Guppedantha Manasu: రిషీతో స్టూడెంట్స్ వార్.. దేవయాని కొత్త స్కెచ్.. జగతి కాలేజ్ రీ ఎంట్రీ!
స్టార్ మా చానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ప్రస్తుతానికి సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దు చుట్టూనే సాగుతోంది. మిషన్ ఎడ్యుకేషన్ రద్దు విషయం నోటీసు బోర్డులో పెట్టడంతో స్టూడెంట్స్ అంతా ఆ విషయం తెలుసుకుని షాక్ అవుతారు. ఈ విషయం మీద ఎంత దూరం అయినా వెళ్లాలని భావిస్తూ ఉండడంతో అది చూసి గౌతమ్ ఈ విషయం పెద్దమ్మకి చెప్పడం మంచిది అనుకుని కాల్ చేస్తాడు...కాలేజీలో గొడవ జరుగుతోంది, పెదనాన్నగారిని పంపమని అడుగుతాడు. అలా మొదలైన ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రిషి షాక్
ఆలా ఫోన్ చేసిన గౌతమ్ ను రిషి ఎక్కడున్నాడని దేవయాని అడిగితే రిషి బయటకు వెళ్లాడని, వసుధార కూడా అతనితోనే ఉందని అంటాడు. దీంతో విషయం తెలుసుకున్న ఫణీంద్ర కాలేజీకి బయలుదేరుతాడు. మరోవైపు కార్లో బయటకు వెళుతున్న రిషితో వసుధార మినిస్టర్ గారి దగ్గరకు వెళుతున్నారు కదా ఆయన ఏదైనా చెబితే సరే అనండి అంటే రిషి కారు వెనక్కు తిప్పి తీసుకొచ్చి నేరుగా కాలేజీ దగ్గరకు తీసుకొచ్చి దిగామని చెబుతాడు. నువ్వు కాలేజీకి వెళ్లు నేను మినిస్టర్ గారి దగ్గరకు వెళతాను అని చెప్పి షాకిస్తాడు. అలా దిగి వెళుతూ ఉన్న క్రమంలో స్టూడెంట్స్ ఆమెకు ఎదురు వస్తారు.

దేవయాని మరో స్కెచ్
మరోపక్క దేవయాని కాలేజ్ లో పనిచేస్తున్న ఎవరికో కాల్ చేసి ప్రశాంతత నాకు నచ్చదు అంటుంది. అట్నుంచి అర్థమైంది మేడం అంటారు. కాలేజీలో ఓ స్టూడెంట్ కి కాల్ చేసిన ఆ వ్యక్తి హీరో అవ్వాలి అనుకుంటే సిద్ధంగా ఉండు స్కీమ్ ఏంటో చెబుతాను రాత్రికి రాత్రే హీరో అవుతావ్ అని కాల్ కట్ చేస్తాడు. మరోపక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర మహేంద్ర,జగతి కూర్చుని ఉంటారు. ఇంతలో రిషి కూడా రావడంతో వస్తాడు. వీళ్లు ఇక్కడే ఉన్నారా అనుకుంటూ ఉండగా మీ ముగ్గురినీ ఇలా చూడడం ఆనందంగా ఉందని, తల్లీ కొడుకు గోల్డ్ మెడలిస్ట్, తండ్రి కాలేజీ బాధ్యతలు నిర్వహించే జమ్ గొప్పవాళ్లంతా ఒకే కుటుంబంలో ఉన్నారని మినిష్టర్ మాట్లాడుతూ ఉంటాడు.

మేం దిగితే
రమ్మన్నారు కదా పాయింట్ కి రండి అని అనడంతో మినిస్టర్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడేందుకు మీ అందర్నీ కలిపి కూర్చోబెట్టి మాట్లాడుదాం అని పిలిచాను... మీరంతా ఎప్పటిలా కలిసి ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లండి అంటాడు.
ఈ విషయంలో ఇంతకు ముందే నేను నా అభిప్రాయం చెప్పాను, ఇప్పుడు మీరు మీ అభిప్రాయం చెప్పారు..వెళ్ళొస్తాను సార్ అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. దీంతో ఈ సమస్యను 24 గంటల్లోగా మీరే సాల్వ్ చేసుకోండి..లేదంటే మేమే జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది..మేం దిగితే ఇక విషయం నాన్చడం ఉండదు అంటూ హెచ్చరిస్తాడు మినిష్టర్.

నా కళ్లారా చూశా
మరోవైపు కాలేజీలో వసుధార కనపడడంతో స్టూడెంట్స్ అంతా మేం గట్టిగా పోరాడుతాం, నువ్వు కాలేజీ టాపర్ వి కదా మాతో కలిసి నడవమని అంటారు. లేదు రిషి సార్ అంటూ ఏదో అనడంతో నువ్వు పార్టీ మారిపోయావు, అందుకే సపోర్ట్ చేయవు అని అంటారు. దీంతో వసుధార వాళ్లకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా పట్టించుకోరు.
వసు మనకి సపోర్ట్ చేయదని అనడటంతో అనే వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈలోపు రిషి అక్కడకు రావడంతో మిషన్ ఎడ్యుకేషన్ రద్దు చేశావ్ కదా స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారని గౌతమ్ చెబితే..కాసేపు బాధపడి మరిచిపోతారు అంటాడు. కానీ నువ్వు అనుకున్నంత ఈజీగా పరిస్థితి లేదని చెబుతాడు.
అయితే వసుధారని స్టూడెంట్స్ తో చూసి మొత్తం ఆందోళనకి తానే కారణం అనుకుంటాడు రిషి. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి నీ వెనుక ఎవరున్నారో, ఎవరు చెబితే నువ్వు ఇదంతా చేస్తున్నవో నాకు తెలుసు అంటూ ఆమెతో గట్టిగానే అంటారు. ఏం జరిగిందో, ఏం జరుగుతోందో నాకు అంతా తెలుసు అంటాడు. నువ్వేం చేస్తున్నావో అందర్నీ ఎలా రెచ్చగొడుతున్నావో నా కళ్లారా చూశాను అంటాడు

నువ్వే నడిపిస్తున్నావని నాకు తెలుసు
అసలు నేను రెచ్చగొట్డడం ఏంటి రిషి సార్ అని వసుధార అంటే అంతా నువ్వే నడిపిస్తున్నావని నాకు తెలుసు అని అంటాడు. ఈ సమయంలో స్టూడెంట్స్ సార్ ప్రాజెక్ట్ అని మాట్లాడబోతే రిషి షటప్ అంటూ ఫైర్ అయ్యి. ఏం చేయాలో ఏం చేస్తున్నానో నాకు తెలుసు..మీ అందరితో తర్వాత మాట్లాడతాను అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తదుపరి కమింగ్ అప్ లో ప్లాన్ రిషి దగ్గరకు వెలితే ప్రకారం అంతా చేసి మాట్లాడేందుకు వచ్చావా అని వసుపై ఫైర్ అవుతాడు రిషి.
ఓ సారి స్టూడెంట్స్ తో మాట్లాడేందుకు ప్రయత్నించండి అని చెప్పినా గెటవుట్ అని సీరియస్ అవుతాడు. ఇంతలో ప్రెస్ రావడంతో మహేంద్ర కూడా కాలేజ్ కు వెళతాడు... జగతి మేడంని కాలేజీ నుంచి పంపించేశారంట కదా అని రిపోర్టర్ అడుగుతూ ఉండగా అప్పుడే ఎంట్రీ ఇస్తుంది జగతి. చూడాలి తరువాతి ఎపిసోడ్ లో ఏం జరగనుంది అనేది. .


Click it and Unblock the Notifications











