twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu : సాక్షిని బయటకు ఈడ్చిన జగతి.. రిషిని చూసేందుకు వసుధార కొత్త ప్లాన్!

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వసుధారను ఒక స్కాలర్షిప్ టెస్ట్ రాయించడం కోసం వేరే ఊరికి తీసుకెళ్లి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఒప్పుకుంటుందనుకుంటే ఒప్పుకోకుండా షాక్ ఇవ్వడంతో రిషి దేవదాసు లాగా మారిపోతాడు. తరువాత కొంచెం తెరుకున్నా ఆమెను చూసి దూరం జరిగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అలా అందరినీ టెన్షన్ పెడుతూ ఉంటాడు.

    అయితే రిషి సాక్షితో కలిసి ఆమె కార్లో ఇంటికి బయలుదేరి యాక్సిడెంట్ కు గురవుతాడు. మళ్ళీ వసుధార రిషిని కాపాడి ఇంటికి తీసుకువస్తే ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది దేవయాని. అలా గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

    అర్హత కోల్పోయావు

    అర్హత కోల్పోయావు

    లోపలి రానివ్వక పోవడంతో రిషి ఆరోగ్యం బాగుండాలి అని దారిలో కనిపించిన ఓ గ్రామ దేవతను మొక్కుకుంటుంది వసుధార. రిషి సార్‌కు ఏం కాకూడదు, తొందరగా కోలుకోవాలని దీపం వెలిగించి దండం పెట్టుకుని, కుంకుమ తీసుకుంటుంది. ఆ పూజ చేసిన తెచ్చిన కుంకుమ తీసుకొచ్చి రిషికి ఇద్దామనుకుని వెళుతుంటే మళ్ళీ వసుధారను దేవయాని అడ్డుకుటుంది. మళ్లీ ఎందుకు వచ్చావు అని అడిగి, రిషిని చూడటానికి నీకు ఉన్న అర్హత ఏంటి? అని ప్రశ్నిస్తుంది దేవయాని.

    రిషి నీ మాయలో పడి ఇలా అయిపోయాడు, రిషి బాధకు నీవు కారణం కాదా అని ఆగడంతో వసుధార రిషి సార్‌ను దూరం చూసి వెళ్లిపోతాను అని ప్రాధేయపడుతుంది. కానీ అదేమీ వద్దని, ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఎప్పుడో కోల్పోయావు అని అంటుంది. అక్కడే ఉన్న గౌతమ్, ధరణి ఏమీ చేయలేక నిశ్చేష్టులయి చూస్తూ ఉంటారు.

    వెటకారపు నవ్వు నవ్వి

    వెటకారపు నవ్వు నవ్వి

    అయినా వసుధార తగ్గకుండా మేడం మీకు దండం పెడతా... ఒక్కసారి లోపలికి వెళ్లనివ్వండి మేడం అని ప్రాధేయపడినా, నా వినకపోతే... మెడపట్టి గెంటిస్తా అని అంటుంది. అయినా వినకపోవడంతో ధరణిని పిలిచి వసుధారను గేటు బయటకు గెంటేసిరమ్మని ఆర్డర్‌ వేస్తుంది దేవయాని. ఆమె వచ్చి వసుధార వెళ్ళిపో అని చెప్పలేక చెబుతుంటే దేవయాని సీరియస్ అవుతుంది. ఇంతలో సాక్షి రావడంతో దేవయాని ఆమెతో వసుధారను గెంటిద్దామనుకుంటుంది.

    నువ్వు అక్కర్లేదు ధరణి. వసుధారను గెంటేయడనికి సాక్షి వచ్చింది అంటుంది. ఇంతలో ఇది కరెక్ట్ కాదని భావించి వసుధారే వెనక్కి తగ్గి వెళ్లిపోతుంది. వసుధారకు సాక్షి ఎదురు పడగా ఒక వెటకారపు నవ్వు నవ్వి వెళ్లిపోతుంది. దేవయాని రా అని సాక్షిని రిషి దగ్గరకు తీసుకెళ్తుంది.

    డోన్ట్‌ టచ్‌మీ

    డోన్ట్‌ టచ్‌మీ

    మరో పక్క బెడ్‌ మీద పడుకొని ఉన్న రిషికి వసుధార గుర్తుకు వస్తుంది. ఆమె వెంట పడుతున్నట్లు ఆమె వెళ్లి పోతున్నట్లు కల వస్తుంది. అయితే వసుధార అంటూ కలలోనే కలవరిస్తాడు. అల కలవరిస్తూనే వసుధారా అని పిలుస్తూ ఒక్కసారిగా లేస్తాడు. బయటకు వెళ్తున్న వసుధారకి రిషి సార్ పిలిచినట్టు అనిపించి వెనక్కు చూస్తుంది కానీ ఎవరూ కనిపించరు.

    దీంతో రిషి బెడ్‌పై నుంచి లేవడానికి ట్రై చేసి కిందపడబోతే అప్పుడే సాక్షి వచ్చి పట్టుకోబోతుంది. అయితే ఆమెను చూడగానే డోన్ట్‌ టచ్‌మీ అంటాడు. పడబోతుంటే పట్టుకోబోయానుంటుంది సాక్షి. నేను పడిపోయిన ఫర్వాలేదు కానీ నువ్వు మాత్రం పట్టుకోవద్దని అంటూనే అసలు నువ్వెందుకు వచ్చావని అడుగుతాడు. ఇంతలో రిషి రూమ్‌ బయట ఉన్న మహేంద్ర జగతి ఈ వాదన చూసి పరుగెత్తుకొని వస్తారు. సాక్షిని కాస్త కటవుగానే జగతి బయటకు పంపించేస్తుంది.

    గుర్తు పట్టిన రిషి

    గుర్తు పట్టిన రిషి

    మర్యాదగా చెప్తే విననప్పుడు నీ భాషలో చేస్తానంటూ సాక్షిని బలవంతంగానే లాక్కొని వెళ్లిపోతుంది జగతి. రిషి పక్కనే కూర్చుని మహేంద్ర చూస్తూ ఉంటే అసలు ఏం జరిగింది డాడ్. నాకు ఏమీ గుర్తు లేదని అంటాడు రిషి. అసలు నన్ను ఇంటికి ఎవరు తీసుకొచ్చారని ప్రశ్నిస్తాడు, దీంతో మహేంద్ర సైలెంట్‌ అయిపోతాడు.

    అప్పుడే అక్కడ పడి ఉన్న వసుధార చున్నీ చూసిన రిషి వసుధార కదూ తీసుకు వచ్చింది అని అడుగుతాడు రిషి. దానికి మహేంద్ర నువ్వు నడుచుకుంటూ వెళ్లడం ఏంటి? యాక్సిడెంట్ చేసుకోవడం ఏంటీ అని ప్రశ్నిస్తాడు మహేంద్ర. ఇక కాస్త లేచి బయటకు వెళ్లి నిలబడితే ఇంటి బయట ఉన్న వసుధార కనిపిస్తుంది. ఆమె కాదు భ్రమ అనుకుంటాడు.

    మహేంద్రకు వీడియో కాల్

    మహేంద్రకు వీడియో కాల్

    ఇక అలా తాజా ఎపిసోడ్ ముగించారు. ఇక రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం మళ్ళీ ఇంటి రిషిని చూడడం కోసం వచ్చి ఇంటి బయట ఉన్న వసుధారను గౌతమ్ వచ్చి కలుస్తాడు. రిషికి నో చెప్పాక ఫీల్ అవుతున్నావు కదా అని ప్రశ్నిస్తాడు. అదేమీ లేదే అన్నట్టు ఆమె మాట్లాడుతూ ఉంటే అది లేకుంటే నీలో ఇంత బాధ ఎందుకు ఉందని ప్రశ్నిస్తాడు.

    ఇక మరో పక్క ఇది కుదిరేలా లేదని మహేంద్రకు వీడియో కాల్ చేసి వసుధార రిషి గారు ఎలా ఉన్నారు అంటూ ఆరా తీస్తుంది. పక్కనే పడుకొని ఉన్న రిషిని వీడియో కాల్లో చూపిస్తాడు మహేంద్ర. ఆమె చూస్తూ ఉండగానే రిషి లేచి ఫోన్‌లో ఎవరు డాడ్ అని అడిగితే వసుధార అని, మాట్లాడతావా అని అడుగుతాడు. రిషి సైలెంట్ అయిపోతున్నట్టు చూపించారు.

    English summary
    Guppedantha Manasu Episode 471: Vasudhara offers prayers for Rishi's well-being. Later, when she visits him Devayani stops her and creates a scene.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X