Guppedantha Manasu: రిషిని మాయ చేసి బోల్తా కొట్టించిన వసుధార.. హెల్ప్ చేస్తానంటూనే !

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. వారం రోజులుగా మొత్తం సీరియల్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు విషయంలో అప్ సెట్ అయిన మహేంద్ర తన కుమారుడు రిషిని కాదనుకుని భార్య జగతి దగ్గరకు వెళ్తాడు. అయితే అలా తన తండ్రి వెళ్లడం కరెక్ట్ ఏనా? అని రిషి వసుధారను అడిగితే నేనేమీ చెప్పలేనని అంటుంది. తన తండ్రిని వదిలి ఉండలేక ఎలా అయినా ఆయనతో మాట్లాడాలని భావించి వసుధార వంకతో జగతి ఇంటికి వెళతాడు రిషి.. మరోపక్క రిషి దగ్గరకు వెళ్లిపొమ్మని జగతి చెప్పినా మహేంద్ర వినడు. రిషి తిరిజి ఇంటికి వెళ్లగా దేవయాని నటన మొదలు పెడుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక మార్చి 24 గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏమీ మాట్లాడలేక

ఏమీ మాట్లాడలేక

ఇంట్లో ఒంటరిగా కూర్చుని తండ్రిని తలుచుకుని రిషి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా మహేంద్ర కూడా రిషిని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. రిషి ఫోన్లో తండ్రి ఫొటో చూసుకుంటూ, కాల్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క రిషి ఇచ్చిన టాబ్లెట్స్ చూసుకుంటూ వాడికి నామీద ఎంత ప్రేమ ఉందో అని ముచ్చటపడుతూ ఉంటాడు. ఇక లోపలకు వచ్చిన వసుధారని చూసి ఈ ట్యాబ్లెట్స్ నా కొడుకుకి నాపై ఉన్న ప్రేమకి నిదర్శనం అని అంటూ అంటాడు. ఇంతలో రిషి కాల్ చేయడంతో లిఫ్ట్ చేసిన వసుధార పక్కన మహేంద్ర ఉండడంతో నెమ్మదిగా మాట్లాడుతుంది. దీంతో ఏంటి ఫోన్ లిఫ్ట్ చేసి కూడా ఏమీ మాట్లాడకుండా ఆగిపోయావు అని మహేంద్ర అనడంతో తండ్రి వాయిస్ విని రిషి చాలా ఎనోషల్ అవుతాడు. డాడ్ ఎలా ఉన్నారు ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అని వసుధారను అడిగితే మీరే అడగండి ఫోన్ ఇస్తున్నా అని వెంటనే మహేంద్ర చేతిలో ఫోన్ పెడుతుంది. డాడ్ అని రిషి పిలిచినా మహేంద్ర ఏమీ మాట్లాడలేక ఎమోషనల్ అయ్యి ఫోన్ కట్ చేసేస్తాడు.

ఎలాగో ఉన్నాడు అని

ఎలాగో ఉన్నాడు అని

ఇక తెల్లారగానే కాఫీ తీసుకొచ్చి జగతి ఇవ్వడంతో కాఫీ, టీలు తగ్గించాలి డాడ్ అని రిషి మాటలు గుర్తు చేసుకుని బాధపడతాడు. దీంతో జగతి మహేంద్రతో రిషి మారాలని నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ తనని ఎంత బాధపెడుతున్నావో చూడు, నా మాట విని వెళ్లిపో అంటుంది. ఇంతలో మినిస్టర్ నుంచి కాల్ రావడంతో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి రమ్మన్నారని జగతి అంటుంది. ఈ ప్రాజెక్ట్ ఆపకూడదు జగతి అని మహేంద్ర అంటే రిషి లేకుండా కొనసాగించలేం అని జగతి అంటుంది. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన వసుధారతో రిషిని మార్చడం నీవల్లే సాధ్యమవుతుందంటాడు మహేంద్ర. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా గౌతమ్ వస్తాడు. వచ్చి కూర్చోగానే రిషి ఎలా ఉన్నాడు గౌతమ్ అని అడగగా వాడేం బాలేడు... ఎప్పుడూ ఒంటరిగా ఉంటున్నాడు, ఏదేదో ఆలోచిస్తున్నాడు..మీరిక్కడి ఎందుకు వచ్చారో తెలియదు కానీ మీరు లేకపోతే రిషి ఎలాగో ఉన్నాడు అని అంటాడు.

డిసప్పాయింట్ అవుతాడు

డిసప్పాయింట్ అవుతాడు

గౌతమ్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న మహేంద్ర... వెళ్లడానికి కాదు కదా ఇక్కడకు వచ్చింది.. అంటూ గౌతమ్ రిషితోనే ఉండు..జాగ్రత్తగా చూసుకో అని చెబుతాడు. మరోపక్క కాలేజీలో అడుగుపెట్టిన రిషి ఈ పొగరు వచ్చి ఉంటుందా అని వసుధార గురించి ఆలోచిస్తాడు. అలా మహేంద్ర కార్ రావడం చూసి ..డాడ్ కారు ...ఆయన వస్తున్నారా అని ఆశగా ఎదురుచూస్తున్న రిషి అందులోంచి గౌతమ్-వసుధార దిగడంతో డిసప్పాయింట్ అవుతాడు. ఇక వస్తూనే మీతో మాట్లాడాలి సార్ అని వసుధార అంటే..నీకు నచ్చినప్పుడు మాట్లాడాలి అంటే ఎలా దానికి టైం ఉంటుంది కదా అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక కాఫీ తాగుదామని గౌతమ్ అంటే క్లాస్ కి టైం అవుతోంది నేను వెళతానని చెప్పి వసుధార వెళ్లిపోతుంది. రిషి భోజనం చేయలేదని తెలుసుకున్న ఆమె ప్యూన్ దగ్గర ఆ క్యారియర్ ని తీసుకుంటుంది.

చాలా మిస్సవుతున్నారు అని

చాలా మిస్సవుతున్నారు అని

అలా రిషికి తినిపించడానికి వసుధార వెళ్లగా నాకు ఆకలి లేదు, కోపంలో ఏదో అనేస్తాను మళ్లీ నువ్వు బాధపడాలి వెళ్లిపొమ్మని అంటారు. నేను బాధపడతానని తెలిసినప్పుడు మళ్లీ అనడం ఎందుకు అని ఎదురు ప్రశ్నించడంతో బెంచ్ పై ఉన్న ఏదో వస్తువు విసిరికొడతాడు రిషి. మీరు భోజనం చేస్తానంటే మహేంద్ర సార్ గురించి రెండు విషయాలు చెబుదామని వచ్చానని అనడంతో వెనక్కు తగ్గుతాడు. నీకు కోపం రాదా వసుధార అని అడిగితే ఎందుకు రాదు..మీపైనే వస్తుంది, మీ కోపమే నాకు కోపం తెప్పిస్తుందని కవర్ చేస్తుంది . మొత్తానికి తినడం మొదలు పెట్టిన రిషి డాడ్ గురించి ఏదో చెబుతానన్నావ్ ఏంటి అని పదే పదే అడుగుతున్నా, చెప్పకుండా వసుధార మొత్తం తినండి చెబుతాను అంటూ తినేలా చేస్తుంది. మొత్తం తినేశాక ఇప్పుడు చెప్పు అని అడిగితే, మహేంద్ర సార్ కాలేజీని చాలా మిస్సవుతున్నారు అని అంటుంది.

 వెళ్లి తినమని

వెళ్లి తినమని

దీంతో రిషి ఒక సారి డాడ్ ని కలసి మాట్లాడాలి..అందుకు వసుధార హెల్ప్ తీసుకోవాలి అనుకుని పైకి అనేస్తాడు. దానికి వసుధార నేను హెల్ప్ చేయడం ఏంటి నేను మీ స్టూడెంట్ ని అసిస్టెంట్ ని హెల్ప్ చేయమని అడగాలా..ఆర్డర్ వేయండి అంటూనే మహేంద్ర సార్ ని కలుస్తారా? కానీ అక్కడ జగతి మేడం ఉన్నారని ఇబ్బంది పడుతున్నారా? నేను మహేంద్ర సార్ ని బయటకు తీసుకురావాలా అని అంటూనే అయినా ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతారు...మహేంద్ర సార్ ని కలవాలి అంటే డైరెక్ట్ గా కలసి మాట్లాడుతారు కదా అంటూ హింట్ ఇస్తుంది. దీంతో డాడ్ తిన్నారో లేదో..టైమ్ కి ట్యాబ్లెట్స్ వేసుకున్నారో లేదో అని ఆలోచిస్తూ ఉండగా వసుధార ఇందాక ఏదో హెల్ప్ అన్నారు కానీ నేను ఏదేదో మాట్లాడేశాను అని అంటుంది. దానికి రిషి అవసరం అయినప్పుడు అడుగుతాను అంటుంది. చేయి నొప్పి అన్నారు కదా నేనేమైనా స్ప్రీ చేయనా అని అడిగితే నేను చూసుకుంటాను నువ్వు వెళ్లి తినమని అంటారు.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X