twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu : రిషి దెబ్బకు షాక్ లో వసుధార.. మరో నాటకం మొదలుపెట్టిన దేవయాని

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. గత కొద్ది రోజులుగా మొత్తం సీరియల్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు వ్యవహారం చుట్టూ సాగుతోంది. మార్చి 23వ తేదీ బుధవారం నాటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వసుధారని తీసుకుని బహిరంగ ప్రదేశానికి తీసుకు వెళ్లిన రిషి ఓ చోట కారు ఆపి సీరియస్ గా ఆలోచిస్తూవు ఉంటాడు.

    నా కొత్తప్రయాణం మొదలైంది నేను వెళుతున్నాను అంటూ తండ్రి రాసిన లేఖను గుర్తు చేసుకుని ఆలోచనలో పడతాడు. ఈ క్రమంలో వసుధార సైలెంట్ గా నిలబడడంతో ఏంటి మాట్లాడవేంటి..చాలా విషయాల్లో సలహాలు, సూచనలు ఇస్తుంటావ్ కదా..మా డాడీ ఇల్లు వదిలి వెళ్లిపోవడంలో ఎవరిది తప్పంటావు అని అడుగుతాడు.

    బహిరంగ ప్రదేశానికి తీసుకు వెళ్లి

    బహిరంగ ప్రదేశానికి తీసుకు వెళ్లి

    దానికి మహేంద్ర సార్ అలా వెళ్లడం అంటూ ఏదో అనబోయి అయినా ఇది మీ పర్సనల్ విషయం కదా అంటుంది. దానికి రిషి నువ్వు మా వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడూ సూచనలు ఇవ్వలేదా.. అడగకుండా ఉచిత సలహాలు ఇస్తుంటారు కానీ అవసరానికి అడిగితే కనీసం ఏమీ చెప్పరు అని అంటదు. మా నాన్న అక్కడకు వచ్చి ఏం చెప్పారో నువ్వేం విన్నావో నాకు తెలియదు కానీ తను ఇలా చేయాల్సింది కాదు...నాన్న ఇంట్లోంచి వెళ్లిపోవడం ఏంటి... వెళ్లి నిలదీయాలా, బతిమాలాలా , ఏం చేయాలి అని ప్రశ్నిస్తాడు.

    ఈ క్రమంలో వసుధార మీ బాధను అర్థం చేసుకోగలను కానీ అంటూ ఏదో అనబోతూ ఉండగా నాకు సానుభూతి కాదు సలహా కావాలి.. స్టూడెంట్ గా కాదు..ఫ్రెండ్ గా ఆలోచించి చెప్పు. తెలిసీ తెలియని వయసులోనే మా అమ్మ వెళ్లిపోయింది. అన్నీ తెలిసి ప్రపంచాన్ని చూస్తుండగా నాన్న వెళ్లిపోయారు అంటూ ఎమోషనల్ అయ్యాడు.

    వసుధార మీద ప్రశ్నల వర్షం

    వసుధార మీద ప్రశ్నల వర్షం

    ఇక్కడ ప్రాబ్లెమ్ ఎవరిది, తప్పెవరిది, వాళ్లదా-నాదా, అరె అమ్మ గురించి ఎంత గొప్ప గొప్ప కథలు విన్నాను, బంధాలు-అనుబంధాల గురించి మాట్లాడుకుంటాం.. ఇద్దరూ వదిలి వెళితే తప్పు వాళ్లదా-నాదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. దానికి వసుధార మహేంద్ర సార్ అలా ఎందుకొచ్చారో...ఆ విషయంలో నేను ఏమీ మాట్లాడలేనని అంటుంది. చాలా విషయాల్లో పాలు నీళ్లను వేరు చేసినట్టు మంచిని చెడుని విశ్లేషించి మాట్లాడతావు కదా..ఇప్పుడెందుకు మాట్లాడవు? తల్లి బిడ్డని వదిలేసి వెళితే ఆ బిడ్డ ఏడుస్తుంటే ఆ తప్పు తల్లిదా-బిడ్డదా అని ప్రశ్నిస్తాడు.

    ఒకరి తర్వాత మరొకరు వదిలేసి వెళ్లిపోతే ఏమనుకోవాలి.. అమ్మలేదని చిన్నప్పుడు ఏడ్చాను...నాన్న వెళ్లిపోయారని ఇప్పుడు ఏడ్వలేను కదా అంటూ బాధ పడతాడు. జగతి మేడం విషయంలో అయితే అని వసు ఏదో అనబోగా జగతి మేడం అంటే నీకు అభిమానం...అందుకే తన తప్పొప్పులు నీకు కనిపించవు, మరి నాన్న దుకిలా చేశారంటావ్ అని అంటే దానికి వసుధార జరిగిన దాంట్లో ఎవరి తప్పేంటో చెప్పలేని పరిస్థితి అని అంటుంది. మనసులోనే మీ ఆలోచనా విధానం మారితే కానీ జగతి మేడం-మహేంద్ర సార్ అర్థంకారు మీకు అని అనుకుంటుంది.

    రిషిని గుర్తు తెచ్చుకుని మరీ బాధలో

    రిషిని గుర్తు తెచ్చుకుని మరీ బాధలో

    ఇక మరోపక్క డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న మహేంద్ర... రిషికి తినిపించిన సందర్భం గుర్తుచేసుకుంటూ ఉంటాడు. దీంతో తిను మహేంద్ర అని జగతి అంటే ఇప్పుడేం వద్దు..రిషి గుర్తొస్తున్నాడు..పాపం వాడు తిన్నాడో లేడో .. ప్రతీసారీ నాన్న వచ్చాకే తింటానని నాకోసం ఎదురుచూసేవాడని అంటాడు.

    దగ్గరున్నప్పుడు విలువ తెలుసుకోలేం..దూరమయ్యాక తెలుసుకుని ఏమీ చేయలేం... ఈ బంధాలంతే అంటూ వేదాంతం మాట్లాడుతుంది. బంధం విలువేంటో ఇప్పుడే తెలుస్తోంది..ఇన్నేళ్లూ నువ్వు అందర్నీ వదిలేసి ఎంత చిత్రవధకి గురయ్యావో కదా అని మహేంద్ర అంటే దానికి జగతి డబ్బుల్లేకపోవడం పేదరికం కాదు..మనకుంటూ ప్రేమించేవారు లేకపోవడమే అసలైన పేదరికం.. ఎన్నోసార్లు ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినకుండా కన్నీళ్లు పెట్టుకున్నాను అంటూ తన బాధ చెప్పుకుని ఈ బాధ నీకు వద్దు వెళ్లిపో మహేంద్ర అంటుంది.

    తెగేసి చెప్పిన మహేంద్ర

    తెగేసి చెప్పిన మహేంద్ర

    దానికి మహేంద్ర వెళ్లిపోతే తండ్రిగా రిషి ముందు గెలుస్తాను కానీ..భర్తగా ఓడిపోతాను, తండ్రిగా-భర్తగా కాదు ఓ మనిషిగా గెలవాలి అనుకుంటున్నా అంటాడు. ఇలా మాట్లాడుతూ ఉండగానే మహేంద్ర రిషి కార్ సౌండ్ విని డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి లేచి బయటకు పరుగులు తీస్తాడు. రిషి కారులో వసుధారను దింపేసి వెళ్ళిపోతాడు. డోర్ తీసిన మహేంద్ర వెళ్ళిపోతున్న రిషి కారు వైపే చూస్తూ నిల్చున్నాడు.

    మళ్లీ ఏమనుకున్నాడో ఏమో రిషి కారు వెనక్కి వస్తుంది. అలా వచ్చిన రిషి తండ్రి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వసుధార చేతికి ఇస్తాడు. మనుషుల మీద కోపం మందుల మీద చూపించొద్దు అని చెప్పు వసుధార అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మహేంద్ర రిషి ఏమన్నంటున్నాడు అని వసుధారని అడిగితే రిషి సార్ ని అర్థం చేసుకోవడం చాలా కష్టం సార్ అని అంటుంది. దానికి నువ్వు వాడి పక్కనే ఉండు...వాడు ఎవరి మాటైనా విన్నాడంటే అది నీ ఒక్కదాని మాటే అంటాడు.

    భోజనం చేస్తూ ఉండగా

    భోజనం చేస్తూ ఉండగా

    ఇక రిషి ఇంటికి వెళ్లే లోపు ధరణి వడ్డిస్తుండగా దేవయాని, గౌతమ్ భోజనం చేస్తుంటారు. ఇంతలో రిషి రావడం చూసి ఎవరూ రిషిని ఏ ప్రశ్నలూ అడగొద్దు, బాధ పెట్టొద్దు అని డైరెక్షన్స్ ఇస్తుంది దేవయాని. రిషి రావడమే మొదలు ఇక రా నాన్న అని ప్రేమ ఒలక బొస్తుంది. అన్ని సార్లు కాల్ చేస్తే ఎందుకు కట్ చేశావ్ రా అని గౌతమ్ అడిగితే..ఏం మాట్లాడొద్దని చెప్పాను కదా అని అంటుంది.

    రా రిషి భోజనం చేయి అని అంటే నాకు ఆకలిలేదు మీరు తినండి అని అంటాడు. అయితే మీ నాన్నతో మాట్లాడావా? ఏం బాధపడొద్దు ఇలా ఎప్పుడో జరుగుతుందనే అనుకున్నాను అంటూ దేవయాని బాధ వ్యక్తం చేస్తుంటే నేను బాధపడలేదు మీరు నా గురించి బాధపడొద్దు భోజనం చేయండి అని అంటాడు.

    Recommended Video

    RRR Team Reacts On Memes పడి పడి నవ్విన Ram Charan, Jr NTR | Filmibeat Telugu
    దేవయాని మరో నాటకం

    దేవయాని మరో నాటకం

    కానీ తినే పళ్లెంలోనే చేతులు కడిగేసుకుని నువ్వు తినకుండా నేను తినలేను నాన్న..నువ్వు తిన్నావని తెలిశాక తింటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. రిషి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఏం చెప్పకుండా అన్నీ మనసులో దాచుకుంటాడు ఏంటి వదినా వీడు అని గౌతమ్ అంటదు. ఇక అలా ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాతి ఎపిసోడ్ కమింగ్ లో చూపిస్తున్న దాని ప్రకారం రిషిని కలిసిన వసుధార భోజనం చేయమని అడుగుతుంది.

    చిరాకు పడిన రిషితో మీరు భోజనం చేస్తే మహేంద్ర సార్ గురించి రెండు విషయాలు చెబుదాం అని వచ్చా అంటుంది. అప్పుడు కూల్ అయిన రిషి భోజనం చేసేందుకుఒప్పుకుంటాడు. ఓసారి డాడ్ ని కలసి మాట్లాడాలి వసుధార హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాడు. కానీ మహేంద్ర సార్ తో మాట్లాడాలి అంటే మీకు నా హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా..డైరెక్ట్ గా మీరు కాల్ చేసి మాట్లాడతారు కదా వసుధార అంటుంది. మరి తరువాయి ఎపిసోడ్ ఎలా సాగనుందో చూడాలి మరి.

    English summary
    Guppedantha Manasu Episode 405: Mahindra gets upset by Rishi for ignoring him at jagathis house. elsewhere Devyani executes are plan to separate Rishi and Mahindra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X