Guppedantha Manasu : వసుధారకు సన్మానం - మిస్సయిన రిషి.. ఆ గుర్తులు వద్దంటూ!
గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రస్తుతానికి రిషి వసుధారా మధ్య ప్రేమను ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. రిషిని రిజెక్ట్ చేసిన వసుధార మళ్ళీ అతని ప్రేమను అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. తాజా ఎపిసోడ్లో వసుధార స్కూల్ షిప్ టెస్టులో ఫస్ట్ ప్లేస్ కొట్టడంతో అంతా సరదా సరదాగా సాగిపోయింది. ఇక నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వసుధార కూడా
ఇక స్కాలర్ షిప్ టెస్టులో వసుధార మొదటి స్థానం దక్కించుకోవడంతో ఆమెకు కంగ్రాట్స్ చెప్పేసి...అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. అక్కడి నుంచి అమ్మవారి దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టుకున్న రిషి, నా మనసేమిటో నీకు తెలుసు నాకేం కావాలో నీకు తెలుసు నువ్వు చెయ్, వసుధార ఎన్నో కష్టాలతో ఇంట్లోంచి బయటకు వచ్చి చదువులో గెలిచింది, జీవితంలో ఓడిందో, గెలిచిందో తెలియదు కానీ తనని నువ్వే నడిపించమని అంటారు. ఇప్పటి వరకూ చదువులో అండగా నిలిచావని, ఇకపై కూడా నువ్వే నడిపించాలి అంటూ అమ్మవారి ముందు పసుపుతో వసుధార అని పేరు రాస్తాడు రిషి. అమ్మా తనని నువ్వే కాపాడాలి అని పదే పదే కోరుకుంటూ అక్కడి నుంచి రిషి వెళ్లగానే వసుధార కూడా అక్కడికి వస్తుంది.

రిషి కార్ హారన్
ఇక వసుధార కూడా అమ్మవారిని మొక్కుకుంటూ ఈ విజయం ఎవరిదో నీకు తెలుసు, రిషి సార్ లేకపోతే నేను లేను, ఈ విజయం లేదు.. జగతి మేడం ఇక్కడకు తీసుకొచ్చారు, రిషి సార్ ధైర్యం ఇచ్చారని జరిగిన అన్ని విషయాలు గుర్తు చేసుకుంటారు. నా మనసులో ఏముందో నీకు తెలుసు, అవునా కాదా అనే మేఘాలు కరిగిపోయాయన్న ఆమె నా మనసు నిర్మలంగా ఉంది, మిగిలిన ధైర్యం నువ్వే ఇవ్వాలని అంటుంది. నన్నే మారుస్తావో రిషి సార్ ని మారుస్తావో ఏం చేసినా అంతా నీ దయ అమ్మా అని దణ్ణం పెట్టుకుని ప్రదక్షిణ చేసి రావడంతో రిషి సార్ కి నాపై కోపం పోవాలని కోరుకుంటూ కుంకుమతో రిషి పేరు అక్కడ రాస్తుంది. కుంకుమ అయ్యవారికి ప్రతిరూపం, పసుపు అమ్మవారికి ప్రతిరూపం అంటారు కదా..ఈ కుంకుమతో నా విజయాన్ని రిషి సార్ కి అంకితం చేస్తున్నా అంటూ ఆయనకు ఎలాగైనా నాపై కోపం పోయేలా నువ్వే చూడాలని అనుకుంటే, ఇంతలో రిషి కార్ హారన్ వినిపిస్తుంది. అంటే ఆయన వచ్చి వెళ్లారా అనుకుంటూ ఆలోచిస్తుంది.

కంగారు పడ్డానని
మరోపక్క రిషి క్యాబిన్లో వెయిట్ చేస్తున్న మహేంద్ర...కొడుక్కి కాల్ చేసి, కాల్ లిఫ్ట్ చేయని వారి పని చెబుతాను అనుకుంటే రిషి కాల్ కట్ చేస్తాడు, మళ్లీ కాల్ చేసిన మహేంద్ర ఏదో చెప్పేలోగా నేను మళ్లీ కాల్ చేస్తానని చెప్పి కట్ చేస్తాడు. కట్ చేస్తే రిషి ఇంట్లో అంతా వసుధార గురించి మాట్లాడుకుంటూ ఉండడంతో వసుధార ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మన కాలేజీకి మంచి పేరొచ్చిందని ఫణీంద్ర అంటారు. రిషి కృషి దీనికి కారణం అని జగతి అంటుంటే దేవయాని వచ్చి అందరూ వసుధార భజన చేస్తున్నారే కానీ రిషి గురించి ఒక్కరైనా ఆలోచిస్తున్నారా రిషి ఇంకా ఇంటికి రాలేదు మీకెవరకీ పట్టదా అంటూ ఉండగానే రిషి రావడంతో నువ్వెక్కడి వెళ్లావో అని కంగారు పడ్డానని అంటుంది.

ఆవకాయన్నం కలిపి
వసుధార అభినందన సభ గ్రాండ్ గా చేద్దామంటున్నారు పెదనాన్న అని రిషికి గౌతమ్ చెబుతాడు. అయితే దేవయాని ఇంట్లో వసుధార తన పేరు మాట్లాడొద్దు ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది. దేవయాని ఒక్కరికి కూడా నీపై ప్రేమ లేదని, అందరూ వసుధార గురించే మాట్లాడుతున్నారని అంటుంది. తనేదో సాధించింది అంటున్నారు కానీ అంతా నీ గొప్పతనమే కదా, ఈ మాత్రం దానికే సభలు సన్మానాలు అవసరమా అని అంటే రిషి వసుధారని సన్మానించడం తప్పేముంది, ఇందులో ఎలాంటి మార్పు లేదు పెద్దమ్మా అని అనడంతో రిషి, ఈ మధ్య నా మాటల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు ఇప్పుడు కనుక జాగ్రత్త పడకపోతే మొత్తానికి చేయి జారిపోయేలా ఉన్నాడని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక మరోపక్క వసుధార ఏమో తన రూమ్ బయట పిల్లలకు ఆవకాయన్నం కలిపి చేతిలో పెడుతూ ఆవకాయ గురించి చెబుతూ ఉండడంతో పక్కనే కూర్చుని రిషి కూడా నాకు పెట్టమని అడుగుతున్నట్టు భ్రమ కలుగుతుంది.
Recommended Video


పాత సంగతులు అన్నీ
ఇక ఉదయాన్నే రిషి-గౌతమ్-ధరణి ముగ్గురూ వసు రూమ్ దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్న సమయంలో అసలు వసుధార ఇక్కడ ఉంటోందా అని అడుగుతూ ధరణి బాధపడుతుంది, అవునని చెబుతూ గౌతమ్ వెళ్లి ఆమె డోర్ కొట్టి చూడగా ఆమె లోపల ఉండదు, దీంతో ఆమె కోసం ఎదురుచూస్తూ ఉండడంతో నీళ్లబిందె మోసుకుంటూ వస్తుంది. ధరణి స్కాలర్ షిప్ టెస్టులో టాప్ ర్యాంక్ వచ్చినందుకు అభినందించేందుకు వచ్చిన మనం వసుని ఇలా చూస్తాం అనుకోలేదని అంటూ ఉండగా అక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. రిషి కారు వెళ్లిపోతుండగా వసు కారు వెనుక పరిగెడుతూ ప్రోగ్రాం మొదలవుతోంది కదా ఇప్పుడు వెళ్లిపోతున్నారేంటి అని అంటూ ఉండగా నేను ఇప్పుడు ఉంటే నాకు పాత సంగతులు అన్నీ గుర్తు వస్తాయని అనుకుంటాడు.


Click it and Unblock the Notifications











