For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: అభినందన సభలో రిషి పరువు తీసిన సాక్షి.. ఆ వీడియోలు బట్ట బయలు!

  |

  గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. టాలెంట్ టెస్ట్ లో మొదటి స్థానం దక్కించుకున్న వసుధారని అభినందించేందుకు వెళతారు రిషి, గౌతమ్, ధరణి. అక్కడ ఆమె బాధలు చూసిన ధరణి చాలా బాధ పడుతున్నట్టు గడిచిన ఎపిసోడ్ లో చూపించారు. ఇక తాజా ఎపిసోడ్ లో వసుధారకి రిషి, గౌతమ్, ధరణి స్వీట్స్ ఇస్తారు. గౌతమ్ సరదాగా ఇంటర్యూ చేస్తున్నట్టు మీ స్పందన ఏమిటి అని అడుగుతాడు.

  తరువాత ఏంటి మీ రూమ్ కి వస్తే మర్యాదలు చేయవా అని అడగడంతో పాటు స్నాక్స్ ఏమీ పెట్టవా అనగానే వాళ్లిచ్చిన స్వీట్సే వాళ్లకు పెడుతుంది. ఇక వెళుతూ ఉండగా బిందె జాగ్రత్త అని చెప్పండి అన్న రిషితో..బిందె జాగ్రత్త ఏంట్రా అని గౌతమ్ అంటే, పరీక్ష రాయాల్సిన చేతులు అలా నీళ్లు మోయడం ఏంటి అని అంటాడు. అలా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు

  దేవయాని దెప్పిపొడుపులు

  దేవయాని దెప్పిపొడుపులు

  కట్ చేస్తే ఫణీంద్ర హ్యాపీగా మాట్లాడుతున్న క్రమంలో ఏంటో అంత ఆనందం, నాక్కూడా చెబితే సంతోషిస్తాను కదా అంటుంది దేవయాని. దానికి ఫణీంద్ర కొన్ని గుడ్ న్యూస్ లు నీకు చెబితే సంతోషించలేవు అందుకే చెప్పడం లేదు అనడంతో, మీరెందుకు ఇంట్లో అందర్నీ ఒకలా చూస్తారు, కానీ నన్ను మరోలా చూస్తారని అంటుంది.

  అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిషి, గౌతమ్, ధరణిని చూసిన దేవయాని ఏంటి ధరణి చెప్పా చేయకుండా బయటకు వెళ్లావని అంటే... నేనే వదినను బయటకు తీసుకు వెళ్లాను అంటాడు రిషి. తనతో ఏం పని రిషి అంటే వసు ఇంటికి తీసుకు వెళ్లానని అంటాడు.

  దానికి దేవయాని వసుకి సన్మానం అయితే ఆమెకేమి పని అంటే అవసరమైన చర్చలకు తావు ఇవ్వకుండా అలా చేశానని అంటాడు. ఇక వసు విజయం వెనుక రిషి ఉన్నాడని గౌతమ్ అంటే అందరి విజయం వెనుకూ ఉంటాడు కానీ తనే ఓడిపోయాడు అనుకుంటూ ఊర్లో వాళ్ల విజయాలను నెత్తికెక్కించుకోవడం అవసరమా అని దెప్పి పొడిచే ప్రయత్నం చేస్తుంది.

  రిషి షాకింగ్ ఆన్సర్

  రిషి షాకింగ్ ఆన్సర్

  తరువాత డీబీఎస్టీ కాలేజీకి మంచి పేరు వస్తుందని తెలిసికూడా అలా అంటావేంటి అని అంటూ ఫణీంద్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే కాలేజీలో సన్మానం నాలుగు గోడమ మధ్య ఉండిపోతుంది.. బస్తీలో సన్మానం చేస్తే అందరికీ తెలుస్తుందని అంటే నాకు మాత్రం సమాధానం బాగా చెబుతారు లెండి... ఈమాత్రం దానికి ధరణి కూడా అవసరమా అని అంటే, దానికి నేను ఒక్కడినే వెళ్లి మాట్లాడితే కొత్త చర్చకు అవకాశం ఇచ్చినట్టువుతుంది అని అందుకే వదినను తీసుకెళ్లానని వివరంగా చెబుతాడు.

  అలా చెప్పడంతో నువ్వు చాలా గొప్పగా ఆలోచిస్తావ్ రిషి అనుకుంటుంది ధరణి. ఇక ఈ సన్మానం గురించి కాలేజీలో మీటింగ్ పెట్టుకుందాం పెదనాన్న అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

  మర్చిపోయారా?

  మర్చిపోయారా?

  రానున్న రోజుల్లో వసుధార మరిన్ని అద్భుతాలు చేస్తుందని గౌతమ్ అంటే దానికి దేవయాని చెట్టుకాయని కాదు చెట్టుని మెచ్చుకోవాలి కదా అంటుంది. దానికి ఫణీంద్ర: నేను చెప్పేది అదే అని వసు విజయం వెనుక డీబీఎస్టీ కాలేజీ ఉందనే చెబుతున్నానని అంటాడు. అటు కాలేజీలో వసుకి అభినందన సభ పెడుతూ నోటీస్ పెడితే వసు ఏం చేసినా సన్మానం సత్కారం అంటారు వీళ్ళు ఎంటో అనుకుంటూ వాళ్ళు ముందుకు కదులుతూ. ఇంతలో వసు దగ్గరకు వచ్చిన పుష్ప కంగ్రాట్స్ చెబితే అసలు నేనేం సాధించాను చెప్పు ..అదేం పెద్ద గొప్ప కాదు కదా అంటుంది వసు. ఏమో అబ్బా నీ అభినందన సభ ఏర్పాట్లన్నీ రిషి సార్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారంట అంటుంది పుష్ప.

  అందరికీ స్ఫూర్తి

  అందరికీ స్ఫూర్తి

  అభినందన సభ చేయాలన్న ఆలోచన కూడా రిషి సార్ దే అంట అంటుంది. అంటే సీరియస్ సింహానికి నాపై కోపం పోయిందా..కోపం ఉండి ఉంటే ఎందుకు ఇదంతా చేస్తారులే అనుకుంటుంది వసు. ఇక మరో పక్క రిషి...అభినందన సభను భారీగా చేయాల్సిన అవసరం లేదు సింపిల్ గా చేద్దాం అని మహేంద్ర-జగతితో చెబుతాడు. వసు సాధించిన విజయాన్ని గొప్పగా ప్రచారం చేయకూడదు అలా అని చిన్నగా చూడకూడదు... అందరికీ స్ఫూర్తినిచ్చేలా చేస్తే బాగుంటుంది అని అంటాడు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు గౌతమ్ చూసుకుంటున్నాడు మీరు తనకి హెల్ప్ చేయండి మేడం అని అంటే జగతి: సరే సార్ అంటుంది.

  Recommended Video

  పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
  షాక్ ఇచ్చిన సాక్షి

  షాక్ ఇచ్చిన సాక్షి

  అప్పుడే జగతి వసుధార దగ్గరకు వెళితే ఆమె నాకు టెన్షన్ గా ఉంది మేడం ఇదంతా అవసరమా అని అడుగుతుంది. ఇది నీకు గౌరవం, చాలా మందికి స్ఫూర్తి అని జగతి చెబుతుంది. అప్పుడే రిషి కారు స్టార్ట్ చేసుకుని వెళ్లడానికి చూడడంతో కారు ఆపిన మహేంద్ర..ఇప్పుడెక్కడికి వెళుతున్నావ్ అని అడుగుతాడు.

  బయటకు ఏం సమాధానం చెప్పని రిషి లోపల మాత్రం స్కాలర్ షిప్ టెస్ట్ గుర్తొస్తే వసు నన్ను రిజెక్ట్ చేసిన విషయం కళ్లముందు కనిపిస్తుంది అందుకే వెళుతున్నాను అనుకుంటాడు. బయటకి మాత్రం పని ఉండి వెళుతున్నాను, మీరు-పెదనాన్న-గౌతమ్ చూసుకోండి అనేసి వెళ్లిపోతాడు..ఇదంతా చూస్తున్న వసుధార, రిషి సార్ కావాలనే ఇక్కడ ఉండకూడదు అనే వెళుతున్నారు..ఇప్పుడెందుకు వెళుతున్నారు అనుకుంటుంది.

  అలా తాజా ఎపిసోడ్ ముగిసింది. కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం ఆ కార్యక్రమానికి హాజరైన సాక్షి వసు గొప్పతనాన్ని తెలిపే వీడియో ఉంది ప్లే చేయమంటారా అంటూ.. రిషిని వసు రిజెక్ట్ చేసిన వీడియో ప్లే చేస్తుంది. అది చూసి రిషి ఇది వసు చేయించింది ఏమో అని ఆమెపై ఫైర్ అవుతాడు.

  English summary
  Guppedantha Manasu Episode 490: all set for vasudhara's congratulation meet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X