిన ప్రేమలేఖ, గీసి ఇచ్చిన బొమ్మను చూసి మురిసి పోతుంటుంది. మీకు ఇంత అందంగా ప్రేమలేఖ రాయడం వచ్చా? అని అనుకుంటూ అన్నీ బాగున్నాయి కానీ మీ కోపమే విచిత్రమైనదని అనుకుంటూ ఉంటుంది. అయినా మీ కోపం కూడా ఈ మధ్య నాకు నచ్చుతోందని అంటూ, ఈ మధ్య మీరేం చేసినా నచ్చుతోందని, తిడితే కోపం అసలు రావడం లేదని అనుకుంటుంది. ఏంటీ రిషి సార్ నా చేతుల్లోంచి జారిపోవాలని చూస్తున్నారా, మిమ్మల్ని నేను పోనివ్వను కదా ...ఈ ప్రేమ లేఖలో ఏముందో తెలియదు కానీ ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుందని అంటూ ఉంటుంది.

స్విచ్చాఫ్
రిషి సార్ కి కాల్ చేస్తా అనుకుంటూ కాల్ చేయగా రిషి ఆ కాల్ కట్ చేసి వెనక్కు తిరగ్గానే ఎదురుగా వసుధార కనిపిస్తుంది. ఏంటి కాల్ కట్ చేస్తారు, ఇది కరెక్ట్ కాదు కదా ఏంటి చూస్తున్నారు సమాధానం చెప్పండి అని అడిగినట్టు భ్రమ కలుగుతుంది. నా ప్రేమ నీకు భయం కలిగిస్తోంది అన్నావ్ కదా, నీ ఫోన్ అటెండ్ చేయాలంటే నాక్కూడా భయం వేస్తోందని, బంధం లేదన్నావ్, ప్రేమ కాదన్నావ్, క్లారిటీ లేదన్నావ్...ఇవన్నీ మర్చిపోయిన ఎప్పటిలా ఎలా కలిసి పోగలను, ఎప్పటిలా ఎలా మాట్లాడగలనని అనుకుంటూ ఉండగా వసు నుంచి మళ్ళీ కాల్ రావడం చూసి స్విచ్చాఫ్ చేస్తాడు. ఇక దీంతో వసుధార మీరు ఫోన్ మాత్రమే ఆఫ్ చేసి పెట్టుకోగలరు...మనసుని కాదని అనుకుంటుంది.

చేయి వదిలేసి
కాలేజీలో కారు దిగి లోపలకు వెళుతుండగా రిషికి కాల్ వస్తుంది. మాట్లాడుతూ థ్యాంక్యూ చెప్పి, వసుధార రియల్లీ గ్రేట్, స్కాలర్ షిప్ టెస్టులో వసుధార టాప్ అని అనుకుంటూ మురిసిపోతాడు. వసుధార కంగ్రాట్స్ అని చేయి పట్టుకుని సంతోషంగా చెప్పడంతో విషయం తెలియని ఆమె దేనికి సార్ అని అడుగుతుంది. దానికి స్కాలర్ షిప్ టెస్టులో వసు టాప్ లో ఉంది అని చెబుతాడు. ఎన్ని మార్కులు అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ ఇప్పుడే కాల్ వచ్చిందని అంటూ మొత్తానికి సాధించావ్ అని కంగ్రాట్స్ చెబుతాడు. దానికి వసుధార సంతోషంగా ఇదంతా మీ హెల్ప్ వల్లే అయింది..అంతా మీ పుణ్యమే సార్ , ఆ రోజు మీరు నాకు అడుగడుగునా వెంటే ఉన్నారు అంటుంటే రిషికి తనను రిజెక్ట్ చేసిన విషయం గుర్తొచ్చి చేయి వదిలేసి వెళ్లిపోతాడు.

నాకేం తెలియకపోవచ్చని
అయితే వసుకు ఫస్ట్ రావడంతో స్టాఫ్ అంతా సంతోషంగా ఉంటారు. వసు గురించి అంతా జగతిని పొగుడుతారు. ఒకప్పుడు వసుధార నా స్టూడెంట్ కానీ ఇప్పుడు రిషి సార్ స్టూడెంట్ అని తను గెలిచినా ఓడినా అన్నీ రిషికే చెందుతాయని, అంటే రిషి సార్ వసుపై స్పెషల్ కేర్ తీసుకున్నాడని మహేంద్ర అంటాడు.
ఇదంతా విన్న రిషి...నేను గెలిచి ఓడానా, ఓడిపోయిన గెలిచానా అనుకుంటూ వెళ్లిపోతాడు. అక్కడి నుంచి రిషి అమ్మవారి గుడి దగ్గరకు వెళతాడు. అమ్మా నువ్వు నా మాట వింటావ్, నా మనసు తెలుసుకుంటావు, గతంలో ఓసారి నీ దగ్గరకు వచ్చి నా మనసులో బాధ చెప్పుకున్నాను, ఇప్పుడు తన మనసులో ఏముందో తెలియదు కానీ ఏదో చెప్పేసింది, నేను లేను అనేసింది కానీ నాకేం తెలియకపోవచ్చని అంటాడు.

కొలిక్కి వచ్చే అవకాశం
కానీ నీకు అన్నీ తెలుసు..గంపంత కళ్లతో అన్నీ చూస్తుంటావ్ అంటారు.. ఏం చేయాలని ఉందో నువ్వే చేసేసెయ్ నేను అడగలేను నా మనసేమిటో నీకు తెలుసు కదా అంటాడు. ఇక అలా మాట్లాడుతూ ఉండగా తాజా ఎపిసోడ్ ముగించారు. ఇక కమింగ్ అప్లో చూపిస్తున్న దాని ప్రకారం తనని నువ్వే కాపాడాలి...తనని నువ్వే నడిపించాలని, వసుధార పేరు పసుపుతో రాస్తాడు. మరోవైపు వసుధార కూడా అదే అమ్మవారికి మొక్కుకుని ... రిషి సార్ లేకపోతే నేను లేను నా విజయం లేదంటూ కుంకుమతో రిషి పేరు రాస్తున్నట్టు చూపడంతో త్వరలో వీరి ప్రేమ ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











