Guppedantha Manasu : ఎట్టకేలకు రిషికి చేరిన వసు తెచ్చిన కుంకుమ.. దేవయానికి ఝలక్ ఇచ్చిన జగతి!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వసుధారతో ఒక స్కాలర్షిప్ టెస్ట్ రాయించడం కోసం వేరే ఊరికి తీసుకెళ్లి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందనుకుంటే అలా చేయకుండా షాక్ ఇవ్వడంతో రిషి దేవదాసులా మారిపోతాడు. తరువాత కొంచెం తెరుకున్నా ఆమెను చూసి దూరం జరిగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అలా అందరినీ టెన్షన్ పెడుతూ ఉంటాడు. అయితే రిషి సాక్షితో కలిసి ఆమె కార్లో ఇంటికి బయలుదేరి యాక్సిడెంట్ కు గురవుతాడు.

మళ్ళీ వసుధార రిషిని కాపాడి ఇంటికి తీసుకువస్తే ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది దేవయాని, రిషితో పంచాయితీ పెట్టుకోవడానికి చూసిన సాక్షిని జగతి బయటకు లాక్కుని వస్తుంది. అలా గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
తెలియకపోతే ఎలా

తెలియకపోతే ఎలా

సాక్షిని లాక్కుని బయటకు వస్తున్న జగతిని దేవయాని అడ్డుకుంటుంది. ఏయ్ జగతి, ఏం చేస్తున్నావ్‌ అని అడిగితే, చేయాల్సిందే చేస్తున్నాను అక్కయ్య అని అంటుంది. ఇంతలో సాక్షి ఏమో చూడండి ఆంటీ, రిషితో మాట్లాడుతుంటే లాక్కొచ్చారు అని అంటుంది. జగతి ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా అని దేవయాని అడిగితే నాకు చాలా బాగా అర్థమవుతుంది అక్కయ్య, రిషి యాక్సిడెంట్‌ అయ్యి బెడ్‌పై పడుకొని ఉంటే.. ప్రశ్నలు వేస్తుంది, జవాబులు కావాలని పంచాయితీ పెడుతుందని జగతి.

అయితే ఏది అవసరమో.. ఏది అనవసరమో మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని సాక్షి ఎదురు తిరిగితే, మినిమం కామన్‌సెన్స్‌ ఉంటుంంది అని అంటుంది జగతి. బాలేని మనిషి దగ్గరకు వచ్చి నీ ప్రశ్నలతో వేధించడం అవసరమా అని అడుగుతుంది జగతి. ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే ఎలా అని నిలదీస్తుంది.

నేను అనుకున్నదే జరుగుతుంది

నేను అనుకున్నదే జరుగుతుంది

మరోపక్క జగతీ, నువ్వు ఎక్కువ చేస్తున్నావ్ అని దేవయాని అంటే సాక్షి ఎక్కువ చేసింది అని గట్టిగానే కౌంటర్ ఇస్తుంది జగతి. దీంతో ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదామని దేవయాని సాక్షిని పంపించేస్తుంది. తరువాత ఏంటీ జగతి.. రిషికి ఏదో జరిగిందని, దాన్ని అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నావా... రిషికి దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నావా? అని దేవయాని ప్రశ్నిస్తుంది. రిషి ఎప్పటికీ నీ మాట వినడని, తల్లిగా ఎప్పటికీ నిన్ను అంగీకరించడు అంటుంది దేవయాని.

రిషి నన్ను తల్లిగా అంగీకరించినా లేకపోయినా నాకు బాధ లేదని... రిషి బాగుండాలని నేను కోరుకుంటున్నానని అంటుంది జగతి. చూస్తూ ఊరుకోను... నన్ను బాధ పెడితే సహిస్తానేమోగానీ.. నా కొడుకును ఇబ్బంది పెడితే సహించలేను అంటుంది. ఈ ఇంట్లో అడుగు పెట్టావ్, అది నీ అదృష్టం అనుకో... మహేంద్రకు భార్యగానే మిగిలిపోతావ్. రిషికి తల్లిగా ఎప్పటికీ ఉండలేవ్‌.. నీ తలరాతను మార్చుకోవాలని చూస్తున్నావేమో... నీ నుదుటన రాత రాసింది దేవుడు కావచ్చు కానీ.. ఇక్కడ నేను అనుకున్నదే జరుగుతుంది, గుర్తుపెట్టుకో అని దేవయాని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

మహేంద్రకు వీడియో కాల్‌

మహేంద్రకు వీడియో కాల్‌

ఇక మరో పక్క ధరణి వచ్చి... వసుధార వచ్చిందని.. పెద్దత్తయ్య లోపలికి రాకుండా అడ్డుకుని బయటకు పంపించేసిందని చెబుతుంది. వసూ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను సఆరీ అని మనసులో అనుకుంటుంది వసుధార. ఇంటి బయట ఉన్న వసుధార మహేంద్రకు వీడియో కాల్‌ చేస్తుంది.

సార్ ఎలా ఉన్నారని అడిగితే పక్కనే ఉన్న రిషిని చూపిస్తాడు. ఒక్కసారి రావచ్చు కదమ్మా అని అంటే, నేను వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా సార్ అంటుంది వసుధార. మహేంద్ర అర్థం చేసుకొని వదినగారు ఆపారా అని అడిగితే అవును అని చెబుతుంది. అలా మాట్లాడుతున్న క్రమంలో మెలకువ వచ్చిన రిషి... ఫోన్‌లో ఎవరు అని అడిగితే, వసుధార అని, చెప్పిన మహేంద్ర. మాట్లాడతావా అని అడుగుతాడు. వద్దన్నట్టుగా తల ఊపుతూ రిషి సైలెంట్ అయితే నేను ఉంటాని పెట్టేస్తుంది వసుధార. వసుధారతో మాట్లాడాల్సింది కదా రిషి అని అంటే, వద్దని అంటాడు. నిన్ను ఇంటికి తీసుకొచ్చింది వసుధారే అని నీకు తెలుసు కదా అంటే అవును అన్నట్టు తలాడిస్తాడు రిషి.

మహేంద్రకు వీడియో కాల్‌

మహేంద్రకు వీడియో కాల్‌

మరోపక్క ఇంటి బయట ఉన్న వసుధార వద్దకు గౌతమ్ వచ్చి రిషిని ఆసుపత్రికి తీసుకెళ్లావు... ఇంటికి తీసుకొచ్చావు.. ఇంట్లోకి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. ఆ అదృష్టం తనకు లేదంటుంది వసుధార. రిషి గారు ఎలా ఉన్నారు అని అడిగితే బెడ్‌పై వాడిని చూడలేకపోతున్నాను అంటాడు గౌతమ్. నాకు నువ్వు నో చెప్పాక.. నువ్వు ఏం ఫీలయ్యావో తెలియదు కానీ.. రిషికి నో చెప్పాక చాలా ఫీల్ అవుతున్నావ్‌ కదా అని అంటాడు.

నాకు సమాధానం అక్కర్లేదు, నీ మనసుకు నువ్వే సమాధానం చెప్పుకో వసుధార ... రిషి గాడిని తలచుకుంటే ఏమైపోతాడో అని భయంగా ఉందని అంటాడు. అయితే అదంతా విన్న తరువాత వసుధార చిన్న హెల్ప్ చేయమంటుంది. తాను తీసుకొచ్చిన కుంకుమను ఇవ్వడంతో కొన్ని సందేహాలు మేఘాల్లో కమ్ముకున్నాయి.. ఇప్పుడు విడిపోయాయి... అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు గౌతమ్.

పరోక్షంగా కౌంటర్

పరోక్షంగా కౌంటర్


భోజనం టేబుల్ వద్ద తాను రిషి రూమ్ కి ఫుడ్ తీసుకు వెళతాను అని, బెదిరించో బతిమాలో తినిపిస్తానంటాడు గౌతమ్. మరోపక్క బెడ్‌పై రిషి ఒక్కడే పడుకొని ఉంటాడు... లేచి నీళ్లు అందుకొనే టైంలో పడిపోతాడు.. జగతి వచ్చి పట్టుకుంటుంది. ఏం కావాలి రిషి అంటుంది, సీరియస్‌గా చూసే సరికి సార్ అంటుంది. కోపం ఉంటే దూరం పెట్టాలి.. ద్వేషం ఉంటే దూరం అవ్వాలి అంతే కానీ.. నీకు నీవే శిక్ష వేసుకుంటే ఎలా అని ఆమె ప్రశ్నిస్తే నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తారా అని అంటాడు.

ట్యాబ్లెట్స్‌ వేసుకోలేదని చెబుతుంటే.. ప్లీజ్ మేడం అని అరవడంతో వెళ్లిపోతుంది జగతి. ఇంతలో గౌతమ్ భోజనం తీసుకొస్తే వద్దని చెబుతాడు. వసుధార ఇచ్చిన కుంకుమ తీసుకుని రిషికి పెడతాడు. అలా తాజా ఎపిసోడ్ ముగించారు. కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం కాలేజీకి వచ్చిన రిషికి పువ్వులతో స్టూడెంట్స్ అందరూ స్వాగతం పలుకుతారు. ఈ ఫ్లవర్స్ నాకు వద్దని చెప్పిన రిషి క్యాబిన్ కు వెళతాడు. అయితే వసుధార పట్టుకున్న పువ్వు మాత్రం రిషి జేబులో మహేంద్ర చూడడమే కాక మనం దేన్ని వద్దనుకుంటామో అదే మనకు చేరుతుందని పరోక్షంగా కౌంటర్ వేస్తాడు మహేంద్ర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X