Guppedantha Manasu: సాక్షితో బయటకు వెళ్లిన రిషికి ఘోర రోడ్డు ప్రమాదం.. అసలు ఏమైందంటే?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. వసుధారను ఒక స్కాలర్ షిప్ టెస్ట్ రాయించడం కోసం వేరే ఊరికి తీసుకు వెళ్లి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఆమె ఒప్పుకుంటుందనుకుంటే ఒప్పుకోకుండా షాక్ ఇస్తుంది. దీంతో రిషి దేవదాసు లాగా మారిపోయి ఇంట్లో అందరినీ టెన్షన్ పెడుతూ ఉంటాడు. జగతి, గౌతమ్ వెళ్లి వసుధారతో ఈ విషయం మీద మాట్లాడి ఒక కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత ఎపిసోడ్ అంతా రిషి-వసుధార బాధలు చూపించారు. ఇక అలా గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

 పేజ్‌ను చించేసి

పేజ్‌ను చించేసి

రిషి కోసం తన బుక్ తీసుకువెళ్లి పుష్ప ఇచ్చిన సంగతి తెలుసుకుని వసుధార టెన్షన్ పడుతుంది. బుక్ అక్కడ ఎందుకు పెట్టవని ముందు పుష్పను తిడుతుంది. అందులో వసు సారీ రిషి సార్, సారీ సారీ అంటూ అనేక సార్లు సారీ అని రాసి ఉంటుంది. అయితే అది ఎక్కడ రిషి చూస్తాడో అని కంగారు పడుతుంది.

రిషి చూడక ముందే ఆ పేపర్ ను చించి వేద్దామని వెళ్తుంది కానీ ఇంతలో రిషి వచ్చేస్తాడు. దీంతో సైలెంట్ గా కూర్చుంటుంది. ఇక ఆ పేజ్‌ను రిషి చూడకూడదు చూడకూడదు అనుకుంటూ ఉండగానే రిషి అదే పేజ్ చూస్తాడు, చూసి ఏంటీ ఈ పొగరు ప్రేమ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ప్రేమ లేదని అంటుంది అనుకుంటాడు. ఈ క్రమంలోనే అ పేజ్‌ను చించేసి తన జేబులో పెట్టుకుంటాడు.

ఎందుకు ఇలా చేసిందో

ఎందుకు ఇలా చేసిందో

అలా క్లాస్ జరుగుతుంది. అది పూర్తయిన తరువాత పుష్పను పిలిచి పిచ్చిపిచ్చి రాతలు రాసే ఇలాంటి నోట్‌బుక్‌ను ఇంకోసారి ఇవ్వొద్దని వార్నింగ్ ఇస్తాడు రిషి. ఆమె తెల్ల మొహం వేసి చూస్తూ ఉండటంతో ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అని అంటాడు రిషి. ఇక రిషి, వసు తప్ప మిగతా అంతా క్లాస్‌ నుంచి వెళ్లిపోతారు.

రిషి ఆ పేపర్‌ను డస్ట్‌ బిన్‌లో వేయాలనుకుని పక్కన పడేసి వెళ్తాడు. అప్పుడే అక్కడకు వచ్చిన జగతి రిషి విసిరేసిన ఆ పేపర్‌ను చూస్తుంది. అందులో వసుధార రాసిన సారీ దండకం చూసి చేసిందంతా చేసి సారీ చెప్పడమేంటని అనుకుంటుంది. ఇంతలో మహేంద్ర వచ్చి ఆ పేపర్‌ను చూసి ఏంటీ జగతి అంటే ఇవి రిషికి వసుధార రాసిన సారీలు అని చెబుతుంది. ఇద్దరి మనసుల్లో ప్రేమ ఉన్నప్పటికీ బయటపడలేదే అనుకున్నాం.. తీరా రిషి చెప్పిన తర్వాత వసుధార ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదని మహేంద్ర అంటాడు.

ఇంకేం అడగవద్దని

ఇంకేం అడగవద్దని

ఇక సీన్ కట్ చేస్తే రిషి తన రూమ్‌లో కూర్చొని బాధ పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే వసుధారలో ఉన్న వేరియేషన్స్‌ అన్నీ జ్ఞప్తికి వస్తాయి. అసలు నాకు ఏమైంది వసుధారను ఎందుకు మర్చిపోలేక పోతున్నాను అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నేను వసుధారకు సరిపోనా, నాకేం తక్కువ? అని ఆలోచిస్తాడు రిషి. ఇంతలో ధరణి కాఫీ ఇచ్చి, ఇలా అడగొద్దు అని నాకు తెలుసు కానీ తప్పడం లేదు.. ఏమైంది? నువ్వు కొన్ని రోజుల నుంచి అదోలా ఉంటున్నావని అడుగుతుంది ధరణి.

వసుధార ప్రేమ రిజెక్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని కాఫీ బాగుందని ఇంకేం అడగవద్దు అని పరోక్షంగా చెబుతాడు. అయినా ధరణి వదలకుండా ఇంకా ఏదో అడగబోతుంటే, గౌతమ్ కనిపించడం లేదేంటి అని అడుగుతాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా తన పని చూసుకోవడం కోసం వెళ్ళిపోతుంది.

అసలు ఏం జరుగుతుందని

అసలు ఏం జరుగుతుందని

మరోపక్క హాల్‌లో జగతి బుక్ చదువుతుంటుంది. ఇంతలో సాక్షి వచ్చి పలకరించి రిషి రూమ్‌కి వెళ్తుంటే జగతి అలా వెళ్లవద్దని, రిషి మూడ్ బాగాలేదని. నువ్వెళ్తే ఇంకా చిరాకు పడతాడు అంటుంది. అది మీరు ఎలా డిసైడ్ చేస్తారు అని సాక్షి కూడా రెచ్చిపోతుంది. జగతి సమాధానం ఇచ్చే లోపు దేవయాని వస్తుంది. రిషి వద్దకు వెళ్తుంటే ఆపడానికి నువ్వెవరు జగతి? సాక్షి రిషికి కాబోయే భార్య అంటుంది.

అది మీరు అనుకుంటే సరిపోదు... రిషి అనుకోవాలని అంటుంది జగతి. ఇంకా ఆలోచిస్తే... రిషి తల్లిగా నేను అనుకోవాలి.. ఎవరెవరో అనుకుంటే సరిపోదు అని గట్టి కౌంటరే ఇస్తుంది జగతి. ఇది జరుగుతూ ఉండగా రిషి వస్తాడు. ఈ క్రమంలో అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ గొడవేమీ చెప్పొద్దని జగతికి వార్నింగ్ ఇస్తుంది దేవయాని. ఇంతలో రిషి అసలు ఏం జరుగుతుందని అడుగుతాడు. ఈ క్రమంలో సాక్షి ముందు ఇంటి విషయాలు చర్చించవద్దని దేవయానికి రిషి చెబితే నేను అదే చెప్పానంటూ రిషికి వివరిస్తుంది జగతి.

రిషికి యాక్సిడెంట్

రిషికి యాక్సిడెంట్

మరోపక్క కాలేజీ నుంచి ఇంటికి వెళ్లి పోతున్న వసుధారను సాక్షి మళ్లీ అడ్డగించి ఏంటీ చూసి కూడా వెళ్లిపోతున్నావు అని ప్రశ్నిస్తుంది వసుధార. అలా ఆగకుండా వెళ్లిపోతే ఎన్నో అడ్డంకులు వస్తాయి వార్నింగ్ ఇస్తుంది సాక్షి. అడ్డంకుల అన్నింటినీ తొక్కుకుంటూ వెళ్లిపోతానని అంటుంది వసుధార. ఇక అలా తాజా ఎపిసోడ్ ముగించారు.

ఇక రాబోతున్న ఎపిసోడ్ లో వసుధార పని చేస్తున్న రెస్టారెంట్ కు జగతి, మహేంద్ర, రిషి కలిసి వెళ్తారు. మీకు ఏమి తెచ్చి ఇవ్వమంటారు అని అడుగుతుంది. రిషి కాస్త లెవల్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక మరోపక్క అక్కడికి సాక్షి కూడా వచ్చి చేరుతుంది. అలా వచ్చిన సాక్షితో నన్ను ఇంటివద్ద డ్రాప్ చేయగలవా అని అడుగుతాడు రిషి, దీంతో ఆమె ఎగిరి గంతు వేస్తుంది. నేనే డ్రైవింగ్ చేస్తానని చెప్పి సాక్షితో కలిసి వెళ్లిన రిషికి యాక్సిడెంట్ అవుతుంది. అది చూసి తల్లడిల్లిన వసుధార ఆయనను తన ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X