Guppedantha Manasu : రిషిని కాపాడిన వసుధార.. తీవ్రంగా అవమానించి పంపిన దేవయాని
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. రిషి వసుధారను ఒక స్కాలర్ షిప్ టెస్ట్ రాయించడం కోసం వేరే ఊరికి తీసుకెళ్లి ప్రపోజ్ చేస్తాడు. ఆమె ఒప్పుకుంటుందనుకుంటే ఒప్పుకోకుండా షాక్ ఇస్తుంది. దీంతో రిషి దేవదాసు లాగా మారిపోయి ఇంట్లో అందరినీ టెన్షన్ పెడుతూ ఉంటాడు. జగతి, గౌతమ్ వెళ్లి వసుధారతో ఈ విషయం మీద మాట్లాడి ఒక కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే ఆమె ఒప్పుకోదు. తర్వాత సాక్షి మరోసారి ఆమెను భయపెట్టే ప్రయత్నం చేస్తే ఆమెకే షాక్ ఇస్తుంది. మరోపక్క రిషి సాక్షితో కలిసి ఆమె కార్లో ఇంటికి బయలుదేరతాడు. అలా గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

రిషిని ఆసుపత్రికి
తన డ్యూటీ ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తూ... రెస్టారెంట్ నుంచి సాక్షి కారులో ఇంటికి వెళ్లి పోయిన విషయం గుర్తు తెచ్చుకుని వసుధార బాధ పడుతూ ఉంటుంది. అసలు రిషి సార్ సాక్షితో వెళ్తే నాకెందుకు బాధగా ఉంది అని అనుకుంటూ ఆమె ఆలోచనలో పడుతుంది. అసలు రిషి సార్‌కు సాక్షి అంటే నచ్చదు... రిషి సార్‌కు సాక్షి తగదు...అనే విషయం తెలిసి కూడా ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేస్తానని ఆమె బెదిరిస్తే నేనెలా ఇలా రిషి సార్ ప్రేమ కాదన్నానని ఆమె బాధ పడుతుంది. ఇక ఆమె వెళుతున్న క్రమంలో రోడ్డు పక్కనే యాక్సిడెంట్ జరగడంతో జనం అంతా మూగుతారు. అయితే ఆమె అక్కడ ఆటో ఆపమని చెబితే ఆటో అతను వద్దంటాడు, అందరూ ఉన్నారుగా మనకెందుకు వెళ్ళిపోదాం అంటే లేదని కోప్పడి మరీ అక్కడికి వెళ్లి ఆమె చూడగా రిషి రోడ్డు పక్కన మైలురాయి మీద పడి ఉంటాడు. ఒక్క క్షణం వసుధారకు ఒళ్ళు జలదరిస్తుంది. దీంతో వెంటనే తాను వెళుతున్న ఆటోలో రిషిని ఆసుపత్రికి తీసుకెళ్తుంది వసుధార. అక్కడ చికిత్స చేసి ఇంటికి తీసుకు వెళుతూనే మహేంద్రకు కాల్ చేస్తుంది.

ఫస్ట్ ఎయిడ్ చేయించి
ఇక ఈ విషయం తెలియని మహేంద్ర, జగతి.. రిషి ఎక్కడకు వెళ్లాడు అని ఆరా తీస్తుంటారు. మహేంద్రకు వసుధార ఫోన్ చేయడమే కాక త్వరగా బయటకు రమ్మని చెబుతుంది. ఏమైంది అని అడుగుతుండగానే కాల్ కట్ కావడంతో అందరూ పరుగులు పెడుతూ బయటకు వస్తారు. అలా బయటకు వచ్చాక రిషిని ఆ పరిస్థితిలో చూసి ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అవుతారు. ఆటో వాడికి డబ్బులు ఇచ్చి రిషి సార్ రోడ్డు మీద పడి ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేయించి డాక్టర్ ను ఇంటికే రమ్మని చెప్పానని చెప్పింది. ఇంట్లో అందరూ హడావుడి చేస్తున్నా దేవయానికి విషయం ఆలస్యంగా తెలుస్తోంది. ఇక అదే సమయంలో వసుధార ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తుంటే, ఆమెను గుమ్మం ముందు నిలబెట్టి నిలదీస్తుంది.

ఫస్ట్ ఎయిడ్ చేయించి
అసలు రిషికి యాక్సిడెంట్ ఎలా అయింది అని అడుగుతుంది దేవయాని. నడుచుకుంటూ వెళ్తుంటే జరిగింది అని చెబితే కారులో తిరగాల్సిన రిషి కాలి నడకన వెళ్లేలా చేసింది నువ్వే అని, ఈ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం నువ్వే అంటుంది దేవయానికి. ఈ క్రమంలోనే వసుధార చేతిలో డబ్బులు పెట్టి.. ఆటోలో వచ్చావుగా క్యాబ్‌లో వెళ్లిపోమని, రిషి జీవితం నుంచి కూడా వెళ్లిపోమని అంటుంది దేవయాని. దేవయాని మాటలకు బాధ పడిన వసుధార అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క రిషికి చికిత్స చేసిన డాక్టర్ ఆ అమ్మాయి లేకుంటే చాలా ఇబ్బంది అయ్యేదని, సరైన సమయానికి తీసుకు వచ్చిందని అంటాడు. ఇక వసుధార రిషి ఎలా ఉన్నాడో తెలుసుకునేందుకు మహేంద్రకి ఫోన్ చేస్తుంది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయక పోయేసరికి బాధ పడుతుంది.

మెలకువ వచ్చి
అక్కడే ఉండి కొడుకుని చూసుకోవడం కోసం అక్కడే ఉండిన జగతి రిషిని అలా బెడ్‌పై చూసి కన్నీరు పెట్టుకుంటుంది. రిషిని ముట్టుకుందామనుకున్న టైంలో డాడ్ డాడ్ అని కలవరిస్తూ ఉంటాడు. ఏంటి నాన్న నీకు ఈ బాధ... ఆ బాధలో నేను భాగస్వామిగా ఉన్నానా... ఇన్నాళ్లూ మనసులో మాట చెప్పలేదని బాధ పడ్డాను.. ఇప్పుడు చెప్పాక కూడా బాధ పడుతున్నానని ఆమె అంటుంది. ఇక మెలకువ వచ్చిన రిషి దాహం అంటాడు, దీంతో జగతి నీళ్లు తాగిస్తుంది.

ఎట్టకేలకు చూసిన రిషి
అయినా డాడ్.. డాడ్ అని పిలుస్తున్న రిషి అప్పుడే వచ్చిన మహేంద్రతో మాట్లాడతాడు. రిషీ నేను ఇక్కడే ఉన్నాను, నీకేం కాదు... మేం ఉన్నాం కదా అని మహేంద్ర ధైర్యం చెబుతాడు. మరోపక్క అమ్మవారి వద్ద పూజ చేసి కుంకుమ తీసుకుని, రిషి సార్‌ను త్వరగా కోలుకునేలా చేయమని మొక్కుకుంటుంది. ఈ క్రమంలో తాజా ఎపిసోడ్ ముగించారు. కమింగ్ అప్ ఎపిసోడ్ లో చూపిస్తున్న దాని ప్రకారం అమ్మవారి వద్ద బొట్టు రిషికి పెట్టాలని మరో సారి రిషి ఇంటికి వస్తుంది వసుధార. ,మళ్లీ దేవయాని వసుధారను లోపలికి వెళ్లనివ్వదు. ఎంత వేడుకున్నా ఆమె లోపలి పంపేడే లేదని అంటుండు. ఇక ఏం చేయాలో అర్థం కాక తిరిగి వెళ్లిపోతున్న వసుధారను మిద్దె పై నుంచి చూస్తాడు రిషి. ఇంతలో రిషి పిలిచినట్టు అనిపించి పైకి చూస్తుంది వసుధార.


Click it and Unblock the Notifications











