twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: దేవయానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జగతి.. దెబ్బకు పరార్.. కాలేజ్ లో రిషి షాకింగ్ డెసిషన్!

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. వారం రోజులుగా మొత్తం సీరియల్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూ తిరుగుతోంది. ఆ విషయంలో అప్ సెట్ అయిన మహేంద్ర తన కుమారుడు రిషిని కాదనుకుని భార్య జగతి దగ్గరకు వెళ్తాడు. మహేంద్రా వెళ్లిపో అని జగతి చెబుతూనే ఉన్నా మహీంద్ర మాత్రం రిషి మారాలి అంటే నేను ఇక్కడే ఉండాలని చెబుతూ ఉంటాడు. ఈ ప్రాజెక్టు రద్దు విషయంలో జగతి, మహేంద్ర మినిష్టర్ ను కలుస్తారు. ఆ తరువాత రిషి కలవాడనికి వెళుతూ ఉండగా గత ఎపిసోడ్ ముగించారు. ఇక మార్చి 26 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    వసు వెళ్లిందని

    వసు వెళ్లిందని

    మినిస్టర్ ను కలవడం కోసం తీసుకు వెళుతూ ఉండగా ఎక్కడికి ఎక్కడికి అని పదే పదే వసుధార అడగడంతో మినిస్టర్ గారి దగ్గరకు అంటాడు రిషి. నేనెందుకు అనగానే కారు ఆపేసి దిగు అంటాడు. ఓరినీ ఇలా అంటున్నాడు ఏంటి అని ఊరికే అన్నాను సార్ అని వసు అంటే వెళ్లి రెండు ఫ్లవర్ బొకేలు తీసుకురా అని చెప్పడంతో ఆమె కాస్త రిలాక్స్ అవుతుంది.

    దీంతో నువ్వు అనుకున్నంత హెడ్ వెయిట్ నాకు లేదులే అని రిషి అంటాడు. ఇక మరోపక్క గౌతమ్ వదినతో కాఫీ కావాలని అడుగుతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన దేవయాని రిషి ఎక్కడ అని అడుగుతుంది. మినిస్టర్ గారితో మీటింగ్ కి వెళ్లాడని గౌతమ్ అనడంతో నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయనతో వసు వెళ్లిందని చెబుతాడు.

     ఆశీర్వాదం ఉంటే

    ఆశీర్వాదం ఉంటే

    ఆమె ఎందుకు వెళ్ళింది అని అడిగితె పీఏ కాబట్టి అని అంటాడు. కాలేజీలో అంతమంది అమ్మాయిలు ఉండగా వసు మాత్రమే పీఏ ఎందుకైంది అని దేవయాని అడిగితే ధరణి ఆమె తెలివైంది కాబట్టి అంటుంది. గౌతమ్ కూడా వసుధార కాలేజీలో టాపర్, యూత్ ఐకాన్, సోషల్ సర్వీస్ చేస్తుంది, పార్ట్ టైం జాబ్ చేస్తుంది అంటూ పొగుడుతాడు. వసు వచ్చినప్పటి నుంచే జగతికి బలం అయిపోయింది... రిషి-జగతి-మహేంద్ర ఈ ముగ్గురికీ కేంద్ర బిందువు అయిపోయింది... వసు సంగతేంటో చూడాలి ఆమెను రిషికి దూరం అనుకుంటూ అక్కడి నుంచి వెళుతుంది.

    మరోపక్క రిషి, వసుధార మినిస్టర్ ని కలుస్తారు. మినిస్టర్ మాట్లాడుతూ నీలాంటి ఎండీ ఉంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, మీ అమ్మా-నాన్న చాలా తెలివైన వాళ్ళు-గొప్పవాళ్లు...జరిగిందేదో జరిగిపోయింది..ఆ విషయం నేను మాట్లాడను పెద్ద వాళ్ల ఆశీర్వాదం ఉంటే మనం ఎన్నో విజయాలు సాధించవచ్చని అంటాడు.

    అలా వదిలిపెట్టొచ్చా

    అలా వదిలిపెట్టొచ్చా

    నువ్వు ఇంత గొప్పవాడివి అయ్యావంటే నీ కృషి-పట్టుదల-పెద్దల ఆశీర్వాదం కలిసొచ్చాయి అని అనుకుంటున్నా అని చెప్పి ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లండి...ఆలోచించండి..మీ నిర్ణయం మార్చుకుంటారని ఆశిస్తున్నానని అంటాడు. నేను బాగా ఆలోచించే ప్రాజెక్ట్ విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాను సార్..అందులో మార్పు చేయాల్సింది లేదని నా అభిప్రాయం అని చెప్పి బయలేరతాడు. అయితే జగతి ఇంటికి దేవయాని వస్తుంది.

    వస్తూనే ఏంటి జగతి మొత్తానికి సొంత కుంపటి కల నెరవేరిందా... లోపలకు రావొచ్చా..కొత్తకాపురం ఎలా ఉంది అంటూ ఇద్దరినీ టార్గెట్ చేసి మాటలు అంటుంది. ఆ షార్ట్ ఫిలిం పుణ్యమా అని ప్రపంచానికి మీ బంధం తెలిసిపోయింది...అదే అదనుగా మీరు వేరు కుంపటి పెట్టారు.. ఆ గొడవ నా కెందుకు కానీ నా అబ్బాయి గురించి మాట్లాడేందుకు వచ్చాను అంటుంది. రిషిని పెంచింది నేనే కదా తను నా అబ్బాయే కదా...రిషి చుట్టూ ఆ అమ్మాయిని ఎందుకు తిప్పుతున్నావ్ జగతి... ఆ వసుధారని రిషి వెంట ఎందుకు తిరగనిస్తున్నారు..ఇదేం పద్ధతి..హద్దు-పద్దు లేకుండా వయసుకి వచ్చిన వాళ్లని అలా వదిలిపెట్టొచ్చా..రేపు ఏదైనా జరగరానిది జరిగితే అంటూ రెచ్చిపోతుంది.

    కడుపుమంట చల్లారుతుంది

    కడుపుమంట చల్లారుతుంది

    దానికి జగతి తన జీవితం తన ఇష్టం...ఏదైనా జరిగితే జరగనివ్వండి..అది రిషి సమస్య అని అంటుంది. అయితే నేను కన్నతల్లిని కదా ఎప్పుడో అనిపించింది డైరెక్ట్ గా అడిగేశాను అని అంటుంది. ఏమన్నాడు అంటే వెళ్లి మీ అబ్బాయిని అడగండి..ఏమన్నాడు అని అంటుంది. ఈ విషయంలో కాస్త ఆడుకుందామని ఫిక్స్ అయిన జగతి ఈ విషయం రిషినే అడగండి అని కాల్ చేయబోగా ఫోన్ లాక్కున్న దేవయాని కాల్ చేయనీయకుండా అడ్డుపడుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోబోగా వచ్చినందుకు థ్యాంక్స్ కాస్త మజ్జిగ తాగి వెళతారా కడుపుమంట చల్లారుతుంది అని కౌంటర్ వేస్తుంది జగతి.

    వకాల్తా పుచ్చుకున్నావా? అని

    వకాల్తా పుచ్చుకున్నావా? అని

    అటు కారులో ఇంటికి వెళుతున్న రిషి-వసుధార మధ్య ఆసక్తికర చర్చ నడుస్తుంది. మినిస్టర్ గారి మాటలు మీకు తప్పుగా అనిపించాయా అని రిషిని అడిగితే నీకేం అనిపించిందో చెప్పమని అంటారు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ పై ఆయనకున్న ఇంట్రెస్ట్ చూసి సంతోషం అనిపించింది అంటే నిస్టర్ గారు ఈ మాటలు అన్నప్పటి కన్నా నువ్వు చెప్పినప్పుడు బాగా అనిపిస్తోంది.. బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావ్.

    మీ మేడం, సార్ నిన్ను , మినిస్టర్ గారిని కూడా ప్రభావితం చేశారని అంటాడు. అయితే ప్రాజెక్ట్ రద్దు చేసిన విషయం మీద వ్యక్తిగతంగా నా మనసుకి అనిపించింది మాత్రం..మీరు చేసింది తప్పే...కానీ మీరు తప్పు ఒప్పుకోరు కదా... ఇంతలో కారు ఆగడంతో ఏంటిసార్ దిగి ఏమైనా తీసుకురావాలా అని అంటే మీ ఇల్లు వచ్చిందని అంటాడు.

    అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. తరువాయి ఎపిసోడ్ లో కాలేజీలో లెక్చరర్లు అందరూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ పై రిషిని కొందరు స్టాఫ్ ప్రశ్నిస్తారు. ఎండీగా అది నా నిర్ణయం అని సమాధానం చెబుతాడు రిషి. మాట్లాడేందుకు వెళ్లిన వసుధారతో ఓ ప్రింట్ ఇచ్చాను అది నోటీస్ బోర్డులో పెట్టమని చెప్పు అంటాడు. నోటీస్ బోర్డులో అది చూసి అంతా షాక్ అవుతారు. వాళ్ళ తరుపున మాట్లాడడానికి వెళ్తే వాళ్లకు వకాల్తా పుచ్చుకున్నావా? అని ప్రశ్నిస్తాడు రిషి.

    English summary
    Guppedantha Manasu Episode 408: Rishi gets upset after meeting the minister. Elsewhere, Devayani tries to trouble Jagathi and Mahindra but fails.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X