Guppedantha Manasu: సాక్షికి ఎదురుతిరిగిన వసుధార.. ప్రేమ విషయంలో రిషికి అడ్డంగా దొరికికేసి?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వసుధార, రిషి మధ్య ప్రేమ వ్యవహారాన్ని హైలైట్ చేస్తున్నారు. వసుధారను ఒక స్కాలర్ షిప్ టెస్ట్ రాయించడం కోసం వేరే ఊరికి తీసుకు వెళ్లి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఆమె ఒప్పుకుంటుందనుకుంటే ఒప్పుకోకుండా షాక్ ఇస్తుంది. దీంతో రిషి దేవదాసు లాగా మారిపోయి ఇంట్లో అందరినీ టెన్షన్ పెడుతూ ఉంటాడు. ముందు జగతి వెళ్లి వసుధారను ఈ విషయం మీద ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అది విఫలం కావడంతో గౌతమ్ వెళ్లి వసుధారతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

రూమ్‌లో ఒంటరిగా
రిషి ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేశావని గౌతమ్ అడిగితే దానికి కఠినంగా సమాధానం చెబుతుంది వసుధార. రిషి స్థానంలో ఉండి ఆలోచించాలని గౌతమ్ రిక్వెస్ట్ చేయడంతో వసుధార వినిపించుకోకుండా తన మాటలు తాను చెబుతూ ఉంటుంది. ఇదంతా వింటున్న రిషి ఇక వెళ్లి పోదామని అనుకుంటూ ఉండగా రిషి చేతిలో ఫోన్ మోగుతుంది. ఇక అలా తమ మాటలు రిషి విన్నాడని గౌతమ్, వసుధారకు తెలుస్తుంది. ఇక గౌతమ్ వెనుకపడుతున్నా రిషి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. సీన్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. రాత్రి సమయంలో తన రూమ్‌లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఆ రుమ్‌కు జగతి వచ్చి, మాట్లాడాలని అంటే ఈ టైంలో నా దగ్గరకు వచ్చారంటే... మీరు ఏం మాట్లాడతారో నేను ఊహించగలను అని రిషి సిల్లీగా మాట్లాడతాడు. వసుధార ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అని జగతి చెబుతుండగా రిషి జరగాల్సిందేదో జరిగింది దాని గురించి వివరాలు, విశ్లేషణలు అవసరం లేదని తేల్చేస్తాడు.
Recommended Video


ధ్వేషించండి కానీ
నేను రిజెక్ట్ అవ్వడానికే పుట్టానని, చిన్నప్పుడు మీరు నన్ను రిజెక్ట్ చేసి వెళ్లిపోయారు. అందులో నా తప్పేంటో నాకు తెలియదు. మధ్యలో సాక్షి వచ్చి నిశ్చితార్ధం అయ్యాక తన ప్రయార్టీ నేను కాదని.. అసలు విషయం చెప్పింది. ఇప్పుడు వసుధార వంతు వచ్చింది అని అంటాడు. మీరే కదా, వసుధారను ప్రేమిస్తున్నావని రచ్చ చేశారు. నేను ఏం ఆలోచిస్తున్నానో... ఏం చేస్తున్నానో.. అంచనా వేయగలిగిన మీరు వసుధార మనసులో ఏముందో అంచనా వేయలేకపోయారు అని అంటాడు. దానికి జగతి ఆరోజు నీ మనసులో వసుధార పై ప్రేమ ఉందో లేదో తెలియదు... కానీ వసుధారపై ప్రేమ పుట్టడానికి నీకు టైం పట్టింది.. వసుధారకు అలాగే టైం పడుతుందని అంటుంది. వీలైతే నన్ను ధ్వేషించండి కానీ సానుభూతి మాత్రం చూపించకండి అని చెబుతాడు రిషి.

ఫోన్ చేయడం లేదని
ఇక అదే సమయంలో తన రూమ్‌లో రిషి గురించీ ఆలోచిస్తూ దీనంగా కూర్చుని ఉంటుంది వసుధార. ఈ క్రమంలోనే వసుధారకు రిషి, జగతి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఇదేంటి రిషి సార్ నాకు ఫోన్ చేయడం లేదని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. నాపై కోపం ఉంటే తిట్టడానికైనా ఫోన్ చేయొచ్చు కదా, మీ మనసులో ఉన్న మాట మీరు చెప్పారు... నా మనసులో ఉన్న మాట నేను చెప్పాను.. దానికే మన మధ్య ఉన్న అనుబంధం పోతుందా అని అనుకుంటుంది. ఈ సమయంలో రిషి కూడా వసు సారీ సార్.. అని ఫోన్ చేయవచ్చు. ఈ పొగరు ఏం చేస్తుంటుంది... అని ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార ఫోటో చూస్తూ ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా ఆమెకు ఫోన్ వెళుతుంది. ఈ సమయంలో ఫోన్ చూసి ఆనందంలో వసుధార మునిగిపోతుంది. అయితే వెంటనే ఫోన్ కట్ చేస్తాడు.

చున్నీ బయటకు
అదేంటో రిషి సార్ కాల్ కట్ చేశాడేంటి, అంటే నేను కాల్ చేయాలా సార్ మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు కాల్ చేయకూడదు అనుకుని కాల్ చేస్తుంది. అయితే వసుధార నుంచి కాల్ రావడం చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు. అనుకోకుండా... కాల్ వచ్చిందని... కాల్ చేయాలని చేయలేదని మెసేజ్ చేస్తాడు. దాన్ని చదివిన వసుధార.. రిషీ సార్‌కు ఇంకా కోపం పోలేదా అని బాధ పడుతుంది.ఇక కట్ చేస్తే ఉదయం కాలేజీకి ఆటోలో వెళుతూ వసుధార రిషి గురించి ఆలోచిస్తుంటుంది. అదే సమయంలో కారులో వెళ్తూ ఎదురుగా వెళ్తున్న ఆటోలో అమ్మాయి చున్నీ బయటకు వేలాడుతున్న విషయం చూసి ముందు జాగ్రత్త చెప్పబోయాడు. ఆటోలో ఉన్నది వసుధార అని తెలిసి ఆటో డ్రైవర్‌కు చెప్పి వెళ్లిపోతాడు.

ఎందుకంత టెన్షన్
ఇక కాలేజీకి వెళ్లిన వెంటనే పుష్ప ఎదురు పడుతుంది. ఇవాళ ఫస్ట్ క్లాస్ నేనే తీసుకుంటా, వసుధార వద్ద నోట్స్ తీసుకొని టేబుల్‌పై పెట్టమంటాడు రిషి. నేను మళ్ళీ మళ్ళీ అడగను వచ్చేలోపు టేబుల్‌పై నోట్స్ ఉండాలని వార్నింగ్ ఇస్తాడు రిషి. ఇక అక్కడితో తాజా ఎపిసోడ్ ముగించారు. రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం పరీక్ష హాల్ వద్ద కలిసిన వసుని సాక్షీ మళ్లీ కలుస్తుంది. ‘ఇంకా రిషి మనసులో నువ్వే ఉన్నావు..' అంటుంది సాక్షీ వసుతో. ‘అది నీ ప్రాబ్లం.. నా ప్రాబ్లం కాదు.. నువ్వు ఏం చేయగలవో అది చేసుకో..' అంటూ వసు గట్టిగానే సమాధానం ఇస్తుంది. రిషి క్లాస్‌కు వచ్చేసరికి వసుధార నోట్స్ టేబుల్‌పై ఉంటుంది. అందులో ఏదో పెట్టేసి మర్చిపోయిన వసుధార టెన్షన్ పడుతుంది. పక్కనే ఉన్న ఫ్రెండ్ పుష్ప అందులో ఏముంది ఎందుకంత టెన్షన్ అని అడుగుతుంది. అయితే అదేదో రిషి గురించి వసుధార రాసుకున్న ప్రేమ పలుకులు అయి ఉండవచ్చు.


Click it and Unblock the Notifications











