twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: ఎట్టకేలకు తండ్రిని కలిసిన రిషి.. వసుధారతో వెటకారం మాములుగా లేదుగా!

    |

    గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. వారం రోజులుగా మొత్తం సీరియల్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు విషయంలో అప్ సెట్ అయిన మహేంద్ర తన కుమారుడు రిషిని కాదనుకుని భార్య జగతి దగ్గరకు వెళ్తాడు. రిషి ఇంటికి వెళ్లగా దేవయాని నటన మొదలు పెడుతుంది. ఈ క్రమంలో అన్నం తినని రిషితో గత ఎపిసోడ్‌లో వసుధార అన్నం తినేలా చేస్తుంది. మహేంద్రా వెళ్లిపో అని జగతి చెబుతూనే ఉన్నా మహీంద్ర మాత్రం రిషి మారాలి అంటే నేను ఇక్కడే ఉండాలని చెబుతూ ఉంటాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక మార్చి 24 గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    దూరం పెరిగిందా

    దూరం పెరిగిందా

    జగతి, మహేంద్ర మినిస్టర్ ను కలుస్తారు. ఈ క్రమంలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళతారు. అయితే అంతా సవ్యంగా జరిగి పోతున్నప్పుడు ఇలా జరిగి ఉండాల్సి కాదు. డీబీఎస్టీ కాలేజీలో నేను చదువుకున్నా, అందుకే మీ కాలేజీ అంటే నాకు చాలా ఇష్టం . ఈ ప్రాజెక్ట్ విషయంలో రిషి లెటర్ పంపించాడు నేను చూశాను కానీ కావాలనే బదులివ్వలేదని అంటాడు. ఈ మిషన్ ఎడ్యుకేషన్ మంచి సంకల్పం అని డీబీఎస్టీ కాలేజీ అండర్లోనే మిషన్ ఎడ్యుకేషన్ నడవాలని అంటాడు. దీంతో అక్కడి నుంచి వాళ్ళు నిష్క్రమిస్తారు. మరోపక్క రిషి... మహేంద్ర, వసు మాటలను గుర్తు చేసుకుంటాడు. మీరిద్దరూ మాట్లాడుకోనంతగా గొడవేం పడ్డారన్న వసు అడిగిన విషయాన్ని గుర్తుచేసుకుని... అసలు నేను ఏమైపోతున్నాను.. నిన్నటి వరకు నా డాడ్ ఇప్పుడు అంత దూరం ఎలా అవుతారు..ఇద్దరి మధ్య దూరం పెరిగిందా..నేను అలా ఆలోచిస్తున్నానా అనుకుంటాడు. అనుకుంటూ వెంటనే మహేంద్రకు ఫోన్ చేస్తాడు.

    తప్పులేదు కానీ

    తప్పులేదు కానీ

    నిజానికి అదే సమయానికి మహేంద్ర జగతి కార్లో వెళుతుంటారు. మహేంద్ర మినిస్టర్ గారు కూడా అచ్చం నీలానే ఆలోచిస్తున్నారు జగతి అని అంటాడు. ఫోన్ రావడంతో వెంటనే ఎత్తి మాట్లాడతాడు. రిషి డాడ్..మీతో మాట్లాడాలి అంటే మహేంద్ర ఎక్కడికి వస్తావ్ రిషి అని అడుగుతాడు. దీంతో ఇద్దరూ ఓ చోట కలవడానికి సిద్దం అవుతారు. కలిసిన క్రమంలోఎందుకు వెళ్లిపోయారో తెలుసుకోవచ్చా డాడ్ అని రిషి అడిగితే మహేంద్ర ఎందుకు వెళ్లిపోయానో తెలియదా అని అడుగుతాడు. తెలియదనే అడుగుతున్నానని అంటే కొన్ని బంధాలు రబ్బరు బంతుల్లాంటివి, ఎంత తొక్కి పెడదామని చూస్తే అంత పైకి లేస్తాయని, . నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకున్నావు, నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని మహేంద్ర అంటాడు. మీరు కాలేజీ గురించి మాట్లాడుతున్నారా, ఇంటి గురించి మాట్లాడుతున్నారా అంటే కాలేజీలోనూ ఇంట్లోనూ నువ్వు నాకు కొడుకువే... కాలేజీని ఇంటిని వేర్వేరుగా చూడడం తప్పులేదు కానీ బాధ్యతల విషయంలో రెండూ ఒకటే...బంధాల విషయంలో వేర్వేరుగా చూస్తే నేను ఒప్పుకోనని మహేంద్ర అంటాడు.

    జగతి అలా గుర్తొస్తుందని

    జగతి అలా గుర్తొస్తుందని

    దీంతో రిషి నేను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చేసినందుకు నిరసనగా మీరు రాజీనామా చేశారు..నన్ను వదిలి వెళ్లిపోవాలని ఎందుకు అనిపించింది అని అడుగుధాడు. దీంతో మహేంద్ర నువ్వు నేను ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరి మధ్య ఉండాల్సినంత దగ్గరతనం లేదనిపించింది. నేను ఒంటరిని అవుతున్న ఫీలింగ్ కలిగిందని అంటాడు. ఈ క్రమంలో రిషి ఇద్దరు వ్యక్తులు ఎంత దూరం ఉన్నా మధ్యలో మూడో వ్యక్తి వచ్చేసరికి ప్రాబ్లెం అవుతుందని అంటాడు. దీంతో మహేంద్ర idhe పాయింట్ చెప్పాలని అనుకున్నా అంటూ ఇద్దరున్నా మనం అనొచ్చు..ముగ్గురున్నాం మనం అనొచ్చు..నువ్వు ఇద్దర్ని కలపి మనం అంటున్నావ్-నేను మనం ముగ్గురం కలిస్తే మనం అంటున్నా... అదే తేడా అని అంటాడు. నీపై నాకు కోపం లేదు..నాకు నువ్వంటే ఎంతో ఇష్టం...కానీ ..నేను ఒంటరిని అనే ఫీలింగ్ కలిగిందని అనడంతో మీరు లేని ఇంట్లో నేనుండటం కష్టంగా ఉందని రిషి అంటాడు. నీకు నేనెలా గుర్తొస్తున్నానో..నాకు జగతి అలా గుర్తొస్తుందని అంటాడు.ఇంటికి రాలేరా అని అడిగితే నీ మనసులో ప్రేమ ఉండాల్సిన చోట ద్వేషం దాగుంది..

    ఆగ్రాకి వెళుతున్నామని

    ఆగ్రాకి వెళుతున్నామని

    ఆ ద్వేషంలో నువ్వు ఏవేవో నిర్ణయాలు తీసుకుంటున్నావ్... మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లో నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల మన కుటుంబం నవ్వుల పాలవుతుంది.. విషయం మినిస్టర్ గారివరకూ వెళ్లింది. ఇవన్నీ ఎందుకు జరిగాయో తెలుసా నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల. నీ నిర్ణయం నీదైతే నా నిర్ణయం నాదని తేల్చి చెబుతాడు. ఇంటికి రాగానే నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్లారు డాడ్ అన్న మాటలు గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు మహేంద్ర. కానీ జగతి రావడం చూసి మళ్లీ నార్మల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. రిషి రమ్మన్నాడా అని అడిగితె రావొచ్చు కదా డాడ్ అన్నాడు.. గట్టిగా వాడిని హత్తుకుని నీపై ఏకోపం లేదురా అని అరవాలని అనిపించింది... కానీ..వెళ్లడానికి రాలేదు కదా అని అంటాడు. అలాగే రిషి ఒంటరి కాకూడదనే ఒకర్ని నియమించానంటూ అటుగా వస్తున్న వసుధారని చూపిస్తాడు. ఇక ఆమెను లిఫ్ట్ చేసుకోవడానికి రిషి వస్తాడు. కార్లో వెళుతూ ఉండగా మనం ఎక్కడికి వెళుతున్నాం అని అడిగ్తే ఆగ్రాకి వెళుతున్నామని అంటాడు.

    ఒప్పుకోరు కదా అంటూ

    ఒప్పుకోరు కదా అంటూ

    అసలు ఆగ్రాకి ఎందుకు అంటే తాజ్ మహల్ చూసివద్దాం అంటాడు. సడెన్ గా తాజ్ మహల్ ఎందుకు అంటే వెటకారం కూడా నీకు అర్థంకాదా అంటాడు. .నీకు మనసులో ఏదీ దాచుకోవడం తెలిదా అని అడిగితే మనసులో ఏమీ లేకపోతే తేలిగ్గా ఉంటుంది. హెడ్ వెయిట్ కూడా తగ్గుతుందని అంటుంది. అంటే నాకు తలబిరుసు అంటావా అని అడిగితే మీరు అలా అర్థం చేసుకుంటే ఏం చేయలేనని అంటుంది. చివరికి మినిస్టర్ దగ్గరకు వెళుతున్నామని అంటాడు. నేనెందుకు సార్ అంటే దిగమని అంటాడు. ఇక తరువాతి ఎపిసోడ్ కమింగ్ లో చూపిస్తున్న దాని ప్రకారం మినిస్టర్ ని కలసిన రిషితో... మీ అమ్మా నాన్న తెలివైనవాళ్లు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వల్ల డీబీఎస్టీ ప్రతిష్ట మరింత పెరిగింది..సడెన్ గా ఆ ప్రాజెక్ట్ రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నావని అడుగుతాడు. నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను సార్ అని రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కార్లో వసుతో పాటూ వెళుతూ... నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని అందరూ అనుకుంటున్నారు కదా అంటే.. తప్పే కానీ మీరు తప్పు ఒప్పుకోరు కదా అంటూ దెప్పి పొడుస్తుంది.

    English summary
    Guppedantha Manasu Episode 407: The minister instructs Mahindra and Jagathi to continue the Mission Education project as long as possible. Mahindra later asks Rishi to reconsider his choice.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X